అపోస్తలుల హక్కులు, బాధ్యతలు

9 1. నేను స్వతంత్రుడను కానా? నేను అపోస్తలుడను కానా? మన ప్రభువగు యేసును నేను చూడలేదా? ప్రభువుకొరకు చేసిన నా పనికి ఫలము మీరు కాదా?

2.ఇతరులు నన్ను అపోస్తలునిగా అంగీకరింపకున్నను, మీరు మాత్రము నన్ను అపోస్తలునిగా అంగీకరించుచున్నారు. ప్రభువునందలి మీ జీవితమువలన నేను అపోస్తలుడను అనుటకు మీరే ముద్రగాగల నిరూపణము.

3. నన్ను విమర్శించువారికి నా సమాధానమిది.

4. మాకు తినుటకు, త్రాగుటకు అధికారములేదా?

5. ఇతర అపోస్తలులును, ప్రభువు సోదరులును, పేతురును చేయుచున్నట్లు ప్రయాణములో మాతో ఒక క్రైస్తవ గృహిణిని తీసికొనిపోవుటకును మాకు అధికారము లేదా?

6. పనిచేయకుండుటకు బర్నబాయు, నేనును మాత్రమే అధికారము లేనివారమా?

 7. సైనికుడు తన సొంత ఖర్చుతో సైన్యములో పనిచేయునా? అట్లే తానుపెంచిన ద్రాక్షతోటలోని పండ్లుతినని రైతు గలడా? తాను పోషించిన గొఱ్ఱెలమందనుండి లభించిన పాలు త్రాగని వ్యక్తి గలడా?

8. ఇదంతయు నేను ఒక మానవమాత్రునిగా చెప్పుచుంటినా? ఇదే విషయమును ధర్మశాస్త్రమూ చెప్పుట లేదా?

9. ”పంటనూర్చు ఎద్దునోటికి చిక్కము వేయకుము”

అని మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడియున్నది. అయినచో దేవుడు ఎద్దుల విషయము పట్టించు కొనునా?

10. లేక ఇటుల చెప్పుటలో ఆయన యథార్థ ముగ మనలను ఉద్దేశింపలేదా? ఇది మన కొరకే రచింపబడినది! పొలము దున్నువాడును, పంటకూర్చు వాడును ఫలసాయమున పాలుపంచుకొను ఆశతోడనే తమ పనిని చేయవలెను.

11. మీలో మేము ఆధ్యాత్మిక మగు విత్తనమును నాటితిమి. కనుక మీనుండి మేము లౌకిక ప్రయోజనములను పొందినచో మితిమీరుట యగునా?

12. ఇతరులు మీయొద్దనుండి వీనిని ఆశింప అధికారముగల వారైనచో, మాకు అంతకంటె అధికమైన అధికారము లేదా?

కాని మేము ఈ అధికారమును ఉపయోగించు కొనలేదు. అంతేకాదు. క్రీస్తుసువార్తకు ఎట్టి ఆటంకమును కలిగింపకుండుటకై సమస్తమును సహించితిమి.

13. దేవాలయమున పనిచేయువారు దేవాల యమునుండియే ఆహారమును పొందుదురు. బలిపీఠ ముపై బలులర్పించువారు ఆ బలులలో భాగము పొందుదురు. ఇది మీకు నిశ్చయముగ తెలియును.

14. అట్లే సువార్త బోధకులు దానినుండియే తమ జీవనాధారమును పొందవలెనని ప్రభువు శాసించి యున్నాడు.

15. కాని, నేను ఈ అధికారములలో దేనిని వాడుకొనలేదు. ఇప్పుడును వాడుకొను తలంపుతో నేను ఇట్లు వ్రాయుటలేదు. నా యీ అతిశయమును ఎవడైనను నిరర్థకము చేయుటకంటె నాకు చావే మేలు.

16. సువార్తను బోధించుచున్నంత మాత్రమున నాకు గొప్పలు చెప్పుకొను కారణము లేదు. నిజమునకు సువార్తను ప్రకించు ఆవశ్యకత నాపై మోప బడియున్నది. అయ్యో! నేను సువార్తను  ప్రకించని యెడల ఎంత అనర్ధము!

17. ఈ పనిని నాయంతట నేనే చేసినచో నాకు ప్రతిఫలమును ఉండును. కాని ఇది నా అభీష్టమునకు వ్యతిరేకమైనచో నాకు ఒక నిర్వాహకత్వము ఒప్పచెప్పబడినదని అర్థము.

18. కనుక నాకు ప్రతిఫలము ఏమి? సువార్త ప్రచారమునందు నా అధికారమును నేను సంపూర్ణముగా వినియోగించు కొనక, సువార్తను ఉచితముగా ప్రకించుటయే నా ప్రతిఫలము.

19. నేను స్వతంత్రుడను. ఎవరికిని దాసుడను కాను. కాని ఇంకను ఎక్కువమందిని సంపాదించు కొనుటకు అందరికిని నన్ను నేను దాసునిగ చేసికొను చున్నాను.

20. యూదులతో పని చేయునపుడు, వారిని సంపాదించుకొనుటకుగాను యూదునివలె జీవించితిని. నేను మోషే ధర్మశాస్త్రమునకు బద్ధుడను కాకు న్నను, బద్ధులైన వారితోపాటు పనిచేయుచున్నపుడు వారిని సంపాదించుకొనుటకై వారివలెనే జీవించితిని.

21.అట్లే అన్యులతో ఉన్నపుడు వారిని సంపాదించు కొనుటకు యూదుల ధర్మశాస్త్రమునకు దూరముగ, అన్యునివలెనే జీవించితిని. కాని, నేను దేవుని చట్టమునకు విధేయుడను కానని దీని భావము కాదు. ఏలయన, యథార్థముగ నేను క్రీస్తు చట్టమునకు లోనైయున్నాను.

22. విశ్వాసమున బలహీనులగు వ్యక్తులతో ఉన్నప్పుడు, వారిని సంపాదించుకొనుటకై వారిలో ఒకనివలెనైతిని. కనుక నేను కొందరినైనను, ఏ విధముగనైనను రక్షింపగలుగుటకుగాను అందరి కొరకు అన్ని విధములుగనైతిని.

23. సువార్త దీవెనలలో పాలుపంచుకొనుటకు గాను, సువార్తకొరకై నేను ఇదిఅంతయు చేయుచున్నాను.

24. పరుగు పందెమున అందరును పరుగె త్తుదురు. కాని వారిలో ఒక్కడు మాత్రమే బహుమతిని గెలుచుకొనును. ఇది మీకు తెలియును గదా! కావున బహుమతిని అందుకొనునట్లు పరుగెత్తుడు.

25. పోటీలో పాల్గొననున్న క్రీడాకారుడు తననుతాను కఠిన శిక్షణకు లోబరచుకొనును. అశాశ్వతమగు కిరీట మునకై వారు అటుల చేయుదురు. కాని శాశ్వతమగు దానికై మనము ఆ విధముగ చేయుదము.

26. కనుక గమ్యములేకుండ నేను పరుగిడుటలేదు. గాలితో గ్రుద్దులాటవలె నేను పోరాడుటలేదు.

27. ఇతరులకు బోధించిన పిదప నేను భ్రష్టుడను కాకుండుటకై నా శరీరమును నలుగగొట్టుకొనుచు అదుపులో ఉంచు కొందును.

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము