విజయ గీతము

దావీదు కీర్తన

144 1.    నాకు ఆశ్రయదుర్గమైన

                              ప్రభువునకు స్తుతి కలుగునుగాక!

                              ఆయన నా చేతులు యుద్ధము

                              చేయుటకు నాకు తర్ఫీదు నిచ్చును.

                              నా వ్రేళ్ళు పోరుసల్పుటకు

                              నన్ను సంసిద్ధుని చేయును.

2.           ఆయన నన్ను కృపతో చూచువాడు,

               నాకు ఆశ్రయస్థానము, నాకు రక్షణదుర్గము, నన్ను కాపాడువాడు, నాకు డాలు,

               నేను నమ్ముకొనినవాడు, నా యేలుబడిలోనున్న

               జాతులను లొంగదీయువాడు.

3.           ప్రభూ! నీవు నరుని గుర్తించుటకు

               అతడు ఏపాివాడు?

               నరమాత్రునిగూర్చి తలంచుటకు

               అతడు ఎంతివాడు?

4.           నరుడు అల్పమైన శ్వాసమువింవాడు.

               అతని రోజులు నీడవలె సాగిపోవును.

5.           ప్రభూ! ఆకాశమును చీల్చుకొని క్రిందికి దిగిరమ్ము

               పర్వతములను తాకుము,

               వాని       నుండి పొగ వెలువడును.

6.           మెరుపులను మెరపించి

               నా శత్రువులను పారద్రోలుము.

               బాణములను గుప్పించి

               వారిని చిందరవందర చేయుము.

7.            ఆకాశమునుండి నీ చేతినిచాచి నన్ను రక్షింపుము.

               విస్తార జలములనుండి నన్ను బయికి లాగుము

               విదేశీయుల బారినుండి నన్ను కాపాడుము.

8.           వారు కల్లలాడువారు,

               కుడిచేతితో అబద్ధ ప్రమాణములు చేయువారు.

9.           ప్రభూ! నేను నీపై నూతనగీతము పాడెదను. థతంత్రీ వాద్యముమీి నిన్ను కీర్తించెదను.

10.         నీవు రాజులకు విజయము దయచేయుదువు. నీ సేవకుడైన దావీదునకు

               భద్రతను ప్రసాదింతువు.

11.           దుష్టులఖడ్గమునుండి నన్ను కాపాడుము,

               అన్యజాతివారినుండి నన్ను రక్షింపుము.

               వారి నోళ్ళు అబద్ధములాడును.

               వారి కుడిచేయి అబద్ధసాక్ష్యము చూపును.

12.          మన కుమారులు యవ్వనమును బడసి

               బలముగా ఎదుగు మొక్కలవలె ఒప్పుదురుగాక!

               మన కుమార్తెలు ప్రాసాదముల

               మూలలందు నిల్చియుండు మేలైన

               స్తంభములవలె అలరారుదురుగాక!

13.          మన గాదెలు పలురకముల

               ధాన్యములతో నిండియుండునుగాక!

               బీళ్ళలో మన గొఱ్ఱెలు

               వేవేల పిల్లలను ఈనునుగాక!

14.          మన పశువులు సమృద్ధిగా

               దూడలను ఈనునుగాక!

               శత్రువులు మన గోడలను

               పగులగొట్టకుందురుగాక!

               ఏ వలసలు వుండకుండుగాక!

               మన వీధులలో ఆర్తనాదములు

               వినిపింపకుండునుగాక!

15.          ఇి్ట థను చేరుకొనిన జాతి ధన్యమైనది.

               ప్రభువును దేవునిగా బడసిన జనులు ధన్యులు.

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము