సొదొమ దహనము
1. దేవదూతలు ఇద్దరు ఆ సాయంకాలము సొదొమ వచ్చిరి. అప్పుడు లోతు నగరద్వారము వద్ద కూర్చుండియుండెను. అతడు వారిని చూచి ఎదురు వెళ్ళి వారికి సాష్టాంగనమస్కారము చేసెను.
2. అతడు వారితో ”అయ్యలార! మీరు ఈ దాసుని ఇంికి రావలయునని వేడుకొనుచున్నాను. ఈ రాత్రి మా ఇంట గడపుడు. కాళ్ళు కడుగుకొనుడు. పెందలకడ లేచి మీ త్రోవను మీరు పోవచ్చును” అనెను. దానికి వారు ”ఆలాగు కాదు. మేము వీధిలోనే యీ రాత్రి గడిపెదము” అనిరి.
3. కాని లోతు పట్టుపట్టుటచే అతని మాట కాదనలేక వారు అతని యిిింకి వచ్చిరి. లోతు పొంగనిరొట్టెలతో వారికి విందుచేసెను. వారు విందారగించిరి.
4. వారు నిదురించక మునుపే సొదొమ నగరమునందలి పురుషులు-పిన్నలు, పెద్దలు – అందరును ఎగబడివచ్చి లోతు యిిింని చుట్టుమ్టుిరి.
5. ఆ జనులు లోతును పిలిచి ”ఈ రాత్రి నీ ఇల్లు చొచ్చినవారు ఎక్కడ ఉన్నారు? వారిని వెలుపలికి రప్పింపుము. మేము వారిని కూడవల యును” అని కేకలు వేసిరి.
6. లోతు వాకిట ఉన్న జనసమూహము కడకు వెళ్ళెను. వెలుపలికివచ్చి ఇంటి తలుపువేసెను.
7. వారితో ”సోదరులారా! మీరు ఇంత పాతకమునకు తెగింపవలదు.
8. నాకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారు కన్యలు. వారిని మీకు అప్పగింతును. మీ ఇచ్చవచ్చినట్లు చేయుడు. నా యిిిం నీడకు వచ్చిన యీ మనుజులకు మాత్రము మీరు ఏ అపచారము చేయవలదు” అనెను.
9. దానికి వారు ”నీవు నోరెత్తకుండ అవతలికి పొమ్ము. వీడు పరదేశిగా వచ్చి యిక్కడ పాతుకొనిపోయెను. నేికి మనపాలి పెద్ద తీర్పుగాడయ్యెను. ఓరీ! ముందు వారికంటె ఎక్కువగా నిన్నవమానపరుతుము” అనిరి. వారు గుంపుక్టి లోతు మీదపడి తలుపు పగులగొట్టుటకు దగ్గరకు వచ్చిరి.
10. కాని లోపలనున్న మనుజులిద్దరు వెలుపలికి చేతులుచాచి, లోతును లోనికి లాగి, తలుపులు మూసిరి.
11. పిదప తలుపుదగ్గర ఉన్న వారిలో పిన్నలనుండి పెద్దలవరకు అందరకును కించూపు పోవునట్లు చేసిరి. అందుచే వారు తలుపు కనబడక తడబడిరి.
12. ఆ మనుజులు ఇద్దరు లోతుతో ”ఇక్కడ నీ కుమారులుగాని, కుమార్తెలుగాని, అల్లుళ్ళుగాని, ఎవరైన ఉన్నారా? వారికి అయినవారు ఇంకెవరైన ఉన్నచో వారిని అందరను నీవు ఇక్కడి నుండి నగరము వెలుపలికి తీసికొనిపొమ్ము.
13. మేము ఈ నగరమును నేలమట్టము చేయబోవుచున్నాము. ఈ నగరములోని వారిని దండింపవలయునను మొర మాిమాికి చెవినిబడుటచే, దీనిని నాశనము చేయుటకు దేవుడు మమ్ము పంపెను” అని అనిరి.
14. లోతు వెళ్ళి తనకు కాబోవు అల్లుళ్ళతో ”లెండు, ఈ చోటు వదలిపొండు. దేవుడు ఈ నగరమును నాశనము చేయబోవుచున్నాడు” అని చెప్పెను. కాని వారు లోతు ఎగతాళికి అటుల చెప్పుచున్నాడు కాబోలని అనుకొనిరి.
15. తెల్లవారిన తరువాత దేవదూతలు లోతును వెళ్ళిపొమ్మని తొందరప్టిెరి. అతనితో ”తొందర పడుము. ఇక్కడ ఉన్న నీ భార్యను కుమార్తెలను తీసికొని వెళ్ళిపొమ్ము. పోకున్న ఈ నగరము వారు తాము చేసిన తప్పులకు అగ్గిపాలగునపుడు నీవును బుగ్గియై పోదువు” అనిరి.
16. కాని లోతు జాగుచేసెను. అయినను దేవుడు అతనిపట్ల కనికరము చూపెను. కావున దేవదూతలు లోతు చేతులు పట్టుకొని, భార్యతో కుమార్తెలతో అతనిని నగరము వెలుపలికి తీసికొనివచ్చిరి.
17. వెలుపలికి చేర్చిన తరువాత వారు ”ప్రాణములు దక్కించుకొనదలచిన, ఇక్కడి నుండి పారిపోవుడు. వెనుకకు తిరిగిచూడకుడు. మైదానములో ఎక్కడ ఆగకుడు. కొండలకు పారిపోవుడు. పారిపోకున్న మీరును బూడిదయై పోదురు” అనిరి.
