పది ఆజ్ఞలు

1. అప్పుడు దేవుడు ఈ పలుకులు పలికెను.

2. ”మిమ్ము దాస్యనిలయమైన ఐగుప్తుదేశము నుండి తోడ్కొని వచ్చిన యావేను నేనే. నేనే మీ దేవుడను.

Pic is taken from https://christianchildmultilingualbibleverse.
wordpress.com/

3. మీకు నేనుతప్ప మరొక దేవుడులేడు.

4. పైనున్న ఆకాశమునందు, క్రిందనున్న భూమి యందు, భూమి అడుగుననున్న నీళ్ళయందును ఉండు ఏ వస్తువుయొక్క ప్రతిరూపమునుగాని విగ్రహమును గాని మీరు నిర్మింపరాదు.

5. మీరు వానికి మ్రొక్కరాదు. వానిని పూజింపగూడదు. మీ దేవుడను యావేను అయిన నేను రోషముగలవాడను. నన్ను ద్వేషించు వారిలో తండ్రులుచేసిన తప్పులకు మూడు, నాలుగు తరములవరకు దండింతును.

6. కాని నన్ను ప్రేమించి, నా నియమములను పాించువారిని వేయితరముల వరకు కరుణింతును.

7. మీరు మీ దేవుడయిన యావే నామమును దుర్వినియోగపరుపరాదు. తన నామమును దుర్విని యోగ పరుచువానిని యావే దండింపక మానడు.

8. విశ్రాంతిదినమును గుర్తుంచుకొనుడు. దానిని పవిత్రము చేయుడు.

9. ఆరురోజులపాటు మీ పనులెల్ల చేసికొన వలయును.

10. ఏడవరోజు మాత్రము మీ దేవుడు అయిన యావేకు పవిత్రమయిన విశ్రాంతిదినము. ఆ రోజు మీరుగాని, మీ కుమారులుగాని, కుమార్తెలు గాని, పనివారుగాని, పశువులుగాని, మీ ఇంటనున్న పరదేశీయులుగాని ఏ పనియు చేయకూడదు.

11. యావే ఆరురోజులలో ఆకాశమును, భూమిని, సముద్రమును వానియందుండువానిని సృష్టించెను. ఆయన ఏడవరోజు విశ్రమించెను. కావున యావే ఆ రోజును దీవించి పవిత్రమయినదానినిగా చేసెను.

12. మీ తల్లిదండ్రులను గౌరవింపుడు. అట్లయిన మీ దేవుడయిన యావే మీకు ప్రసాదించిన దేశములో చిరకాలము జీవింతురు.

13. హత్య చేయరాదు.

14. వ్యభిచరింపరాదు.

15. దొంగతనము చేయరాదు.

16. పొరుగువానికి వ్యతిరేకముగా అబద్ధపుసాక్ష ్యము చెప్పరాదు.

17. మీ పొరుగువాని ఇంిని ఆశింపరాదు. పొరుగువాని భార్యనుగాని, దాసునిగాని, దాసినిగాని, ఎద్దునుగాని, గాడిదనుగాని, మరి అతనిది ఏదైనను గాని ఆశింపరాదు.

మోషే మధ్యవర్తిత్వమును ప్రజలు అంగీకరించుట

18. యిస్రాయేలీయులందరు పొగలుచిమ్ము ఆ కొండను, ఆ ఉరుములను, ఆ మెరుపులనుకని, ఆ కొమ్ముబూరమ్రోతను విని గజగజలాడిరి. వారు దూరముగా నిలబడిరి.

19. వారు మోషేతో ”నీవే మాతో మ్లాడుము, మేము విందుము. దేవుడు మాతో మ్లాడెనా మేము చచ్చుట తథ్యము” అనిరి.

20. అంతట మోషే వారితో ”భయపడకుడు. దేవుడు మిమ్ము పరీక్షింపవచ్చెను. ఇట్లయినగాని దైవభీతి మీ మనస్సులలో శాశ్వతముగా నిలువదు. మీరు పాపము చేయకుండ  ఉందురు”  అనెను.

21. అప్పుడు మోషే దేవుడున్న కారుమబ్బును సమీపించెను. ప్రజలు మాత్రము దూరముగనే నిలబడిరి.

2. నిబంధన గ్రంథము

బలిపీఠ నియమములు

22. యావే మోషేతో నీవు యిస్రాయేలీయు లతో ఈ మాట చెప్పుము:  ”నేను ఆకాశమునుండి మీతో మ్లాడుట మీ కనులార చూచితిరికదా!

23. నన్ను కొలుచుచూ మీరు వెండితోగాని, బంగారము తో గాని, విగ్రహములనుచేసి వానిని పూజింపరాదు”.

24. ”మీరు నా కొరకు మ్టితో బలిపీఠము నిర్మింపవలయును. దానిమీద మీ గొఱ్ఱెలనుగాని, ఎద్దులనుగాని దహనబలులుగా, సమాధానబలులుగా సమర్పింపవలెను. నేను ఆరాధనస్థలము నిర్ణయించిన తావులన్నిట నేను మీకడకు వచ్చి మిమ్ము దీవింతును.

25. మీరు నా కొరకు రాయితో బలిపీఠమును నిర్మించి నచో చెక్కడపురాతిని వాడకుము. మీ పనిముట్లు రాళ్ళకు తగిలిన అవి మైలపడును.

26. మీరు మెట్ల మీదుగా నా బలిపీఠము మీదికి ఎక్కగూడదు. ఆ విధముగా ఎక్కినచో మీ దిగంబరత్వమును చూపిన వారగుదురు.”

Previous                                                                                                                                                                                                 Next   

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము