ప్రభువు విజయము

97 1.      ప్రభువు రాజు!

                              భూమి ఆనందించునుగాక ! నానా ద్వీపములు సంతసించునుగాక !

2.           మేఘమును, తమస్సును

               ప్రభువును చుట్టుమ్టుియుండును.

               నీతిన్యాయములు,

               ఆయన సింహాసనమునకు పునాదులు.

3.           అగ్ని ఆయనకు ముందుగా పోవుచు

               ఆయన చుట్టుపట్లనున్న

               శత్రువులనెల్ల భస్మము చేయును.

4.           ఆయన మెరుపులు లోకమును వెలిగించును.

               ఆ దృశ్యమునుచూచి భూమి కంపించును.

5.           విశ్వధాత్రికి అధిపతియైన ప్రభువును గాంచి,

               కొండలు మైనమువలె కరగిపోవును.

6.           ఆకాశము ఆయన న్యాయమును ప్రకించును. సకలజాతులు ఆయన మహిమను దర్శించును.       

7.            ప్రతిమలను కొలుచువారు విగ్రహారాధనవలన పొంగిపోవువారు,

               సిగ్గుతో మ్రగ్గిపోదురు.

               ఎల్ల వేలుపులారా!

               మీరు ప్రభువునకు దండము పెట్టుడు.

8.           ప్రభూ! నీ న్యాయనిర్ణయములను గాంచి

               సియోను ఆనందించును.

               యూదా నగరములు సంతసించును.

9.           నీవు ప్రభుడవు.

               భూమికంతికి మహోన్నతుడవైన పాలకుడవు.

               ఎల్ల వేలుపులను మించిన దేవుడవు.

10.         చెడును ఏవగించుకొనువారిని

               ప్రభువు ప్రేమించును

               అతడు తన భక్తుల ప్రాణములను కాపాడును.

               వారిని దుష్టుల పీడనమునుండి విడిపించును.

11.           సజ్జనుల మీద వెలుగు ప్రకాశించును.

               ఋజువర్తనులు ఆనందమును బడయుదురు.

12.          నీతిమంతులారా! ప్రభువునందు ఆనందింపుడు.

               ఆయన పవిత్ర నామమునకు

               వందనములు అర్పింపుడు.

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము