1. అంతట యాకోబు ప్రయాణము సాగించు చుండగా, త్రోవలో దేవదూతలు అతనికి ఎదురొచ్చిరి.

2. యాకోబు వారిని చూచి ”ఇది దేవుని సైన్యము” అని పలికెను. కావున ఆ చోికి మహనయీము3 అను పేరు పెట్టెను.

యాకోబు ఏసావును కలసికొనుటకు సిద్ధమగుట

3. యాకోబు  తనకంటె  ముందుగా ఎదోము దేశమునందు సేయీరు మండలములోఉన్న తన అన్న ఏసావునొద్దకు దూతలను పంపెను.

4. నా మాటలుగా ఏసావునకు చెప్పుడని వారితో ఇట్లనెను: ”ప్రభూ! నీ దాసుడు యాకోబు ఇట్లు చెప్పుచున్నాడు. నేను పరదేశిగ లాబాను దగ్గరుింని. ఇప్పివరకు అక్కడనే నివసించితిని.

5. నాకు ఎడ్లు, గాడిదలు, గొఱ్ఱెలు, మేకలు కలవు. దాసదాసీజనమున్నది. ప్రభూ! నీ అనుగ్రహము సంపాదించుకొనుటకే నీవద్దకు వర్తమానము పంపుచున్నాను.”

6. వార్తావాహకులు తిరిగొచ్చి యాకోబుతో ”మేము మీ అన్నను చూచివచ్చితిమి. నాలుగువందల మందిని వెంటబెట్టుగొని  త్రోవలోనే నిన్ను కలసి కొనుటకు ఏసావు బయలుదేరి వచ్చుచున్నాడు” అనిరి.

7. యాకోబునకు మిక్కిలి భయము, తత్తరపాటు కలిగెను. అతడు తనవెంట నున్నవారిని, మేకలను, గొఱ్ఱెలను, పశువులను, ఒంటెలను రెండు గుంపు లుగా విడదీసెను.

8. ఏసావు ఒక గుంపు మీదబడి దానిని కూల్చివేసినను, రెండవగుంపైనను అతనిబారిన పడక తప్పించుకొనిపోవునని అతడు తలంచెను.

9. అప్పుడు యాకోబు ”నా తండ్రి అబ్రహాము దేవా! నా తండ్రి ఈసాకు దేవా! స్వదేశమందలి చుట్టపక్కాల దగ్గరకు వెళ్ళుమని నన్ను ఆదేశించి నిన్ను సంపన్నుని చేయుదునని మాటయిచ్చిన ప్రభూ!

10. ఈ నీ దాసునిపట్ల నీవుచూపిన దయకు విశ్వాసము నకు అపాత్రుడను. నేను యోర్దాను దాినపుడు చేతిలో నా చేతికఱ్ఱతప్ప ఇంకేమియులేదు. కాని ఈనాడో ఈ రెండు బలగములతో తిరిగివచ్చితిని.

11. మా అన్న ఏసావు వచ్చి, తల్లియనక, పిల్లయనక వరుసప్టిె అందరిని ఊచకోత కోయునని భయపడుచున్నాను.

12. నిన్ను మహాసంపన్నుని చేయుదుననియు, సముద్ర తీరమునందలి ఇసుకవలె లెక్కలకందనట్లు నీ సంతతిని విస్తరిల్ల చేయుదుననియు నీవే నాకు చెప్పితివిగదా!” అని ప్రార్థించెను.

13. యాకోబు ఆ రాత్రి అక్కడనే గడిపెను. సోదరుడగు ఏసావునకు బహుమానముగా పంపుటకై అతడు తనదగ్గర ఉన్న మందలనుండి 14. రెండు వందల ఆడుమేకలను, ఇరువది మేకపోతులను, రెండువందల ఆడుగొఱ్ఱెలను, ఇరువది పొట్టేళ్ళను, 15. పిల్లలతోపాటు ముప్పది పాడిఒంటెలను, నలువది ఆవులను, పది కోడెలను, ఇరువది ఆడు గాడిదలను, పది మగగాడిదలను ఎన్నుకొనెను.

16. అతడు విడివిడిగా ఒక్కొక్కమందను ఒక్కొక్క  దాసునకు అప్పజెప్పి, ”మీరు నాకంటె ముందుగా సాగిపొండు. మందకుమందకు నడుమ ఎడముండునట్లు చూడుడు” అని చెప్పెను.

