ధూపపీఠము

1. ధూపము వేయుటకై తుమ్మ కఱ్ఱతో ఒక పీఠమును తయారుచేయుము.

2. అది చదరముగా ఉండవలయును. దాని పొడవు ఒక మూర, వెడల్పు ఒక మూర, ఎత్తు రెండు మూరలు ఉండవలయును. ఆ పీఠము కొమ్ములు దానితో ఏకాండముగా ఉండ వలయును.

3. పీఠము ఉపరిభాగమును, నాలుగు అంచులను, కొమ్ములను అచ్చమైన బంగారురేకుతో పొదుగుము. దానిచుట్టు బంగారపుకట్టు గూడ ఉండ వలయును.

4. దానిని మోసికొనిపోవుటకై రెండు బంగారు కడియములను చేయించి వానిని ఆ కట్టుకు క్రింద ఇరువైపుల అమర్పుము. వానిలోనికి మోత కఱ్రలను దూర్చి పీఠమును మోసికొని పోవలయును.

5. ఈ మోతకఱ్రలను తుమ్మకఱ్ఱతో చేయించి వానికి బంగారము పొదుగుము.

6. నిబంధనమందసము మీది కరుణాపీఠము ముందుగల తెరకు ముందట ఈ ధూపపీఠమును ఉంచుము. అక్కడ నేను నిన్ను కలిసికొందును.

7. అహరోను ప్రతిదినము ఉదయము దీపపువత్తులను ఎగద్రోయుటకు వచ్చినపుడు ఈ పీఠముపై కమ్మని సాంబ్రాణిపొగ వేయవలయును.

8. సాయంకాలము దీపములు వెలిగింపవచ్చినపుడు, అతడు పీఠముపై సాంబ్రాణిపొగ వేయవలయును. ఈ రీతిగా మీ తరములన్నింటను నిర్విరామముగా సాంబ్రాణిపొగ వేయవలయును.

9. పీఠముమీద నీవు నిషిద్ధమైన సాంబ్రాణిపొగ వేయరాదు. దహించిన పశుబలినిగాని, భోజనబలినిగాని, పానీయబలినిగాని దానిమీద సమర్పింపరాదు.

10. ఏడాదికి ఒకసారి అహరోను ఆ పీఠపు కొమ్ములమీద ప్రాయశ్చిత్తము చేయవలయును, పాపపరిహారముగా సమర్పించిన పశువునెత్తురుతో అహరోను ప్రాయశ్చిత్తము జరుప వలెను. మీ తరతరములకు సంవత్సరమునకొకసారి అతడు దానికొరకు ప్రాయశ్చిత్తము చేయవలయును. ఇది ప్రభువునకు మహాపవిత్రమైనది.”

దేవాలయపు పన్ను

11. ప్రభువు మోషేతో ”నీవు ప్రజల జనాభా వ్రాయించునపుడు ప్రతివాడు తన ప్రాణమునకుగాను ప్రభువునకు పరిహారము చెల్లింపవలయును.

12. ఇట్లుచేసినచో జనాభాలెక్క వ్రాయించినందులకు ప్రజలకు ఏ తెగులును కలుగదు.

13. జనాభాలెక్కలో చేరిన ప్రతివాడును దేవాలయపు తులామానము తూనికచొప్పున అరతులమువెండి చెల్లింపవలయును. ఇది ప్రభువునకు అర్పించు పన్ను.

14. జనాభాలెక్కలో చేరిన ప్రతివాడు, అనగా ఇరువది యేండ్లు మరియు అంతకు పైబడిన ఈడుగల వారందరును ఈ పన్ను చెల్లింపవలయును.

15. మీ ప్రాణములకు పరిహారము గాను ఈ పన్నును యావేకు చెల్లించునపుడు ధన వంతులు ఎక్కువ చెల్లింపనక్కరలేదు. పేదలు తక్కువ చెల్లింపరాదు.

16. ప్రజలనుండి ఈ సొమ్మును ప్రోగు చేసి దానిని గుడారమున కైంకర్యమునకై వినియో గింపుడు. ఈసొమ్ము యావే యిస్రాయేలీయులను స్మరించుకొనునట్లు చేయును. అది మీ ప్రాణములకు గాను చెల్లించిన సొమ్ము” అనెను.

ఇత్తడి గంగాళము

17. ప్రభువు మోషేతో ”నీవు ఇత్తడి గంగాళ మును, దానికి ఇత్తడిపీటను చేయింపుము.

18. దానిని నీళ్ళతోనింపి గుడారమునకు, బలిపీఠమునకు మధ్య ఉంచుము.

19. అహరోను అతనికుమారులు దానిలోని నీితో కాలుసేతులు కడుగుకొందురు.

20.ప్రత్యక్షపుగుడారమున అడుగిడునపుడుగాని, బలిపీఠము మీద అగ్నితో దహనబలులు అర్పించునపుడుగాని ఈ గంగాళములోని నీళ్ళతో కాలుసేతులు కడుగు కొందురేని వారికి ప్రాణహాని కలుగదు.

21. కనుక ప్రాణహాని కలుగకుండవలెనన్న వారు ఈ నీితో కాలుసేతులు కడుగుకొనవలెను. ఇది యిస్రాయేలీ యులు తరతరములవరకు శాశ్వతముగా పాింప వలసిన నియయము” అని చెప్పెను.

సుగంధ తైలము

22. ప్రభువు మోషేతో ”నీవు మంచి సుగంధ ద్రవ్యములు తీసికొనుము.

23.ఐదువందలతులముల పరిమళద్రవ్యము, రెండువందలయేబది తులముల లవంగిపట్ట, రెండువందలయేబదితులముల నిమ్మగడ్డి, ఐదువందలతులముల మొద్దు లవంగిపట్టను తీసి కొనుము.

24. ఈ దినుసులన్నియు దేవాలయపు తులామానము తూకమునకు సరిపోవలయును. ఐదువందల దేవాలయ ప్రామాణిక షెకెల్‌ల ఓలివు నూనె గూడ వానికిచేర్పుము.

25. వీనినన్నిని కలిపి సుగంధద్రవ్యకారులు తయారు చేసినట్లుగనే సుగంధ తైలమును సిద్ధముచేయుడు. ఇది పవిత్రమైన సుగంధి తైలము.

26. దీనితో నీవు సాన్నిధ్యపుగుడారమును, నిబంధనమందసమును, 27. బల్లను, దానిపరికరము లను, దీపస్తంభమును, దానిపరికరములను, ధూప పీఠమును 28. దహనబలులు అర్పించు బలిపీఠమును, దాని ఉపకరణములను, గంగాళమును, దానిపీటను అభిషేకింపుము.

29. ఈ రీతిగా నీవు ఈ వస్తువులను ప్రభువునకు నివేదింపుము. అవి మహాపవిత్రవస్తువు లగును. వానిని తాకిన వస్తువులు కూడ పవిత్రమగును.

30. అహరోనును అతని కుమారులనుగూడ ఈ సుగంధతైలముతో అభిషేకించి నాకు నివేదింపుము. అపుడు వారు నాకు కైంకర్యముచేయు యాజకులు అగుదురు.

31. నీవు యిస్రాయేలీయులతో ”మీ తరములన్నింటను అభిషేకమునకైవాడు ఈ సుగంధ తైలము మహాపవిత్రమైనదిగా ఉండవలయును.

32. దానితో సామాన్య జనమును అభిషేకింపరాదు. దానితో మరియొక సుగంధతైలమును తయారు చేయరాదు. అది పవిత్రమైనది గనుక మీరు దానిని పవిత్రవస్తువుగనే భావింపవలయును.

33. ఈ సుగంధతైలమువిం తైలమును తయారుచేయు వారును, యాజకులు కానివారిని దీనితో అభిషేకము చేయువారును సమాజమునుండి వెలివేయబడుదురు’ అని చెప్పుము” అనెను.

సాంబ్రాణి

34. ప్రభువు మోషేతో ”నీవు జామాంసి, గోపీచందనము, గంధము, సుగంధ ద్రవ్యములు, అచ్చమైన సాంబ్రాణి, జిగురు సమపాళ్ళలో తీసికొని 35. సుగంధిద్రవ్యకారులు చేయు రీతిగనే సాంబ్రాణిని తయారుచేయుము. దానిలో ఉప్పు కలుపవలయును. అది నిర్మలముగను, పవిత్రముగను ఉండవలయును. 36. దానిలో కొంతభాగమును మెత్తగా నలుగగ్టొి, పిండిచేసి ఆ పిండిలో కొంతభాగమును గుడారమున నిబంధనమందసమునెదుట నేను నిన్ను కలిసికొను తావున ఉంచుము. ఈ సాంబ్రాణి పరమపవిత్ర మైనది. 37. మీ ఉపయోగార్థము ఇదే పాళ్ళతో మరియొక సాంబ్రాణిని తయారు చేసికొనరాదు. ఇది ప్రభువునకు అర్పించిన పవిత్రమైన సాంబ్రాణి.

38. ఈ సాంబ్రాణివిం సుగంధద్రవ్యములను తయారు చేయువాడు సమాజమునుండి వెలివేయబడును” అని చెప్పెను.

Previous                                                                                                                                                                                                 Next  

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము