ఐగుప్తుదేశమున యోసేపు తొలిరోజులు

1. యిష్మాయేలీయులు యోసేపును ఐగుప్తు దేశమునకు తీసికొని వెళ్ళిరి కదా! పోతీఫరు అను ఐగుప్తుదేశీయుడు యిష్మాయేలీయులనుండి అతనిని కొనెను. ఫోతీఫరు ఫరోరాజు కడనున్న ఉద్యోగి. రాజ సంరక్షకులకు నాయకుడు.

2. దేవుడు యోసేపునకు తోడుగాఉండెను. కావుననే అతడు వర్ధిల్లెను. యోసేపు ఐగుప్తుదేశీయుడగు యజమానుని ఇంిలో ఉండెను.

3. దేవుడు అతనికి తోడుగానుండుటయు, అతడు చేయుచున్న పనులన్నియు విజయవంతములు అగు టయు పోతీఫరు కనిపెట్టెను.

4. కావున యోసేపు యజమానుని అనుగ్రహమునకు పాత్రుడై, ఇష్టసేవకుడు అయ్యెను. పోతీఫరు యోసేపునకు ఇంి పెత్తనమంత ఇచ్చుటయేకాక తన సర్వస్వమును అతనికి అప్పగించెను.

5. ఆనాినుండియు యోసేపును బ్టి దేవుడు ఆ ఇంిని చల్లనిచూపు చూచెను. పోతీఫరు ఇల్లువాకిలి, పొలముపుట్ర సమస్తమును, దేవునికృపకు పాత్రము లయ్యెను.

6. అతడు తిండి మాటతప్ప ఇంకేమియు ప్టించుకొనెడివాడుకాడు. సర్వస్వమును యోసేపునకు అప్పగించి చీకుచింత లేక ఉండెడివాడు.

యోసేపు – యజమానుని భార్య

7. యోసేపు చక్కని రూపవంతుడు, అందగాడు. యజమానుని భార్య అతనిమీద కన్నువేసెను. తనతో శయనింపరమ్మని కోరెను.

8. కాని యోసేపు అందులకు అంగీకరింపలేదు. ”అమ్మా! ఈ ఇంిలో ఏమి జరుగుచున్నదో నాకుతప్ప నా యజమానునకు ఏమియు పట్టదు. ఆయన తనకు ఉన్నదంతయు నాకు అప్పగించెను.

9. ఈ ఇంిలో నాకన్నా పైవాడు ఎవడును లేడు. నీవు ఆయనకు భార్యవు. కావుననే ఆయన నిన్నొక్కదానిని తప్ప మిగిలినదంతయు నాకు అప్పగించెను. కాగా, నేనింత దుష్కార్యమునకెట్లు ఒడిగట్టుదును? ఇది దైవద్రోహము కాదా?” అనెను.

10. అయినను ప్రతిదినము ఆమె యోసేపును అట్లే అర్ధించుచుండెను. అతడు ఆమె కోరికను నిరాకరించు చుండెను. చివరకు యోసేపు ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు ఆమెకడకు పోవుటకూడ మానివేసెను.

11. ఇట్లుండగా ఒకనాడు యోసేపు ఎప్పివలె పనిమీద యజమానుని ఇంిలోపలికి వెళ్ళెను. ఇంి బలగములోని ఏ ఒక్కడునూ అక్కడలేడు.

12. యజమానుని భార్య అతని పై వస్త్రమును పట్టుకొని  తనతో శయనింపరమ్మని అడిగెను. అతడా పై వస్త్రమును ఆమె చేతిలోనే వదలివేసి, ఇంినుండి వెలుపలికి పారిపోయెను.

13. అతడు తన పై వస్త్రమును ఆమె చేతిలో వదలి పారిపోవుట చూచి  14. వెంటనే ఆమె ఇంిలో వారిని  పిలిచి ”చూచితిరా! మనలను అవహేళన చేయుటకై మీ యజమానుడు ఒక హెబ్రీయుని తీసికొనివచ్చి నెత్తికి ఎక్కించుకొని నాడు. వాడేమో లోపలికివచ్చి నాతో శయనింపనెంచి నా యొద్దకు రాగ 15. నేను కెవ్వున కేకవేసితిని. నా కేకలువిని వాడు పైవస్త్రమును విడిచిపారిపోయెను” అని చెప్పెను.

16. ఆమె యజమానుడు వచ్చువరకు అతని పైవస్త్రమును తన దగ్గరనే ఉంచుకొని తన భర్తతో తన కథను ఏకరువు పెట్టెను.

17. ఆమె ”చూచితిరా! మీరు కొనితెచ్చి నెత్తికెక్కించుకొన్న బానిస ఉన్నాడే! ఆ హెబ్రీయుడు నన్ను అల్లరిపాలు చేయుటకు ఇక్కడికి వచ్చెను.

18. నేను గొంతెత్తి బిగ్గరగా కేకలు పెట్టుసరికి వాడు తన పైవస్త్రమును నా చేతిలో వదలి పారిపోయెను” అని అతనితో చెప్పెను.

19. ”మీ సేవకుని ప్రవర్తనము ఈ తీరుగా ఉన్నది” అని భార్య యోసేపును ఉద్దేశించి  వల్లించిన  మాటలు విని యజ మానుడు మండిపడెను.

20.యోసేపును బంధించి రాజుగారి ఖైదీలుండు చెరసాలలో త్రోయించెను.

చెరసాలలో యోసేపు

21. యోసేపు కారాగారమునందే ఉండెను. అయినను దేవుడు అతనికి తోడుగాఉండెను. కావుననే కారాగార పాలకునకు అతనిమీద దయకలిగెను. 

22. అతడు బంధితులందరిని యోసేపునకు అప్పగించెను. యోసేపు వారిచే ఆయాపనులు చేయించెడివాడు.

23. యావే యోసేపునకు సహాయపడుచు అతడు చేయు పనులు సఫలీకృతము కావించుచుండెను. కావున కారాగార అధికారి యోసేపు పెత్తనమునకు ఏనాడును అడ్డుచెప్పలేదు.

Previous                                                                                                                                                                                             Next                                                                                       

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము