యోసేపు ఫరోసేవకుల కలలు వివరించుట

1. తరువాత కొన్నాళ్ళకు ఐగుప్తుదేశపు రాజ పానీయవాహకుడును, వంటవాడును తమ యేలికపట్ల తప్పుచేసిరి.

2. పానీయవాహకులలోను, వంటవారి లోను వారిరువురు ముఖ్యులు. ఫరో రాజు  ఆ ఇద్దరి మీద కోపపడెను. 3. వారిని రాజసంరక్షక నాయకునకు అప్పగించి, యోసేపు ఉన్న చెరసాలలో త్రోయించెను.

4. ఆ నాయకుడు వారి మంచిచెడ్డలు చూచుటకు యోసేపును నియమించెను. యోసేపు వారి అక్కరలు తీర్చుచుండెను. వారిరువురు చెరసాలలో కొన్నాళ్ళుండిరి.

5. ఆ తరువాత పానీయవాహకుడు, వంటవాడు ఇరువురును ఒకేరాత్రి కలలుగనిరి. ఆ కలలు రెండును రెండు రకములు.

6. మరుసి ప్రొద్దున యోసేపు వారికడకు వచ్చెను. వారు చింతాక్రాంతులై ఉండుట చూచెను.

7. ”మీ మొగములు చిన్నబోయినవేల?” అని వారినడిగెను.

8. ”మేము కలలుగింమి. వాని అర్థము వివరించి చెప్పెడువాడు ఒకడును లేడు” అని వారనిరి. యోసేపు ”స్వప్న వ్యాఖ్యానము దేవుని వశముగదా? మీ కలలేమో చెప్పుడు” అనెను.

9. అంతట పానీయవాహకుడిట్లు చెప్పదొడగెను. ”నా కలయిది: నా ముందు ద్రాక్షాలత ఉండుట చూచితిని. 10. దానికి మూడు రెమ్మలుగలవు. ఆ లత మొగ్గ తొడిగినదో లేదో వెంటనే పూలుపూచెను. దాని  గుత్తులును పండెను.

11. నా చేతిలో ఫరో ప్రభువు పాన పాత్రఉన్నది. నేను పండ్లుకోసితిని. పాత్రలో రసమును పిండి ప్రభువునకు ఇచ్చితిని.”

12. యోసేపు అతనితో ”నీ కలకు అర్థమిది: మూడు రెమ్మలు మూడురోజులు, 13. మూడురోజులలో ఫరో ప్రభువు నిన్ను ఆదరించి  తిరిగి నీ పదవియందు నిలుపును. అప్పుడు యథావిధిగా నీవు ఆ చక్రవర్తికి పానీయవాహకుడవు అయ్యెదవు.

14. నీకు మేలు కలిగినపుడు నన్ను గుర్తుపెట్టుకొనుము. నాపై దయ చూపుము. ప్రభువునకు నా విషయము విన్న వింపుము. నేను చెరసాలనుండి బయటపడునట్లు చూడుము.

15. హెబ్రీయుల దేశమునుండి నన్ను అపహరించుకొనివచ్చిరి. ఇక్కడ చీకికొట్టులో త్రోయ దగినంత తప్పును నేనేమియు చేయలేదు” అనెను.

16. అనుకూలముగా స్వప్న వ్యాఖ్యానము చేసిన యోసేపుతో వంటవాడు ”అయ్యా! నేనును ఒక కల కింని. తెల్ల పిండివంటల గంపలు మూడు నా తలమీద ఉన్నవి.

17. పైనున్న గంపలో ఫరో ప్రభువు నకు ఇష్టములైన వివిధ పిండివంటలు కలవు. కాని పకక్షులు ఆ గంపలోని పిండివంటలను తినుచుండెను” అని చెప్పెను.

18. అంతట యోసేపు ”దీని అర్థమిది. మూడుగంపలు మూడురోజులు.

19. మూడురోజుల తరువాత ఫరోరాజు నిన్ను విడుదల చేసి చెట్టుకు వ్రేలాడదీయించును. అప్పుడు మింటపోవు పకక్షులు నీ మాంసమును భక్షించును”  అని చెప్పెను.

20. మూడవరోజున ఫరోరాజు జన్మ దినోత్స వము జరిగెను. ఆయన తన సేవకులందరికి విందు చేసెను. ముఖ్య పానీయవాహకుని, వంటవానిని చెర నుండి విడిపించి సేవకులయెదుికి కొనివచ్చెను.

21. పానీయవాహకునకు పూర్వపదవినే దయచేయగా అతడు ఫరో చేతికి పానపాత్రను అందించెను.

22. కాని రాజు వంటవానిని ఉరితీయించెను. యోసేపు కలలను వ్యాఖ్యానించిన విధముగనే అంతా జరిగెను.

23. అయినప్పికి ముఖ్య పానీయవాహకుడు  యోసేపును మరచిపోయెను.

Previous                                                                                                                                                                                                  Next                                                                                       

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము