సృష్టిలోని వింతలు
104 1. నాప్రాణమా! ప్రభుని స్తుతింపుము. ప్రభూ! నీవు మిక్కిలి ఘనుడవు.
నీవు ప్రాభవవైభములను
వస్త్రమువలె ధరించితివి.
2. వెలుగును వస్త్రమువలె తాల్చితివి. ఆకాశమును గుడారమువలె వ్యాపింపజేసితివి.
3. మీది జలములమీద
ఆయన తన ప్రాసాదమును నిర్మించుచున్నాడు. మేఘములు ఆయన రథములు. వాయురెక్కలమీద ఆయన స్వారిచేయుచున్నాడు.
4. గాలులు ఆయనకు దూతలు,
తళతళలాడు మెరుపులు ఆయన బంటులు.
5. ఆయన నేలను దాని పునాదులమీద నెలకొల్పెను. అది ఏనాికిని కదలదు.
6. ఆ నేలను సముద్రము అను వస్త్రముతో నీవు కప్పితివి.
సాగరజలము కొండలను ముంచివేసెను.
7. నీవు గద్దింపగా
ఆ జలములు భయపడి పారిపోయెను
మేఘగర్జనమువిం
నీ ఆజ్ఞకు వెరచి అవి పరుగిడెను.
8. ఆ నీళ్ళు కొండలనుండి జారి
క్రింది లోయలోనికి పారెను.
అచటనుండి అవి
నీవు నిర్ణయించిన స్థలమును చేరుకొనెను.
9. నీవు ఆ నీళ్ళకు దాటరాని హద్దును నెలకొల్పితివి.
అవి ఆ మేరను దాి వచ్చి
నేలను మరల ముంచివేయవు.
10. ఆయన లోయలలో ఊటలను ప్టుించెను.
వాని నీళ్ళు కొండలనడుమ పారును.
11. వన్యమృగములెల్ల ఆ బుగ్గల నీళ్ళుత్రాగును.
అడవిగాడిదలు ఆ నీితో దప్పిక తీర్చుకొనును.
12. ఆ చేరువలో పకక్షులు గూళ్ళు కట్టుకొని
చెట్లకొమ్మలలోనుండి కూయును.
13. తన ప్రాసాదమునుండి కొండలమీద
వాన కురియించును.
నీ చెయిదము ఫలముగా నేల సంతృప్తిచెందును.
14. ఆయన పశువులకొరకు
గడ్డిని మొలిపించుచున్నాడు.
నరుని ఉపయోగముకొరకు
మొక్కలు మొలిపించుచున్నాడు.
ఆయన నేలనుండి పంటలుపండించును.
15. ఆయన నరుని సంతోషపెట్టుటకు
ద్రాక్షసారాయమును,
అతనికి ఆనందము కలిగించుటకు
ఓలివు తైలమును
అతడిని బలాఢ్యుని చేయుటకు
ఆహారమును దయచేయుచున్నాడు.
16. ఆయన నాిన లెబానోను దేవదారు వృక్షములు
పుష్కల వర్షములతో సంతృప్తి చెందును.
17. వానిలో పకక్షులు గూళ్ళు కట్టుకొనును.
సారసపకక్షులు దేవదారులలో గూళ్ళు కట్టుకొనును.
18. ఎత్తయిన కొండలలో అడవిమేకలు వసించును. పర్వతశిఖరములలో కుందేళ్ళు దాగుకొనును.
19. ఋతువులను ఎరిగించుటకు
నీవు చంద్రుని చేసితివి.
సూర్యునికి తానెప్పుడు
అస్తమింపవలెయునో తెలియును.
20. నీవు రేయిని కొనిరాగా చిమ్మచీకట్లు క్రమ్మును.
అపుడు వన్యమృగములెల్ల వెలుపల తిరుగాడును.
21. కొదమ సింగములు ఎరకొరకు గర్జించును.
అవి దేవునినుండి
తమ ఆహారమును వెదకుకొనును.
22. సూర్యోదయముననే అవి మరలిపోయి
తమ గుహలలో పండుకొనును.
23. అపుడు నరుడు పనికి బయలుదేరును.
అతడు సాయంకాలమువరకు పాటుపడును.
24. ప్రభూ! నీ కార్యములు ఎన్ని విధములుగా ఉన్నవి! నీ చెయిదములన్నిని విజ్ఞానముతో చేసితివి.
ఈ భూమి నీ ప్రాణులతో నిండియున్నది.
25. అదిగో విశాలమైన మహాసముద్రము
ఆ సాగరములో చిన్నవియు, పెద్దవియునైన
ప్రాణులు లెక్కకుమించి జీవించుచుండును.
26. దానిలో ఓడలు సంచరించుచుండును.
నీవు ఆడుకొనుటకు చేసిన మకరమును
దానిలో నున్నది.
27. ఈ ప్రాణులన్నియు నీమీద ఆధారపడి జీవించును
అవి తమకు అవసరమైనపుడు
నీనుండి ఆహారమును బడయును.
28. నీవు వానికి తిండిపెట్టగా అవి తినును.
వానికి ఆహారమును ఈయగా
అవి సంతృప్తిగా భుజించును.
29. నీవు మొగము ప్రక్కకు తిప్పుకొనినచో
అవి తల్లడిల్లును.
వాని ఊపిరి తీసినచో అవి చచ్చును.
తాము ప్టుిన మ్టిలోనే కలిసిపోవును.
30. కాని నీవు ఊపిరిపోసినచో ప్రాణి సృష్టి జరుగును. నీవు భూమికి నూతన జీవమును ఒసగుదువు.
31. ప్రభువు కీర్తి ఏనాికి మాసిపోకుండునుగాక!
ఆయన తన సృష్టిని గాంచి ఆనందించునుగాక!
32. ప్రభువు భూమివైపు పారజూడగా అది కంపించును
కొండలను తాకగా అవి పొగలు వెళ్ళగ్రక్కును.
33. నా జీవితకాలమెల్ల ప్రభువుపై కీర్తనలు పాడెదను.
నేను బ్రతికియున్నంత కాలము
ఆయన స్తుతులు పాడెదను.
34. నా ఈ ఆలోచనలు
ప్రభువునకు ప్రియమగునుగాక!
నేను ప్రభువునందు ఆనందించెదను.
35. దుష్టులు భూమిమీదనుండి తొలగిపోవుదురుగాక!
దుర్మార్గులు కింకి కన్పింపకుండ పోవుదురుగాక!
నా ప్రాణమా! ప్రభువును సన్నుతింపుము.
మీరెల్లరును ప్రభువును స్తుతింపుడు.