ఉదయకాల ప్రార్థన, జాతియంతి ప్రార్థన

దావీదు కీర్తన-గీతము

108 1.    దేవా! నా హృదయము నిశ్చలముగానున్నది

                              నేను నీపై పాటలు పాడి

                              నిన్ను సన్నుతింతును.

2.           నా ప్రాభవము, ప్రభుని కీర్తించును

               నా స్వరమండలమును,

               తంత్రీవాద్యమును మేల్కొనునుగాక!

               నేను ఉషస్సును మేల్కొల్పెదను.

3.           ప్రభూ! నేను వివిధజాతుల నడుమ

               నిన్ను స్తుతించెదను.

               బహుప్రజల నడుమ నిన్ను వినుతించెదను.

4.           నీ కృప ఆకాశమంత ఉన్నతమైనది.

               నీ విశ్వసనీయత మేఘమండలమంత ఎత్తైనది.

5.           దేవా! నీవు మింకి పైగా ఎగయుము.

               ధాత్రినంతిని నీ తేజస్సుతో నింపుము.

6.           మా మొర వినుము,

               నీ కుడిచేతితో మమ్ము ఆదుకొనుము.

               అప్పుడు నీవు కృపతో మనుజుజనులు

               రక్షణమును బడయుదురు.

7.            ప్రభువు తన దేవాలయమునుండి

               మనకు ఇట్లు వాగ్ధానము చేసెను:

               ”నేను విజయము సాధించి,

               షెకెమును పంచిపెట్టెదను.

               సుక్కోతు లోయను విభజించి యిచ్చెదను.

8.           గిలాదు, మనష్షే మండలములు నావే.

               ఎఫ్రాయీము నాకు శిరస్త్రాణము,

               యూదా నాకు రాజదండము.

9.           మోవాబు నేను కాళ్ళు కడుగుకొను పళ్ళెము.

               ఎదోము మీదికి నా పాదరక్షను విసరుదును.

               ఫిలిస్తీయాను ఓడించి

               విజయనాదము చేయుదును!”.

10.         సురక్షితమైయున్న నగరములోనికి

               నన్ను ఎవ్వరు కొనిపోగలరు?

               ఎదోము లోనికి నన్ను ఎవ్వరు తీసికొనిపోగలరు?

11.           దేవా! నీవు మమ్ము నిజముగనే పరిత్యజింతువా?

               మా సైన్యముతో నీవిక యుద్ధమునకు పోవా?

12.          శత్రువులనుండి నీవు మమ్ము ఆదుకొనుము.

               నరుల తోడ్పాటు నిరర్థకము.

13.          దేవుడు మన పక్షమున ఉండెనేని,

               మనము శౌర్యముతో పోరాడుదుము.

               ఆయన మన శత్రువులనెల్ల అణగద్రొక్కును.

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము