ఫరో కలలు

1. రెండేండ్ల తరువాత ఫరోప్రభువు ఒక కల కనెను. అతడు నైలునది ఒడ్డున నిలుచుండెను.

2. ఇంతలో ఏడు ఆవులు నదినుండి పైకివచ్చి జమ్ములో మేయుచుండెను. అవి కండప్టి చూడచక్కగానుండెను.

3. కొంతసేపికి మరి ఏడు ఆవులు నది నుండి పైకివచ్చెను. అవి బక్కచిక్కి వికారముగా నుండెను. అవి యేి ఒడ్డుననే మొదటవచ్చిన ఆవుల సరసన నిలబడెను.

4. బక్కచిక్కి వికారముగానున్న ఆవులు, కండప్టి చక్కగా ఉన్న ఆవులను తినివేసెను. అంతట ఫరోరాజు మేల్కొనెను.

5. అతడు మరల నిద్రపోయెను. మరల ఒక కలకనెను. కలలో ఒక దంటుకు ఏడు మంచిపుష్టిగల కంకులు పుట్టుటచూచెను.

6. వాని తరువాత ఏడు సన్నని పీలకంకులు పుట్టెను. అవి తూర్పుగాలి వీచుట చేత యెండిపోవుచుండెను. 7. ఈ పీలకంకులు గ్టి కంకులను మ్రింగివేసెను. ఫరోప్రభువు మేల్కొని అది కలయని గ్రహించెను.

8. తెల్లవారిన తరువాత అతని మనస్సు కలవర పడెను. ఫరోరాజు ఐగుప్తుదేశములో ఉన్న సర్వ మంత్రగాండ్రను, సమస్తజ్ఞానులను పిలిపించి, వారికి తన కలలను గూర్చి చెప్పెను. కాని వారిలో స్వప్న ఫలములను వివరించు వాడొక్కడును లేడాయెను.

9. అంతట ముఖ్య పానీయవాహకుడు తన యేలికతో ”ఈ నాికి నేను చేసిన తప్పులు నాకు తెలిసివచ్చినవి.       10. ఒకసారి ఏలినవారు దాసులమీద కోపపడితిరి. అప్పుడు నన్నును, ముఖ్యవంటవానిని అంగరక్షకనాయ కుని అధీనమునందుంచి చెరసాలలో త్రోయించిరి.

11. ఒకరాత్రి మేమిరువురము కలలు గింమి. అవి వేరువేరు భావములు కలవి.

12. చెరసాలలో మాతో పాటు ఒక హెబ్రీయ పడుచువాడు ఉండెను. అతడు అంగరక్షకనాయకుని సేవకుడు. మేమతనికి మా కలలు చెప్పుకొింమి.

13. అతడు చెప్పినట్టే మా కలలు నిజములైయినవి. నాకు కొలువు దొరికినది, వంట వానిని ఉరితీసిరి.”

14. ఫరోరాజు యోసేపును పిలువనంపెను. సేవకులు అతనిని శీఘ్రముగా కొనివచ్చిరి. అతడు క్షౌరముచేయించుకొని మంచి ఉడుపులుతాల్చి ఫరో ప్రభువు సముఖమునకు వచ్చెను.

15. ప్రభువు అతనితో ”నేను ఒక కలకింని. దాని ఫలమును తెలియజేయువాడొక్కడును కనబడుటలేదు. నీవు స్వప్నార్థములను వివరింపగలవని వింని” అనెను.

16. దానికి యోసేపు ”నేనెంతవాడను? ఏలిన వారికి మేలు కలుగునట్లుగా దేవుడే చెప్పగలడు” అని బదులు చెప్పెను.

17. అంతట ఫరోరాజు యోసేపుతో ఇట్లు చెప్పెను: ”కలలో నేను నైలునది ఒడ్డున నిలబడితిని.

18. కండప్టి చూడచక్కగానున్న ఏడు ఆవులు నది నుండి పైకి వచ్చి జమ్ములో మేయుచుండెను.

19. తరువాత బక్కచిక్కి వికారముగానున్న మరి ఏడు ఆవులు పైకి వచ్చెను. ఇి్ట బక్క ఆవులను నేను ఐగుప్తు దేశమున ఎన్నడును, ఎచ్చటను చూచియెరుగను.

20. బక్కచిక్కి వికారముగానున్న ఆవులు మొదట వచ్చిన మంచి ఆవుల ఏడింని తినివేసెను.

21. అయినప్పికి వాని కడుపులో కండప్టిన ఆవులు ఉన్నట్లెవడును కనుగొనలేదు. బక్కచిక్కిన ఆవులెప్పి మాదిరిగనే ఉండెను. నేనప్పుడు మేల్కొింని.

22. తిరిగి నిద్రపోతిని. మరియొక కలగింని. ఒక దంటుకు ఏడు మంచిపుష్టిగలకంకులు పుట్టుట చూచితిని. 23. వాని తరువాత తూర్పుగాలితగిలి యెండి, మాడిపోయిన ఏడు పీలకంకులు పుట్టెను.

24. ఈ పీలకంకులు గ్టికంకులను ఏడింని మ్రింగివేసెను. నేను దీనినంతయు శాకునికులతో చెప్పితిని. కాని వివరించువాడు ఎవ్వడును కనబడ లేదు.” 

25. అంతట  యోసేపు ”దేవరవారు కన్న కలలు రెండునూ ఒక్కియే. దేవుడు తాను చేయబోవు పనిని ఏలినవారికి తెలియచేసెను.

26. మంచిఆవులు ఏడును ఏడుసంవత్సరములు. అట్లే మంచికంకులు ఏడును ఏడేండ్లు. కల ఒక్కియే.

27. మంచి ఆవుల తరువాత పైకివచ్చిన బక్కచిక్కి వికారముగానున్న ఆవులు ఏడును ఏడేండ్లు. తూర్పుగాలి తగిలి మాడి పోయిన ఏడు పీలకంకులు ఏడు కరువుయేండ్లు.

28. నేను చెప్పినట్లు దేవుడు తాను చేయబోవు పనిని ఏలినవారికి తెలియచేసెను.

29. మొదట ఏడేండ్లు ఐగుప్తుదేశమంతట పుష్కలముగా పంటలుపండును.

30. తరువాత ఏడేండ్లు దేశమంతట భయంకర క్షామము సంభవించును. దీనివలన ఐగుప్తు దేశము నందలి ప్రజలెల్లరు మొది ఏడేండ్ల సమృద్ధిని మరచిపోవుదురు. ఆ కరువువలన దేశము మలమల మాడిపోవును.

31. రానున్న కరువు మహాదారుణ మైనది. కావున సుభిక్షముగా సాగిపోయిన యేండ్లను ఈ దేశీయులెవ్వరును స్మరింపరు.

32. ఈ విపత్తు కలుగవలెనని దేవుడు ఇదివరకే సంకల్పించెను. ఇక అచిరకాలముననే దానిని కలిగించితీరును. రెండు కలలువచ్చుటకు హేతువు ఇదియే.

33. అందుచేత ఏలినవారు వెంటనే వివేకశీలి, ఉపాయశాలి అగువానినన్వేషించి, దేశమును అతని వశము కావింపవలయును.

34. అంతేకాదు. దేశమునందంతట అధికారులను నియమింపవల యును. పుష్కలముగా పంటలుపండు ఏడేండ్ల కాలములో, పంటలో ఐదవవంతు సేకరింపవల యును.

35. ఈ విధముగా సుభిక్షములైన ఏడేండ్లలో లభించు పంటనంతయును ప్రోగుచేయవలయును. ప్రోగుచేసినపంటను ఏలినవారి వశముచేసి నగర ములో భద్రపరుపవలయును.

36. అది ఐగుప్తు దేశమున కరువు తాండవించు ఏడేండ్లు గుప్తాహార ముగా ఉండును. ఇట్లు చేసినచో దేశము క్షామమునకు బలిగాదు” అని వక్కాణించెను.

యోసేపు అధికారిగా నియమింపబడుట

37. ఇది విని ఫరోరాజు అతని కొలువువారు సంతసించిరి.

38. అతడు యోసేపును చూపి వారితో ”దేవుని ఆత్మగల ఇి్ట మానవుని మరొకనిని మనము చూడగలమా?” అనెను.

39. తరువాత అతడు యోసేపుతో ”ఇది అంతయు దేవుడు నీకెరుకపరిచెను. కావున నీ విం ఉపాయజ్ఞుడు, వివేకి వేరొకడు లేడు.

40. నా ఇంి పెత్తనమంతయు నీదే. నా ప్రజలందరు నీ మాటకు కట్టువడియుందురు. ఒక్క సింహాసనము విషయమున మాత్రమే నేను నీ కంటెను అధికుడను.

41. ఇదిగో! నేినుండి నిన్ను ఐగుప్తుదేశమునకు సర్వాధికారిగా నియమించుచున్నాను” అని చెప్పెను.

42. ఇట్లు చెప్పి తనచేతనున్న రాజాంగుళీకమును యోసేపు చేతికిపెట్టెను. ధరించుటకు పట్టువస్త్రముల నిచ్చెను. మెడలో బంగారుగొలుసు వేసెను.

43. అతనిని రాజరథమునకు సాియైన మరియొక రథము ఎక్కించి వాడవాడల త్రిప్పించెను. సేవకులు రథము ముందుండి ‘ఇతనికి నమస్కరించుడు’ అని కేకలువేసిరి. ఈ విధముగా యోసేపును ఐగుప్తు దేశమునకు సర్వాధికారిగా నియమించి ఫరోరాజు, 44. ”ఇదిగో! ఫరోనైన నేను చెప్పుచున్నాను. వినుము. ఈ ఐగుప్తుదేశమున నీ అనుమతిలేకుండ ఏఒక్కడును కాలుచేయి కదల్పడు” అనెను.

45.పిదప  యోసేపునకు జఫెనత్పానెయా అను మారుపేరు పెట్టెను. అతనికి ఓను పట్టణ పురోహితుడైన పోతీఫెర కుమార్తెయగు ఆస్నతునిచ్చి పెండ్లిచేసెను. యోసేపు ఐగుప్తుదేశము నందంతట తిరిగెను.

46. ఫరోరాజు కొలువులో చేరిననాికి యోసేపు వయస్సు ముప్పదియేండ్లు. అతడు రాజు సెలవు తీసికొని దేశమునందంతట పర్యించెను.

47. ఏడేండ్లు పుష్కలముగా పంటలుపండినవి.

48. యోసేపు దేశమున పండిన పంటనంతయు సేకరించెను. దానిని పట్టణములో నిలువచేసెను. ఏ పట్టణము చుట్టునున్న పొలములలో పండినపంటను ఆ పట్టణమునందే భద్రపరిచెను.

49. అతడు పెద్దపెద్ద మొత్తములలో ధాన్యమును నిలువచేసెను. సముద్రపు ఇసుక తిప్పలవలె ధాన్యరాసులు పెరిగినవి. అవి కొలతల కందనివి కనుక అతడు వానిని కొలువలేక పోయెను.

యోసేపు కుమారులు

50. కరువు వచ్చుటకు  ముందు యోసేపునకు ఆస్నతువలన ఇద్దరు కుమారులుప్టుిరి. ఆస్నతు ఓనుపట్టణ పురోహితుడైన పోతీఫెర కుమార్తె.

51. దేవుడు నన్ను కన్నవారిని, నా కష్టములను మరచి పోవునట్లు చేసెనని యోసేపు పెద్దకుమారునికి ‘మనష్షే’1 అను పేరు పెట్టెను.

52. నేను కష్టముల పాలైన దేశమునందే దేవుడు  నాకు వృద్ధినిచ్చెనని రెండవ కుమారునకు ‘ఎఫ్రాయీము’2 అను పేరు పెట్టెను.

53. యోసేపు చెప్పినట్టు సమృద్ధిగా పంటలు పండిన ఏడేండ్లు కడచిన తరువాత ఏడేండ్లపాటు కరువు వచ్చెను.

54. ప్రతిదేశమున క్షామము సంభవించినది. కాని ఐగుప్తుదేశములో మాత్రము కావలసినంత తిండిదొరకినది.

55. ఐగుప్తు దేశమందంతట కరువురాగా ప్రజలు ఫరోరాజు కడకు వెళ్ళి మొరపెట్టుకొనిరి. అతడు ”యోసేపు దగ్గరకు వెళ్ళుడు. ఆయన చెప్పినట్టు చేయుడు” అని వారిని ఆజ్ఞాపించెను.

56. దేశము నాలుగుచెరగుల కరువు తాండవించుచున్నది. కనుక యోసేపు ధాన్యపు గిడ్డంగులను తెరచి ప్రజలకు ధాన్యము అమ్మించెను.

57. ప్రతి దేశమున క్షామము దుర్భరముగా ఉండెను. అందుచే సమస్త దేశస్థులు యోసేపువద్ద ధాన్యము కొనుటకై ఐగుప్తుదేశమునకు వచ్చిరి.

Previous                                                                                                                                                                                               Next                                                                                       

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము