అన్యుల కొరకు పౌలు కృషి
3 1. ఇందువలననే అన్యులగు మీకొరకై, క్రీస్తు యేసు బందీనైన పౌలునగు నేను, దేవుని ప్రార్థించు చున్నాను.
2. మీ మేలు కొరకై అనుగ్రహ పూర్వకమైన ఈ పనిని దేవుడు నాకు అప్పగించెనని మీరు నిశ్చయ ముగా వినియుందురు.
3. దేవుడు తన దైవదర్శనాన్ని బహిరంగము చేసి నాకు తెలియపరచెను. దీనిని గూర్చి నేను సంగ్రహముగా వ్రాసితిని.
4. నేను వ్రాసిన దానిని మీరు చదివినచో, క్రీస్తు రహస్యమును నేను గ్రహించి తినని మీకు తెలియగలదు.
5. గతమున మానవులకు ఈ పరమరహస్యము తెలుపబడలేదు. కాని, నేడు దేవుడు తన ఆత్మ మూలమున పవిత్రులగు అపోస్తలు లకును ప్రవక్తలకును దీనిని తెలియజేసెను.
6. అనగా, సువార్తవలన అన్యులకును యూదులతోపాటు దేవుని దీవెనలలో పాలులభించును. వారును ఈ శరీరము యొక్క అవయవములే.క్రీస్తుయేసుద్వారా దేవుడు చేసిన వాగ్దానములో వారును భాగస్తులగుదురు. ఇదియే ఆ పరమరహస్యము.
7. దేవుని విశేషవరముచే నేను ఈ సువార్తీకరణ సేవచేయువాడనైతిని. ఆయన తన శక్తి ప్రభావము ద్వారా దానిని నాకు ఒసగెను.
8. పవిత్రులందరిలో నేను అత్యల్పుడను. అయినను క్రీస్తు అనంత ఐశ్వర్య ములను అన్యులకు అందించువరమును దేవుడు నాకు ప్రసాదించెను.
9. దేవుని రహస్యప్రణాళిక ఎట్లు అమలు జరుపబడవలెనో మానవాళిలో ప్రతి ఒక్కరు గ్రహించునట్లు చేయుటయే నా బాధ్యత. సర్వమునకు సృష్టికర్తయగు దేవుడు తన రహస్యమును గతమున దాచి ఉంచెను.
10. ఏలయన, దివ్యలోకము నందలి ప్రభువులకును, శక్తులకును బహుముఖమైన దేవుని జ్ఞానము దైవసంఘము ద్వారా ఇప్పుడు తెలియజేయ బడుటకే ఆయన అటుల చేసెను.
11. తన శాశ్వత ఉద్దేశానుసారముగనే దేవుడు ఇట్లు చేసెను. ఆయన ఉద్దేశమును మనప్రభువగు యేసుక్రీస్తు ద్వారా నెర వేర్చెను.
12. ఆయనయందలి విశ్వాసమువలనను, ధైర్యముతో మనము దేవునిసన్నిధి చేరుటకు మనకు స్వేచ్ఛ లభించినది.
13. మీ కొరకై నేను శ్రమనొందు చున్నానని మీరు నిరుత్సాహపడవలదని మనవి చేయు చున్నాను. అది అంతయు మీ మహిమ కొరకే గదా!
క్రీస్తు ప్రేమ
14. ఆ కారణము వలననే ఆ తండ్రికి నేను మోకరిల్లుచున్నాను.
15. దివియందలి, భువియందలి ప్రతికుటుంబము తన నిజమైన నామమును ఆ తండ్రి నుండియే పొందుచున్నది.
16. మీరు ఆంతరంగిక స్థిరత్వమును పొందుటకై ఆయన మహిమైశ్వర్యము నుండి మీకు ఆయన ఆత్మద్వారా శక్తిని ప్రసాదించు మని దేవుని అర్థించుచున్నాను.
17. విశ్వాసమువలన క్రీస్తు మీ హృదయములయందు నివాసమేర్పరచు కొనునుగాక అనియు ప్రార్థించుచున్నాను. మీరు ప్రేమలో పాతుకొనిపోయి, వ్రేళ్లూనికొని పోయి, 18. పవిత్రులందరితో సహాక్రీస్తు ప్రేమ ఎంత విశాలమో, ఎంతదీర్ఘమో, ఎంతఉన్నతమో, ఎంతగాఢమో గ్రహింప గల శక్తికల వారు కావలెననియు దేవునకు నా విన్న పము.
19. మీ గ్రహణశక్తిని మించిన క్రీస్తు ప్రేమను మీరు తెలిసికొని దేవుని పరిపూర్ణత్వముతో సంపూర్ణ ముగ నింపబడుదురు గాక!
20. మనయందు పనిచేయు శక్తి ద్వారా మనము కోరిన దానికంటెను, ఊహించుదాని కంటెను, ఎన్నియో రెట్లు అధికముగ నెరవేర్పగల, 21. ఆ దేవునకు, దైవ సంఘమునందును, క్రీస్తు యేసునందును, తరతర ములు సదా మహిమ కలుగునుగాక! ఆమెన్.