అధికారులు – మన విధులు

13 1. ప్రతివ్యక్తియు పై అధికారులకు లోబడి ఉండవలెను. ఏలయన, దేవుని అనుమతిలేనిదే ఏ అధికారము ఉండదు. ఇప్పటి పాలకులు దేవుని చేతనే పదవుల యందు ఉంచబడిరి.

2. కనుక అధికారులను ఎదిరించువాడు దేవుని ఆజ్ఞను వ్యతిరేకించినట్లే. అటుల చేయు వారు తీర్పును తమపై కొనితెచ్చుకొందురు.

3. ఏలయన, పాలకులు చెడుకార్యములు చేయు వారికే కాని, మంచికార్యములు చేయు వారికి భయంకరులుకారు. కనుక అధికారికి భయపడకుండ ఉండ వలెనని నీవుకోరుదువా? అయినచో సత్కార్యములనే చేయుము. అప్పుడు అతడు నిన్ను పొగడును.

4. ఏలయన, అతడు నీమేలు కొరకై పనిచేయు దేవుని సేవకుడే. కాని నీవు చెడును చేసినచో, అతనిని గూర్చి భయపడ వలెను. ఏలయన, అతడు ఖడ్గమును వృధాగ ధరింపడు. అతడు దేవుని సేవకునిగా చెడుకార్యములు చేయువానిపై దేవుని ఆగ్రహమును కనబరచును.

5. కావున దేవుని ఆగ్రహమును బట్టియేకాక, మనస్సాక్షిని బట్టియు మీరు అధికారులకు విధేయులు కావలెను.

6. ఏలయన, తమ కర్తవ్య నిర్వహణలో అధికారులు దేవుని పరిచారకులుగా పనిచేయుచున్నారు. ఇందుకేకదా మీరు పన్నులు చెల్లించు చున్నది.

7. కనుక ఎవరికి చెల్లింపవలసినది వారికి చెల్లింపుడు. కప్పములను కట్టవలసిన వారికి కప్పములను, పన్నులు కట్టవలసిన వారికి పన్నులను క్టివేయుడు. ఎవరికి భయపడవలెనో వారికి భయపడుడు. ఎవరిని గౌరవింపవలెనో వారిని గౌరవింపుడు.

పరస్పర విధులు

8. ఎవరికిని ఏమియును బాకీపడి ఉండకుడు. మీకు ఉండవలసిన ఒకే ఒక అప్పు. అది ఒకరినొకరిని అన్యోన్యము ప్రేమించుకొనుటయే. తోటి వానిని ప్రేమించువాడే చట్టమును నెరవేర్చినవాడు.

9. ఏలయన, ”వ్యభిచరింపకుము. హత్యచేయకుము, దొంగిలింపకుము, ఇతరుల సొత్తుకై ఆశపడకుము” అను ఈ ఆజ్ఞలు అన్నియును, ఇతర ఆజ్ఞలేవియైనను, ”నిన్ను నీవు ప్రేమించుకొనునట్లే నీ పొరుగువానిని ప్రేమింపుము” అను ఒకే ఆజ్ఞయందు ఇమిడియున్నవి.

10. తోటి వానిని ప్రేమించు వాడు, వానికి ఏ కీడును చేయడు. కనుక ప్రేమ కలిగియుండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే.

11. ఇప్పుడు ఎంత వేళయైనదో మీకు తెలి యును గదా! కనుక తప్పక దీనిని ఆచరింపుడు. మీరు నిద్ర నుండి మేల్కొనవలసిన సమయమైనది. మొదట మనము విశ్వసించిన నాటికంటే ఇప్పుడు మనకు రక్షణ లభించు సమయము మరింత దగ్గరయైనది.

12. రాత్రి ముగియ వచ్చినది. పగలు సమీపించినది. చీకటికిచెందిన పనులను మనము ఇక మానివేయు దము. పగివేళ పోరాట మొనర్చుటకు ఆయుధ ములు ధరించుదము.

13. వెలుతురులో జీవించు ప్రజలుగ, సత్ప్రవర్తన కలిగి యుందము. వినోదముతో కూడిన విందులుకాని, త్రాగుబోతుతనముకాని, భోగలాలసత్వముకాని, అసభ్య వర్తనకాని, పోట్లాట కాని, అసూయకాని ఉండరాదు.

14. కాని, ప్రభు వైన యేసు క్రీస్తును ధరించి, మీ శరీరేచ్ఛలను తృప్తిపరచుటలో మీరు చూపు శ్రద్ధను మానివేయుడు.