క్రొత్త నిబంధనకు సేవకులు

3 1. ఇదియు ఆత్మస్తుతివలెనే మీకు గోచరించుచున్నదా? ఇతరులవలె మేమును, మీకుగాని, మీ నుండిగాని పరిచయ పత్రములను సంపాదింపవలెనా?

2. మీరే మా హృదయములపై వ్రాయబడి అందరును తెలిసికొనదగినదియు, చదువదగినదియు అగు మా పరిచయ పత్రము.

3. క్రీస్తే ఈ పరిచయ పత్రమును వ్రాసి మా ద్వారా పంపెననుట సుస్పష్టము. అది రాతిపలకపై సిరాతో వ్రాయబడలేదు. అది మానవ హృదయములపై సజీవుడగు దేవునిఆత్మతో వ్రాయబడినది.

4. క్రీస్తుద్వారా దేవునిపై మాకున్న విశ్వాసము ఇట్టిది. కనుకనే మేము ఇట్లు పలుకుచున్నాము.

5. మేము ఈ పనిని సాధింపగలమని చెప్పుకొనదగినది ఏదియు మాయందు లేదు. మా సామర్థ్యము దైవ దత్తమే.

6.వ్రాతపూర్వకమగు నియమములను కాక, ఆత్మతో కూడిన క్రొత్తనిబంధనను సేవింపగల సామర్థ్య మును మాకు ఒసగినది ఆయనయే. వ్రాతపూర్వకమగు నియమములు మృత్యుకారకములు. ఆత్మ జీవప్రదాత.

7. ధర్మశాస్త్రము రాతిపలకలపై చెక్కబడినది. అది అనుగ్రహింపబడిననాడు దేవుని మహిమ గోచరించినది. అది క్రమముగా క్షీణించినను, మోషే ముఖముపై గోచరించిన తేజస్సు ఎంతో కాంతిమంత మైనదగుట వలన యిస్రాయేలు ప్రజలు తమ నేత్ర ములను దానిపై నిలుపజాలకపోయిరి. మృత్యు కారక మైన ధర్మశాస్త్రమే అంత వైభవముతో అను గ్రహింపబడినచో, 8. ఆత్మసంబంధమైన పరిచర్య మరెంత మహిమ కలిగియుండునో!

9. మానవులను శిక్షించిన సేవయే అంత మహిమ కలదైనచో మానవులను నీతిమంతులనుగ చేయుసేవ మరెంత అధిక మహిమ కలదైయుండును?

10. ఇప్పటి వైభవము, గతమున ఉన్న మహిమను అధిగమించినదని చెప్పగలము.

11. ఏలయన, కొలదికాలము మాత్రమే నిలిచిన దాని యందే మహిమ ఉన్నచో, సర్వదా నిలిచియుండు దాని యందు ఎంత అధికమైన మహిమ ఉండవలెను?

12. మాకు ఇట్టి నమ్మకము ఉన్నది కనుకనే మేము ఇంత ధైర్యముతో ఉన్నాము. 13. తన ముఖమునందలి తేజస్సు క్షీణించిపోవుటను యిస్రాయేలు ప్రజలు గమనింపకుండ మోషేవలె ముఖమును ముసుగుతో కప్పుకొనవలసిన అవసరము మాకు లేదు.

14. నిజమునకు వారి మనసులు కఠినములైనవి. పాతనిబంధనము పఠించునపుడు ఈనాటికిని వారి మనసులు ఆ ముసుగుతోనే కప్పబడిఉన్నవి. ఏ వ్యక్తియైనను క్రీస్తుతో ఐక్యమును పొందినపుడు మాత్రమే ఆ ముసుగు తొలగింపబడును.

15. ఈనాడు కూడ వారు మోషే ధర్మశాస్త్రమును పఠించునపుడు, ఆ ముసుగు వారి మనసులను కప్పి వేయును.

16. కాని ఒక వ్యక్తి ప్రభువు వంకకు తిరుగగనే ముసుగు తొలగింపబడును.

17. ఇప్పుడు ప్రభువే ఆత్మ. ఆ ప్రభువు ఆత్మ ఎచ్చట ఉండునో అచట స్వాతంత్య్రము ఉండును.

18. కనుక, మనము అందరమును ముసుగులు తొలగిన ముఖ ములతో ప్రభువు మహిమనే ప్రతిబింబించుచున్నాము. ఆ మహిమయే ఆత్మయగు ప్రభువునుండి ప్రసరించుచు, అధికమగు మహిమతో, మనము ఆయనను పోలియుండునట్లు మార్చివేయును.

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము