యాకోబు బేతేలు చేరుట

1. దేవుడు యాకోబుతో ”నీవు లేచి, బేతేలునకు వెళ్ళి అచట స్థిరపడుము. నీవు నీ సోదరుడు ఏసావు బారినపడక తప్పించుకొని పారిపోవు చున్నపుడు, నీకు ప్రత్యక్షమయిన దేవునకు అక్కడ ఒక బలిపీఠమును నిర్మింపుము” అనెను.

2. కావున యాకోబు ఇంివారితో, తనతో ఉన్నవారితో ”మీ దగ్గరఉన్న అన్యదేవతా విగ్రహములను పారవేయుడు. మిమ్మల్నిమీరు శుద్ధిచేసికొని, మైలబట్టలు మార్చు కొనుడు.

3. మనము బేతేలునకు వెళ్ళుదము. ఇక్కట్లు చ్టుిమ్టుిననాడు నా మొరాలకించిన దేవునకు, నేను వెళ్ళిన త్రోవపొడుగున నన్ను వేయికన్నులతో కాపాడిన దేవునకు ఒక బలిపీఠము నిర్మింతును” అనెను.

4. వారందరు తమ దగ్గరనున్న దేవతా విగ్రహ ములను చెవిపోగులను యాకోబునకు అప్పగించిరి. అతడు వానినన్నిని షెకెము దగ్గర ఉన్న సింధూర వృక్షము క్రింద పాతిపెట్టెను.

5. తరువాత వారు బయలుదేరిరి. దేవునిభయము చుట్టుపట్టులనున్న నగరములపైకొచ్చెను. అక్కడి వారు యాకోబు కుమారులను వెాండుటకు సాహసింపలేదు.

6. యాకోబు, అతనివెంట ఉన్నవారందరు కనాను దేశమందలి లూజునకు వచ్చిరి. అదే బేతేలు.

7. అక్కడతడు ఒక బలిపీఠమును నిర్మించెను. సోదరుని బారిబడక, తప్పించుకొని పారిపోవుచున్న తనకు, ఆ చోట దేవుడు ప్రత్యక్షమయ్యెను. కావున, అతడు దానికి ‘ఎల్‌ బేతేలు’ అను పేరు పెట్టెను.

8. అప్పుడు రిబ్కా దాది దెబోరా చనిపోయెను. యాకోబు ఆమెను బేతేలు నకు దిగువనున్న సింధూరవృక్షము క్రింద పాతిపెట్టెను. కావున ఆ చోికి ”అల్లోన్‌బొకుత్‌”1 అనుపేరు వచ్చెను.

9. పద్దనారాము నుండి వచ్చిన తరువాత దేవుడు మరల యాకోబునకు ప్రత్యక్షమై అతనిని దీవించెను.

10. దేవుడు అతనితో నీ పేరు యాకోబు. ఇకనుండి నీకు యాకోబు అనుపేరుండదు. నీకు ‘యిస్రాయేలు’ అను పేరు చెల్లును అనెను. కావున అతనికి యిస్రాయేలు అను పేరువచ్చెను.

11. దేవుడు ఇంకను అతనితో ”నేను సర్వశక్తిమంతుడగు దేవుడను. నీవు ఫలించి వృద్ధిచెందుము. నీవలన అనేకజాతులు అవతరించును. నీనుండి రాజులు పుట్టుదురు.

12. అబ్రహామునకు, ఈసాకునకు ఇచ్చిన దేశమును నీకు ఇచ్చుచున్నాను. నీ తరువాత నీసంతతికి ఈ దేశమును అప్పగింతును” అని చెప్పెను.

13. దేవుడు తాను మ్లాడిన తావు నుండి యాకోబును వీడి వెళ్ళెను.

14. యాకోబు దేవుడు తనతో మ్లాడినచోట ఒక స్తంభము నెత్తెను. అది శిలాస్తంభము. అతడు దానిపై పానీయమును పోసి, తైలాభిషేకము చేసెను.

15. యాకోబు దేవుడు తనతో మ్లాడిన చోికి ‘బేతేలు’ అను పేరు పెట్టెను.

రాహేలు మరణము

16. వారు బేతేలునుండి బయలుదేరిరి. ఎఫ్రాతాకు  కొంచెము దూరముననుండగా రాహేలు పురినొప్పులు పడెను.

17. ఆమెకు ప్రసవవేదన దుర్భరముగా ఉండెను. ఆమె నొప్పులచే బాధపడు చున్నప్పుడు మంత్రసాని ”భయపడకుము. నీకు మరి యొక కొడుకు పుట్టబోవుచున్నాడు” అని చెప్పెను.

18. ప్రాణములు పోవుచున్నప్పుడు, చివరి ఊపిరి విడుచుచు రాహేలు కుమారునకు బెనోని1 అను పేరు పెట్టెను. కాని తండ్రి అతనిని బెన్యామీను2 అను పేరున పిలిచెను.

19. ఆ విధముగా రాహేలు మృతినొందెను. ఆమెను ఎఫ్రాతాకు పోవు బాటప్రక్క పాతిప్టిెరి. ఈ ఎఫ్రాతాయే బేత్లెహేము.

20. యాకోబు ఆమె సమాధి మీద స్తంభమునెత్తెను. ఈనాికి దానిని ‘రాహేలు స్తంభము’ అను పేరున పిలచుచున్నారు.

21. ఆ తరువాత యిస్రాయేలు ముందుకు సాగిపోయి ఏదెరు గోపురమునకు అవతల గుడారము వేసెను.         

22. యిస్రాయేలు ఆ మండలములందు నివ సించుచున్నప్పుడు, రూబేను వెళ్ళి తండ్రి ఉంపుడు కత్తెయగు బిల్హాతో శయనించెను. ఇది యిస్రాయేలు వినెను.

పన్నిద్దరు యాకోబు కుమారులు

23. యాకోబునకు కొడుకులు పండ్రెండుగురు కలరు. అతనికి మొదటప్టుిన రూబేను, తరువాతి వారయిన షిమ్యోను, లేవి, యూదా, ఇస్సాఖారు, సెబూలూను అనువారు లేయా కుమారులు.

24. రాహేలు కుమారులు యోసేపు, బెన్యామీను.

25. దాను, నఫ్తాలి అనువారు రాహేలు దాసియగు బిల్హాపుత్రులు.

26. గాదు, ఆషేరు అను వారు లేయా దాసియగు జిల్ఫా సుతులు. వీరందరు పద్దనారాములో ప్టుిన యాకోబు కుమారులు.

ఈసాకు మరణము

27. యాకోబు మమ్రేలో ఉన్న తండ్రి దగ్గరకు వచ్చెను. ఆ తావునే ‘కిరియత్‌ అర్బా’ లేక ‘హెబ్రోను’ అని అందురు. అబ్రహాము, ఈసాకు అక్కడనే పరదేశులుగ నివసించిరి.

28. చనిపోవునాికి ఈసాకు వయస్సు నూటయెనుబదియేండ్లు.

29. పండుబారిన వయస్సులో మరణించి, అతడు తన పితరులను చేరుకొనెను. అతని కుమారులు ఏసావు, యాకోబు అతనిని పాతిప్టిెరి.

Previous                                                                                                                                                                                                  Next                                                                                       

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము