ఉపోద్ఘాతం:
పేరు: ‘యోహాను’ అను హీబ్రూ పదానికి ”దేవుడు అనుగ్రహపూర్ణుడు” అని అర్థం. యేసు పట్ల యోహాను సువార్తీకుడికున్న అవగాహన, సమదృక్పథ(సారూప్య) సువార్తల అవగాహన కన్నా భిన్నంగా వుంటుంది. యోహాను సువార్తీకుడు క్రీస్తు పండ్రెండు మంది శిష్యులలో నొకడు. ఆది క్రైస్తవ సంఘంలో యోహాను పేరుగల వారు ముగ్గురు కనబడతారు. బప్తిస్త యోహాను (మత్త. 3:1), అపోస్తులుడైన యోహాను (13:23; 20:3; 21:7,20), యోహాను అనబడే పెద్ద (అ.కా. 3:3).
కాలం: క్రీ.శ. 90.
రచయిత: అపోస్తులుడైన యోహాను.
ముఖ్యాంశములు: క్రీస్తు మనుష్యావతారమెత్తిన దేవుని వాక్కు (1:1-18). క్రీస్తు మెస్సియా అని అనేకులు సాక్ష్యమిచ్చారు: 1:29, 36 (బప్తిస్తయోహాను), 1:39 – (యోహాను శిష్యులు), 1:45 (ఫిలిప్పు), 1:34,49 (నతనియేలు). క్రీస్తు తన్ను గూర్చి తాను తెలియచేసుకున్నారు. అవి : మహిమ, శక్తి (2:1-11), ప్రవక్త (2:13-23), స్వస్థతలు, జీవాహారం (6:35, నిర్గమ 16:31), తండ్రి నుండి వచ్చినవాడు (7:10-31), జీవజలం (7:37-39), లోకమునకు వెలుగు (8:12), అబ్రాహామునకు పూర్వము నుండే ఉన్నవాడు (8:58), కాపరి (10:7-14), పునరుత్థానం (11:25), రక్షణ (12:47), నూతన ఆజ్ఞ (13:31-35), మార్గం, సత్యం, జీవం (14:6), ద్రాక్షవల్లి (15:1-5), నజరేయుడైన యేసు (19:19), క్రీస్తు ఉనికి, స్వభావం (1:46, 7:27), మెస్సయా(7:40-42), సర్వకాలామయుడు (5:19; 6:46; 10:30, 38). సిలువధారి (3:14; 12:32), నూతన విమోచకుడు (19:14), అత్యున్నత ప్రేమకు సంకేతం (15:13).
క్రీస్తు చిత్రీకరణ: ముఖ్యాంశాల భాగమును చూడగలరు. మానవరూపం ధరించిన దేవునివాక్కు (1:14) జీవముగల దేవుని కుమారుడు (6:69).