వివాహ ఉదాహరణ

7 1. సోదరులారా! ఒక వ్యక్తి జీవించియున్నంత కాలమే ధర్మశాస్త్రము అతనిపై అధికారము కలిగి యుండునని మీకు తెలియదా? నేను మ్లాడునది ధర్మశాస్త్రమును గూర్చి ఎరిగిన వారితోనే.

2. ఏల యన, వివాహమైన స్త్రీ భర్త జీవించియున్నంత కాలమే ధర్మశాస్త్రము ప్రకారము అతనికి కట్టుబడియుండును. కాని అతడు మరణించినచో తనను అతనితో బంధించి ఉంచిన ధర్మశాస్త్రమునుండి ఆమె విముక్తి పొందును.

3. కనుక భర్త జీవించియుండగా, ఆమె మరియొక పురుషునితో ఉండెనేని, ఆమె వ్యభిచారిణి అనబడును. కాని, ఆమె భర్త మరణించినచో ధర్మశాస్త్రము ప్రకారము ఆమె స్వాతంత్య్రము గల స్త్రీ అగును. అప్పుడు ఆమె మరియొక పురుషుని వివాహమాడినచో వ్యభిచరించినట్లు కాదు.

4. సోదరులారా! మీ విషయ మున కూడ అట్లే ఉన్నది. ధర్మశాస్త్ర విషయమున, క్రీస్తు శరీరము ద్వారా మీరును మరణించితిరి. కాని దేవుని కొరకై మనము ఉపయోగకరములగు జీవిత ములు జీవించుటకుగాను మృత్యువునుండి లేవనెత్త బడిన క్రీస్తునకు ఇపుడు మీరు చెందియున్నారు.

5. ఏలయన, మన మానవస్వభావము ననుసరించి మనము జీవించినపుడు, ధర్మశాస్త్రముచే పురికొల్ప బడిన పాపపు వాంఛలు మన శరీరములయందు విజృంభించి మృత్యువును కలిగించినవి.

6. కాని, ఇప్పుడు ధర్మశాస్త్రమునుండి విముక్తులమైతిమి. ఏలయన, ఒకప్పుడు మనలను బంధించి ఉంచిన దానిని గూర్చి మరణించితిమిగదా! ఇక మనము వ్రాత పూర్వకమగు ధర్మశాస్త్రమును అనుసరించిన పాత పద్ధతిలోకాక, ఆత్మానుసారమైన క్రొత్తపద్ధతిలో దేవుని సేవించుచున్నాము.

ధర్మశాస్త్రము – పాపము

7. కనుక మనము ఏమనగలము? ధర్మశాస్త్రమే పాపభూయిష్ఠమైనదా? అటులనరాదు. కాని, ధర్మ శాస్త్రము ద్వారా తప్ప నేను పాపము అన ఏమియో ఎరుగలేదు. ఏలయన, ”దురాశపడరాదు” అని ధర్మ శాస్త్రము తెలుపకయున్నచో దురాశపడుట అన ఏమియో నాకు తెలియకుండెడిది.

8. పాపము ఆ శాస నము ద్వారా పనిచేసి, నాయందు పలువిధములైన అత్యాశలను రేపు అవకాశము కనుగొన్నది. ఏలయన,  ధర్మశాస్త్రమే లేనిచో పాపము మరణించినట్లే.

9.  ఒకప్పుడు నేనును ధర్మశాస్త్రము లేకయే జీవించితిని.  కాని, శాసనము వచ్చిన తోడనే పాపము తిరిగి తల యెత్తెను. అంతట నేను మరణించితిని.

10. జీవము పోయవలసిన శాసనము, నా విషయమున మృత్యు వును తీసికొనివచ్చినది.

11. ఏలయన, పాపము శాసనము ద్వారా అవకాశము కలుగజేసుకొని నన్ను మరులుగొలిపి మోసగించి, ఆ శాసనము ద్వారానే అది నన్ను చంపినది.

12. ధర్మశాస్త్రము పవిత్ర మైనదే. శాసనము కూడ పవిత్రము, నీతియుక్తము, ఉత్తమము.

13. అయినచో మంచిగ ఉన్నదే నాకు మరణమును కలిగించినదని దీని అర్థమా? ఎన్నికిని కాదు! పాపము అటుల చేసినది.  పాపము తన స్వభావము సంపూర్ణముగా విదితమగుటకై, మంచిని ఉపయోగించుకొని నాకు మరణమును తెచ్చి పెట్టినది. కనుకనే శాసనముద్వారా పాపము మరింత పాప భూయిష్ఠమైనది.

మానవుని ద్వంద్వప్రకృతి

14. ధర్మశాస్త్రము ఆధ్యాత్మిక సంబంధమైనదని మనము ఎరుగుదుము. కాని నేను పాపమునకు బాని సగా అమ్మబడిన భౌతిక జీవిని.

15. కనుక నేను చేయుచున్నదేమియో నాకు బోధపడదు. ఏలయన, నేను చేయగోరు దానిని చేయక నేను ద్వేషించుదానినే చేయుచున్నాను.

16. చేయుటకు ఇష్టములేని దానిని నేను చేసినచో, ధర్మశాస్త్రము మంచిదేనని నేను ఒప్పు కొందును.

17. కనుక నిజముగ పనిచేయునది నేను కాదు. నాయందు నివసించుచున్న పాపమే పని చేయుచున్నది.

18. నాయందు అనగా నా భౌతిక శరీరమునందు మంచి అనునది లేదని నాకు తెలి యును. ఏలయన మంచి చేయవలెనను కోరిక నాలో ఉన్నను, దానిని నేను చేయలేను.

19. నేను చేయగోరు మేలు చేయక, చేయగోరని చెడును చేయుచున్నాను.

20. కనుక, నేను చేయగోరని దానిని చేసినచో దానిని చేయునది నేను కాదనియే గదా అని దాని భావము! నాయందు నివసించుచున్న పాపమే దానిని చేయుచున్నది.

21. కనుక, మంచి చేయగోరిన నాకు చెడు చేయుటయే మిగులుచున్నది అను ఈ నియమము ఒకి నాలో పనిచేయుచున్నట్లు నేను తెలిసికొంటిని.

22. నా అంతరాత్మ దేవుని ధర్మశాస్త్రమునందు ఆనందించుచున్నది.

23. కాని, నా శరీరమున వేరొక నియమము పనిచేయుట నాకు గోచరించుచున్నది. ఈ నియమము నా మనస్సుయొక్క ఆమోదమును పొందిన ధర్మశాస్త్రముతో పోరాడుచున్నది. ఇది నా శరీరమందు పనిచేయుచున్న పాపపు చట్టమునకు నన్ను బందీని చేయుచున్నది.

24. నేను ఎంత దౌర్భా గ్యుడను! నన్ను మరణమునకు లాగుకొని పోవుచున్న ఈ శరీరమునుండి నన్ను ఉద్దరించువారు ఎవ్వరు?

25. మన ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా దేవునకు కృతజ్ఞతలు.

కనుక నా అంతట నేను, నా మనస్సుతో మాత్రమే దేవునిచట్టమును సేవించుచున్నాను. కాని, నా శరీర ముతో పాపపుచట్టమును సేవించుచున్నాను.