యెరూషలేమునకు శుభము

దావీదు యాత్ర కీర్తన

122 1.    ”మనము ప్రభువు మందిరమునకు

                              వెళ్ళుదము” అని జనులు పల్కగా

                              నేను ఆనందము చెందితిని.

2.           యెరూషలేమూ! మా పాదములు

               నీ ద్వారములలో అడుగుప్టిెనవి.

3.           యెరూషలేమును పునరుద్ధరించి

               ఏక నగరముగా నిర్మించిరి.

4.           యిస్రాయేలు తెగలు, ప్రభువు తెగలు

               ఇచికి ఎక్కివచ్చి ప్రభువు ఆజ్ఞప్రకారము

               ఆయనకు వందనములు అర్పించును.

5.           ఇచట న్యాయ సింహాసనములు,

               దావీదు వంశజుల

               న్యాయసింహాససములు నెలకొనియున్నవి.

6.           యెరూషలేమునకు

               శుభము కలుగునట్లు ప్రార్థింపుడు

               ”నిన్ను అభిమానముతో చూచువారు

               వర్ధిల్లుదురుగాక!

7.            నీ ప్రాకారములలో శాంతి నెలకొనునుగాక!

               నీ ప్రాసాదములు సురక్షితముగా నుండునుగాక!”

8.           నా మిత్రులు బంధువులకొరకు

               నేను యెరూషలేముతో

               ”నీకు శాంతి కలుగునుగాక!” అని పలుకుదును.

9.           మన ప్రభువైన దేవుని మందిరముకొరకు

               నేను నీకు అభ్యుదయము

               కలుగవలెనని ప్రార్థింతును.

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము