4. మందిరమును కట్టుట, యాజకులను నియమించుట గుడారము కొరకు విరాళములు

1. యావే మోషేతో మ్లాడుచు, 2. ”నాకు అర్పణములను తీసుకొనిరండు” అని యిస్రాయేలీయు లతో చెప్పుము. హృదయపూర్వకముగా ఇచ్చువాని నుండియే ఈ అర్పణములు స్వీకరింపుము.

3. యిస్రా యేలీయుల నుండి బంగారము, వెండి, ఇత్తడి, 4. ఊదా, ధూమ్ర, ఎరుపు రంగులుగల ఉన్ని, సన్ననార, మేకవెంట్రుకలు, 5. ఎఱ్ఱఅద్దకము వేసిన పొట్టేళ్ళ తోళ్ళు, మేలిమిగ్టితోళ్ళు, తుమ్మకఱ్ఱ, 6. దీపములకు చమురు, అభిషేకతైలమునకు పరిమళ ద్రవ్యములు, ధూపమునకువలయు సుగంధద్రవ్యములు, 7. ప్రధాన యాజకుని పరిశుద్ధవస్త్రమైన ఏఫోదున, వక్షఃఫలకమున పొదుగుటకు కావలసిన లేతపచ్చలు, రత్నములు అర్పణ ముగా తీసికొనుము.

8. నేను వారిలో నివసించుటకు నాకొక పవిత్ర స్థలమును నిర్మింపుము.

9.నేను నీకు చూపు నమూనా ప్రకారముగా నీవు మందిరమును దాని ఉపకరణములను నిర్మింపవలయును.

గుడారము, దాని ఉపకరణములు, మందసము

10. రెండున్నరమూరల1 పొడవు, ఒకిన్నర మూర వెడల్పు, ఒకిన్నరమూర ఎత్తుగల ఒక మందసమును తుమ్మకొయ్యతో చేయవలయును.

11. దానికి లోపల వెలుపల మేలిమిబంగారపు రేకు అతికించవలయును. దాని అంచులందు బంగారపు రేకు కట్టులుండవలయును.

12. ఆ పెట్టెకై నాలుగు బంగారు కడియములను పోతపోయవలయును. ఒక ప్రక్క రెండు, మరియొకప్రక్క రెండు ఉండునట్లుగా ఆ కడియములను పెట్టె నాలుగుకాళ్ళకు అమర్ప వలయును.

13. తుమ్మకఱ్ఱతోనే మోతకఱ్ఱలను కూడ చేసి వానికి బంగారురేకులను తొడుగవలయును.

14. పెట్టెను మోసికొని పోవుటకు దాని ప్రక్కలనున్న కడియములలో ఆ మోతకఱ్ఱలను దూర్పవలయును. 15. మోతకఱ్ఱలు కడియములందే ఉండవలయును. వానిని బయికి తీయరాదు.

16. నేను నీకొసగు శాసన ములను ఆ మందసపుపెట్టెయందు ఉంచవలయును.

17. రెండున్నర మూరల పొడవు, ఒకిన్నర మూర వెడల్పుగల కరుణాపీఠమును మేలిమి బంగారముతో చేయవలయును.

18. ఈ కరుణా పీఠము రెండుకొనలవద్ద నుంచుటకై రెండు కెరూబీము దూతల ప్రతిమలను1 పోతపోసిన బంగారముతో చేయవలయును.

19. కరుణాపీఠమునకు రెండు కొనలవద్ద వాిని ఉంచవలయును. అవి కరుణా పీఠముతో ఏకాండముగా నుండవలయును.

20. అవి రెక్కలు పైకి విచ్చుకొని ఉండవలయును. అట్లయిన ఆ రెక్కలు కరుణాపీఠమును కప్పివేయును. ఆ ఆకృతులు ఒకదానికొకి ఎదురుగా నుండి, కరుణా పీఠమువైపు చూచుచుండవలయును.

21. కరుణా పీఠమును మందసపుపెట్టె పైనుంచుము. నేను నీకు ఒసగు శాసనములను ఆ మందసపుపెట్టెలో ఉంచుము.

22. ఆ కరుణాపీఠము నుండియు, శాసనములు గల మందసపు మీదనుండు రెండు కెరూబుదూతల బొమ్మల నడుమ నుండి నేను మిమ్ము కలిసికొందును. అక్కడినుండియే యిస్రాయేలీయుల కొరకు సమస్త నియమములను నీకు ప్రసాదింతును.

రొట్టెలను సమర్పించుటకు బల్ల

23. రెండు మూరల పొడవు, ఒక మూర వెడల్పు, ఒకిన్నర మూర ఎత్తుగల బల్లను తుమ్మ కఱ్ఱతో చేయవలయును.

24. మేలిమిబంగారపు రేకును దానికి తొడుగవలయును. ఆ బల్ల అంచుల చుట్టు మేలిమిబంగారపుకట్టు ఉండవలయును.

25. బల్లచుట్టు బెత్తెడు వెడల్పుగల బద్దె ఉండవలయును.   ఆ బద్దెచుట్టు  బంగారపుకట్టు ఉండవలయును. 26. బల్లకొరకు నాలుగు బంగారు కడియములు చేసి వానిని దాని నాలుగుకాళ్ళకుండు నాలుగుమూలలా తగిలింప వలయును.

27. బల్లను మోయు మోతకఱ్ఱలుంచు టకు కడియములు బద్దెకు దగ్గరగా ఉండవలయును.

28. తుమ్మకొయ్యతో మోతకఱ్ఱలను చేసి, వానికి బంగారురేకును తొడిగింపవలయును. వానితో బల్లను మోయవలయును.

29. ఆ బల్లమీద వాడుటకై పళ్ళె ములను, ధూపార్తులను, గిన్నెలను, కూజాలను, పానీయ అర్పణనకు వలయు పాత్రములను మేలిమి బంగారముతో చేయవలయును.

30. నిత్యము నాకు సమర్పింపవలసిన సాన్నిధ్యపురొట్టెలను బల్లమీద నా ఎదుట ఉంచవలయును.

దీపస్తంభము

31. మేలిమిబంగారముతో దీపస్తంభము చేయ వలయును. దానిపీఠము, కాండము కమ్మచ్చున తీసిన బంగారముతో నగిషీపనిగా చేయవలయును. ఆ దీపస్తంభముమీది గిన్నెలవిం మొగ్గలు, దళములు దానితో కలిసిపోయి నగిషీపనిగా ఉండవలయును.

32. దానికి ఇటువైపున మూడు, అటువైపున మూడు మొత్తము ఆరుకొమ్మలుండును.

33. దాని ఆరు కొమ్మలకు ఒక్కొక్క కొమ్మకు బాదముపూల రూపమున నున్న గిన్నెలవిం మొగ్గలు, దళములు మూడేసి ఉండవలయును.

34. దీపస్తంభము కాండమున కూడ బాదముపూల రూపముననున్న మొగ్గలు, దళ ములు నాలుగు ఉండవలయును.

35. దీపస్తంభము నకు ప్రతి రెండుకొమ్మల క్రింద ఒక్కొక్క గిన్నె చొప్పున ఉండవలయును.

36. ఆ గిన్నెలు, కొమ్మలు దీప స్తంభముతో ఏకాండము అయివుండవలెను. వీని నన్నిని కమ్మచ్చున తీసిన బంగారముతోనే చేయ వలయును.

37. దీపస్తంభమునకు ఏడు దీపములు చేయవలయును. స్తంభమునకు ముందు వెలుగు పడునట్లుగా వానిని దానికి అమర్చవలయును.

38. ఆ దీపములకువలయు కత్తెరయు, పాత్రయు మేలిమి బంగారముతోనే చేయవలయును.

39. దీపస్తంభ మును మిగిలిన ఉపకరణములను చేయుటకు నలువది వీసెల మేలిమిబంగారము ఉపయోగించవలయును.       

40. కొండమీద నీకు చూపిన నమూనా ప్రకారముగ వీనినన్నిని చేయవలయునని గుర్తుంచుకొనుము.

Previous                                                                                                                                                                                              Next  

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము