మృత్యువును తప్పించుకొనిన నరుని
వందన సమర్పణము
116 1. ప్రభువు నా మొర వినును కనుక
నేను ఆయనను ప్రేమింతును.
ఆయన నా విన్నపమును ఆలకించును.
2. నేను మొరప్టిెనపుడెల్ల నా జీవితకాలమంత
ఆయన చెవియొగ్గి ఆలించును.
3. మృత్యుపాశములు నన్ను చుట్టుకొనెను.
పాతాళ వేదనలు నన్ను చుట్టుముట్టెను.
భయవిచారములు నన్ను క్రమ్ముకొనెను.
4. అప్పుడు నేను ప్రభువునకు మొరప్టిెతిని.
”ఓ ప్రభూ! నీవు నన్ను రక్షింపుము”
అని వేడుకొింని.
5. ప్రభువు దయాళుడు, న్యాయవంతుడు,
మన దేవుడు జాలికలవాడు.
6. ప్రభువు నిష్కపటహృదయులను కాపాడును.
నేను ఆపదలోనున్నపుడు
ఆయన నన్ను ఆదుకొనెను.
7. నా ప్రాణమా! నీవు నమ్మకముతో ఉండుము.
ప్రభువు నీకు మేలు చేసెను.
8. ఆయన నన్ను మృత్యువునుండి రక్షించెను.
నా కన్నీిని తుడిచెను.
నన్ను జారిపడి పోనీయడయ్యెను.
9. కనుక నేను ప్రభువు సన్నిధిలో
జీవవంతుల లోకములో సంచరింతును.
10. ”నేను సర్వనాశనమైపోతిని” అని
అనుకొన్నప్పుడుగూడ నా నమ్మకమును కోల్పోనైతిని
11. నేను భయమునకు లొంగి,
”ఏ నరుని నమ్మగూడదు” అనుకొింని.
12. ప్రభువు నాకు చేసిన ఉపకారములకుగాను
ఆయనకు ఏమి అర్పింపగలను?
13. రక్షణపాత్రమును చేత పుచ్చుకొని,
కృతజ్ఞతావందనములు చెల్లింతును.
14. ప్రభు ప్రజలందరు ప్రోగైన సమాజమున
నా మ్రొక్కులు చెల్లించుకొందును.
15. భక్తిమంతుల మరణము
ప్రభువునకు మిగులవిలువగలది.
16. ప్రభూ ! నేను నీ దాసుడను.
నీ దాసుడను, నీ దాసురాలి కుమారుడను.
నీవు నా మృత్యుబంధములను త్రెంచితివి.
17. నేను నీకు కృతజ్ఞతాబలిని అర్పింతును.
నీ నామమునకు వందనములు చెల్లింతును.
18-19 ప్రభువు ప్రజలందరును ప్రోగైన
సమాజమున, ఓ యెరూషలేమా!
నీ మధ్యనున్న ప్రభువు దేవాలయమున
నా మ్రొక్కులు చెల్లించుకొందును.
మీరు ప్రభువును స్తుతింపుడు.