18. అంతట లోతు ”అయ్యా! అటుల కాదు.
19. మీరు ఈ దాసుని పట్ల ఎంతయో మన్నన చూపితిరి. నా ప్రాణములు కాపాడి మీకు నాయందున్న దయ ఎంత అధికమో రుజువుచేసితిరి. నేను కొండలకు తప్పించుకొని పోలేను. అక్కడ ఉపద్రవములపాలై చచ్చిపోవుదునేమో!
20. ఇదిగో! పారిపోవుటకు ఇక్కడికి దగ్గరగా ఒక చిన్న ఊరున్నది. నన్ను అక్కడికి తప్పించుకొనిపోయి బ్రతుకనిండు. అదియే ఆ చిన్న ఊరు” అనెను.
21. దేవదూత అతనితో ”నీ మనవి మన్నింతును. నీవు చెప్పిన ఆ ఊరిని నాశనము చేయను.
22. తొందరగా నీవు అక్కడికి పారిపొమ్ము. నీవు అక్కడికి చేరుదాక నేను ఏమియు చేయజాలను” అనెను. కావుననే ఆ ఊరికి సోయరు1 అను పేరు వచ్చెను.
23. లోతు సోయరు చొచ్చునప్పికి ఆ ప్రదేశ మున సూర్యుడు ఉదయించెను.
24. దేవుడు ఆకాశము నుండి సొదొమ గొమొఱ్ఱాల మీద అగ్నిని, గంధకమును కురిపించెను.
25. దేవుడు ఆ పట్టణ ములను నేలమట్టము చేసెను. మైదానమునెల్ల నాశనము చేసెను. పట్టణప్రజలను చంపెను. నేల నుండి ప్టుిపెరిగిన చెట్టుచేమలను బూడిదచేసెను.
26. అపుడు లోతు భార్య అతని వెంట నడచివచ్చుచు వెనుదిరిగి చూచెను. చూచిన వెంటనే ఆమె ఉప్పు కంబముగా మారిపోయెను.
మోవాబీయులు – అమ్మోనీయులు
27. అబ్రహాము వేకువజాముననే లేచెను. పూర్వము తాను దేవునిసన్నిధిన నిలచిన చోికి వచ్చెను.
28. అతడు సొదొమ గొమొఱ్ఱాలవైపు, మైదానమువైపు చూచెను. దట్టమైన ఆవము పొగవలె నేలనుండి పొగ పైకిలేచుచుండెను.
29. ఆ రీతిగా మైదానపు నగరములను నాశనము చేసినపుడు దేవుడు అబ్రహామును గుర్తుతెచ్చుకొనెను. లోతు నివసించు చున్న పట్టణములను నేలమట్టము గావించినప్పుడు దేవుడు అతనిని ఆ ఉపద్రవమునుండి తప్పించెను.
30. లోతు సోయరులో ఉండుటకు భయపడెను. సోయరు వదలి అతడు కుమార్తెలతో పర్వతప్రాంత మున నివసించెను. అతడు అతని కుమార్తెలిద్దరు ఒక గుహలో వసించిరి.
31. ఇట్లుండ అక్క, చెల్లెలితో ”మన తండ్రి ముసలివాడాయెను. లోకాచారము ప్రకారముగా మనలను కూడుటకు ఒక్క మగపురుగ యినను దేశములో కనబడుటలేదుగదా!
32. కావున తండ్రిని తప్పద్రాగింతము. అప్పుడు అతనితో శయనింతము. ఈ విధముగా తండ్రి వలన మన వంశమును నిలుపుకొందము” అనెను.
33. ఆ రాత్రి వారు తండ్రికి ద్రాక్షసారాయమునిచ్చిరి. పెద్దకూతురు వచ్చి అతనితో శయనించెను. ఆమె ఎప్పుడువచ్చి శయనించెనో, ఎప్పుడు లేచివెళ్ళెనో అతనికి తెలియ దాయెను.
34. మరునాడు అక్క, చెల్లెలితో ”నిన్ని రేయి నేను తండ్రితో శయనించితిని. ఈ రాత్రి కూడ తండ్రికి త్రాగుటకు ద్రాక్షసారాయము పోయుదము. అప్పుడు నీవుపోయి అతనితో శయనింపుము. ఈ రీతిగా తండ్రివలన వంశము నిలుపుకొందము” అనెను.
35. ఆ రాత్రిగూడ తండ్రి త్రాగుటకు ద్రాక్ష సారాయమును ఇచ్చిరి. అంతట చిన్నకూతురు వెళ్ళి తండ్రితో శయనించెను. ఆమె ఎప్పుడు వచ్చి శయనించెనో, ఎప్పుడు లేచివెళ్ళెనో తండ్రికి తెలియ దాయెను.
36. ఈ విధముగా లోతు కుమార్తెలు తండ్రివలన గర్భవతులైరి.
37. వారిలో పెద్దకూతురు కుమారుని కని అతనికి మోవాబు అను పేరుపెట్టెను. అతడే ఇప్పి మోవాబీయులకు మూలపురుషుడు.
38. చిన్న కూతురు ఒక కుమారుని కని అతనికి బెన్-అమ్మి అనుపేరు పెట్టెను. అతడే ఇప్పి అమ్మోనీయులకు మూలపురుషుడు.