ప్రవాస గీతము
137 1. మేము బబులోనియా
నదులచెంత కూర్చుండి,
సియోనును తలంచుకొని విలపించితిమి
2. అచటనున్న నిరవంజిచెట్లకు
మా తంత్రీవాద్యములను తగిలించితిమి.
3. మమ్ము బందీలుగా కొనిపోయినవారు
”మీరు పాటలుపాడి మమ్ము ఉల్లాసపరచుడు”
అని అడిగిరి.
సియోనునుగూర్చిన గీతములు పాడుడని కోరిరి.
4. కాని అన్యదేశమున మేము
ప్రభువు కీర్తనలు ఎట్లు పాడుదుము?
5. యెరూషలేమూ! నేను నిన్ను విస్మరించినచో,
నా కుడిచేయి చచ్చుపడునుగాక!
6. నేను నిన్ను మరచిపోయినచో,
నా మహానందము యెరూషలేమని ఎంచనిచో,
నా నాలుక అంగికి కరచుకొనిపోవునుగాక!
7. ప్రభూ!యెరూషలేము పట్టువడిన రోజున
ఎదోమీయులు ఏమి చేసిరో చూడుము.
వారు ”ఆ నగరమును పడగ్టొి
నేలమట్టము చేయుడు” అని పలికిరి.
8. బబులోనియా కుమారీ!
నీవు తప్పక నాశమగుదువు.
నీవు మాకు చేసిన అపకారములకు నీకు
ప్రత్యుపకారము చేయువాడు ధన్యుడు.
9. నీ పసిపిల్లలనెత్తి బండమీద కొట్టువాడు ధన్యుడు.