ఉపోద్ఘాతము:

పేరు: తెస్సలోనిక మొదటి లేఖ చూడగలరు.

కాలం: క్రీ.శ. 51లో వ్రాసి వుండవచ్చును.

రచయిత: పౌలు.

చారిత్రక నేపథ్యము: మొదటి లేఖలో చూచినట్టుగా తెస్సలోనిక క్రైస్తవ సంఘంలో అనేకులు రెండవ రాకడకు సంబంధించిన  అంశం గూర్చి తప్పుడు అభిప్రాయాలు ప్రచారం చేశారు (2:1-2). విశ్వాసుల హింసలు ఎక్కువైనందున ప్రభువు రాకడ త్వరగా వస్తుందని ఎదురుచూశారు.  ఈ నిరీక్షణ ప్రభావంచే కొందరు సోమరులయ్యారు (3:6-13). మరికొందరు ప్రభువు దినము గూర్చిన తర్జన బర్జనలతో కాలక్షేపం చేయసాగారు.  ఇట్టి వారికి కర్తవ్య హెచ్చరికలు చేస్తూ లేఖను రాసాడు పౌలు.

ముఖ్యాంశములు: ప్రభు దినము గూర్చిన చర్చ ప్రధానాంశం (2:1-17). ఈ రోజు దుష్టునిపై దేవుని విజయం తథ్యం, శిక్ష అనివార్యం (2:8). అందుకే క్రైస్తవులనేవారు మోసపోకుండ (2:9-10), ఆందోళన చెందకుండ ప్రశాంతంగా ఉండాలి. సత్యాన్ని గ్రహించని వారికి దుస్థితి తప్పదు. పౌలు మొదటి నుండి రక్షింపబడుటకు ఎన్నుకోబడిన వారికోసం ప్రార్థించాడు (2:13-17). పాపంలోనే వుండిపోయే వారికి మందలింపుతో కూడిన సలహాలను ఇచ్చాడు (3:1-15).

క్రీస్తు చిత్రీకరణ:  క్రీస్తు రెండవ రాకడ గూర్చి ఎక్కువ మార్లు ప్రస్తావించింది ఈ లేఖ లోనే.