17. అప్పుడు మొది మందవానికి ”మా సోదరుడు ఏసావు త్రోవలో నిన్ను కలిసికొని నీవు ఎవ్వరివాడవు? ఎక్కడికి వెళ్ళుచున్నావు? నీవు తోలుకొనిపోవుచున్న ఈ మంద యెవ్వరిది? అని అడిగినచో నీవు అతనితో, 18. ఇది మీ దాసుడగు యాకోబుమంద. మా ఏలిక అగు ఏసావునకు దీనిని కానుకగా పంపెను. ఆయన మా వెనుకనే వచ్చు చున్నాడని చెప్పుము” అని తెలియజేసెను.

19. ఏసావు కలసినప్పుడు మీరు ఆయనతో చెప్పవలసిన మాటలివియే అని యాకోబు రెండవవానిని, మూడవవానిని, మందలవెంటనున్న వారందరిని ఆజ్ఞాపించెను.

20. మీ దాసుడు యాకోబు మా వెనుకవచ్చుచున్నాడని కూడ తెలియజేయుడు అనెను. ‘నేను ముందుగా పంపిన ఈ  కానుకలతో అతని కోపము చల్లారునట్లు చేసెదను. ఇక ఆ తరువాత అతని సముఖమునకు వెళ్ళినప్పుడతడు నన్ను సాదరముగాచూచును’ అని యాకోబు  తనలో  తాను అనుకొనెను.

21. కావున యాకోబు తనకంటె ముందుగా కానుకలు పంపెను. అతడు విడిదియందే ఆ రాత్రి గడపెను.

యాకోబు దేవునితో కుస్తీపట్టుట

22. యాకోబు రాత్రివేళ లేచి తన భార్యలను ఇద్దరను, దాసీస్త్రీలను ఇద్దరను, కొడుకులను పదునొకండ్రను వెంటబెట్టుకొనిపోయి యబ్బోకురేవు దాటెను.

23. యాకోబు వారిని తీసికొనిపోయి యేరు దాించిన తరువాత తనకున్నదంతయు, యేి ఆవలి యొడ్డుకు చేర్పించెను.

24. ఇక యాకోబు ఒక్కడే మిగిలిపోయెను. అప్పుడు ఒకానొక నరుడు తెల్లవారు వరకు అతనితో కుస్తీపట్టెను.

25. ఆ మనుష్యుడు యాకోబునెంత సేపికి ఓడింపలేక పోవుటచే అతని తుింమీదకొట్టెను. అంతటవారు పెనుగులాడుచుండగా యాకోబునకు తుిం తొలగెను.

26. ఆ మనుష్యుడు ”తెల్లవారు చున్నది నన్నికపోనిమ్ము” అనెను. దానికి యాకోబు ”నన్ను దీవించువరకు నిన్ను వెళ్ళనీయను” అని పలికెను.

27. అతడు ”నీ పేరేమి?” అని అడుగగా, ఇతడు ”నా పేరు యాకోబు” అని జవాబుచెప్పెను.

28. ఆ మనుష్యుడు ”ఇక ముందు నీకు యాకోబు అను పేరు కాక, యిస్రాయేలు1 అను పేరుఉండును. నీవు దేవునితో మానవులతో పోరాడి గెల్చితివి కావున నీకు ఆ పేరు కలుగును” అని చెప్పెను.

29. యాకోబు ”దయచేసి నీ పేరు చెప్పుము” అని అడిగెను. దానికి ఆ మనుష్యుడు ”నా పేరడుగనేల?” అని అక్కడనే యాకోబును దీవించెను.

30. ”నేను దేవుని ముఖాముఖి చూచితిని. అయినను బ్రతికి బయటపడితిని” అనుకొని యాకోబు ఆ చోికి పెనుయేలు2 అను పేరుపెట్టెను.

31. యాకోబు పెనుయేలునుండి సాగిపోవుచుండగా ప్రొద్దు పొడిచెను. తుింతొలగుటచే అతడు కుంటుకొనుచు పోయెను.

32. కావుననే యిస్రాయేలీయులు ఈ నాికి గూడ తుింనరమును తినరు. ఆ మనుష్యుడు యాకోబును తుిం నరముమీద కొట్టెనుగదా!

Previous                                                                                                                                                                                                  Next                                                                                      

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము