పదియాజ్ఞల పలకలు నిబంధనమును నూత్నీకరించుట

1. ప్రభువు మోషేతో ”నీవు మొది పలకల విం రెండు రాతిపలకలను చెక్కుము. మొది పలకలమీద వ్రాసిన ఆజ్ఞలను మరల వానిమీద వ్రాసెదను. నీవు ఆ తొలిపలకలను పగులగ్టొితివి గదా!

2. నీవు సంసిద్ధుడవై రేపి ఉదయముననే కొండమీదికి రమ్ము. కొండపైన నన్ను కలిసికొనుము.

3. నీతో మరెవ్వరును కొండయెక్కి రాగూడదు. అసలు కొండమీద ఎవరును కనిపింపగూడదు. గొఱ్ఱెల మందలుగాని, పశువుల మందలుగాని కొండఎదుట మేయరాదు” అని చెప్పెను.

4. కనుక మోషే మొది పలకల విం రాతిపలకలను రెండింని తయారు చేసెను. ప్రభువు ఆజ్ఞాపించినట్లుగనే వానిని తీసికొని మరునాి ఉదయమున పెందలకడనే కొండమీదికి ఎక్కిపోయెను.

5. ప్రభువు మేఘమునుండి దిగి వచ్చి మోషే యెదుట నిలుచుండి తన నామమును వెల్లడి చేసెను.

6. ప్రభువు మోషేకు ముందుగా సాగిపోవుచు ఇట్లు ప్రకించెను. ”ప్రభువు! ప్రభువు! ఆయన కరుణామయుడు దయాపరుడునైన దేవుడు. సులభ ముగా కోపపడువాడుకాడు. నిత్యము ప్రేమచూపు వాడు, నమ్మదగినవాడు.

7. ఆయన వేవేలమందికి కృపను చూపుచు దోషములను, అపరాధములను, పాపములను మన్నించువాడు. అయినను ఆయన నరుల పాపమును సహింపడు. తండ్రుల పాపమునకు కుమారులను, ఆ కుమారుల కుమారులను మూడు నాలుగు తరముల వరకు శిక్షించును.”

8. ఆ మాటలు వినినవెంటనే మోషే నేలకు తలవంచి నమస్కరించెను.

9. అతడు ”ప్రభూ! నీకు నా యెడల కాక్షము కలదేని నీవునాతో రమ్ము. ఈ ప్రజలు తలబిరుసువారు! నిజమే. అయినను నీవు మా దోషములను పాపము లను మన్నింపుము. మమ్ము నీ ప్రజగా స్వీకరింపుము” అని మనవిచేసెను.

నిబంధనము

10. ప్రభువు మోషేతో ”నేను మీతో నిబంధనము చేసికొందును. ఈ ప్రపంచమున ఎప్పుడును, ఏ జాతియు కనివిని ఎరుగని మహాద్భుతములు నేను మీ అందరి ఎదుట చేయుదును. నీతోనున్న ఈ ప్రజలెల్లరు ప్రభువు కార్యములను చూచెదరు. నేను మీ ఎదుట చేయునది భీకరమైనది.

11. నేడు నేను మీకిచ్చిన కట్టడలు పాింపుడు. నేను అమోరీయులను, కనానీయులను, హిత్తీయులను, ఫిలిస్తీయులను, హివ్వీయులను, యెబూసీయులను మీ ఎదుినుండి తరిమి వేయుదును.

12. మీరు ప్రవేశించు దేశము నందలి ప్రజలతో పొత్తు కుదుర్చుకొనకుడు. అటుల పొత్తు కుదుర్చుకొందురేని మీరు వారి ప్రలోభములకు చిక్కుకొందురు.

13. పైపెచ్చు మీరు వారి బలిపీఠము లను కూలద్రోయవలయును. వారి విగ్రహములను నాశనముచేసి వారి పవిత్ర కొయ్యస్తంభములను నరికి వేయవలయును.

14. మీరు ఏ అన్యదైవములను ఆరాధింపరాదు. మీ ప్రభువు పేరు ‘ఈర్ష ్య.’ అవును, ఆయన అసూయా పరుడైన దేవుడు.

15. మీకు ఆ దేశవాసులతో పొత్తు పనికిరాదు. ఏలయన ఆప్రజలు వ్యభిచారులవలె తమ దేవతలను ఆరాధించి వారికి బలులు అర్పించునపుడు మిమ్మును ఆహ్వానింపగా మీరును వెళ్ళి వారు అర్పించిన బలులను భుజింతురు.

16. మీరు వారి ఆడుపడుచులను మీ కుమారులకు పెండ్లిచేయగా, ఆ స్త్రీలు తమదేవతలను ఆరాధించునపుడు మీ కుమారులనుగూడ విగ్రహారాధనకు పురికొల్పుదురు.

17. మీరు పోతపోసిన దేవరలను తయారు చేసికొనరాదు.

18. మీరు పొంగనిరొట్టెల పండుగను చేసికొన వలయును. నేను మిమ్ము ఆజ్ఞాపించినట్లు అబీబు మాసమున ఏడునాళ్ళు పొంగనిరొట్టెలు భుజింప వలయును. మీరు ఆ నెలలోనే ఐగుప్తునుండి వెడలి వచ్చితిరి గదా!

19. నరులకుగాని, పశువులకుగాని మొదట ప్టుినపిల్లలు నాకు చెందవలయును. ప్రతి మొది మగబిడ్డయు, పశువుల మందలు, గొఱ్ఱెలమందలు ప్టిెన ప్రతి మొదిమగదియు నాకు చెందును.

20. గాడిద తొలిపిల్లకు మారుగా గొఱ్ఱెపిల్లను అర్పించి ఆ గాడిదపిల్లను విడిపించుకొనవచ్చును. అటుల విడిపింపరేని ఆ గాడిదపిల్ల మెడ విరిచివేయవల యును. మీ తొలిచూలు మగబిడ్డలను గూడ విడిపించు కోవలెను. వ్టి చేతులతో ఎవరును నా సన్నిధికి రాగూడదు.

21. మీరు ఆరునాళ్ళు పనిచేసి ఏడవనాడు విశ్రాంతితీసికొనుడు. దుక్కులుదున్ను కాలమునందైనను,  కోతలుకోయు కాలమునందైనను ఈ నియమమును పాింపవలయును.

22. మీరు వారములపండుగ అనగా గోధుమ పంట తొలివెన్నులను అర్పించుపండుగను, ఏడాది చివరవచ్చు  పంటకూర్చుపండుగను  జరుపుకొన వలయును.

23. మీలో మగవారరదరును ఏడాదికి మూడు మారులు యిస్రాయేలు దేవుడను, ప్రభుడనైన నా సన్నిధికి రావలయును.

24. నేను మీ శత్రువులను మీ చెంతనుండి తరిమివేయుదును. మీ దేశమును విశాలము చేయుదును. అటుపిమ్మట మీరు ఏటేట మూడుమారులు మీ దేవుడైన ప్రభువు ఎదుట మీరు కనపడబోవునపుడు మీ భూమిని ఎవడును ఆశింపడు.

25. మీరు నాకు పశుబలులు అర్పించునపుడు పొంగినరొట్టెలు కొనిరాగూడదు. పాస్కపండుగనాడు వధించిన పశువుమాంసమును మరునాి ఉదయము వరకు అి్టప్టిెకోకూడదు.

26. మీ భూమియొక్క ప్రథమఫలములలో మొదివి నీ దేవుడైన ప్రభువు మందిరమునకు కొనిరావలయును.

మేకపిల్లను దాని తల్లిపాలలో ఉడుకబెట్టరాదు.”

 27. దేవుడైన యావే మోషేతో ”నా మాటలను వ్రాయుము. ఈ మాటల ద్వారా నేను నీతోను, యిస్రాయేలీయులతోను నిబంధన చేసికొనుచున్నాను” అనెను.

28. మోషే ప్రభువుతో నలువది పగళ్ళు నలువది రాత్రులు గడిపెను. ఆ రోజులలో అతడు అన్నపానీయము లేవియును ముట్టుకొనలేదు. అతడు పలకమీద నిబంధనవాక్యములు, అనగా పదియాజ్ఞలను వ్రాసెను.

మోషే కొండ దిగివచ్చుట

29. మోషే శాసనములుగల రెండు పలకలను గైకొని సీనాయి కొండమీదినుండి దిగివచ్చినపుడు యావేతో మ్లాడి వచ్చుటవలన అతని ముఖము ప్రకాశించుచుండెను. కాని అతడు దానిని గుర్తింపనే లేదు.

30. అహరోను యిస్రాయేలుప్రజలు మోషేవైపు చూడగా అతనిముఖము మిలమిల మెరయుచుండెను. కనుక వారు అతనిని సమీపించుటకు భయపడిరి.

31. కాని మోషే పిలువగా అహరోను యిస్రాయేలు నాయకులు అతని చెంతకు వచ్చిరి. మోషే వారితో సంభాషించెను.

32. తరువాత యిస్రాయేలీయు లందరు మోషే ఎదుటకు వచ్చిరి. ప్రభువు సీనాయి కొండమీద తనకు విన్పించిన ఆజ్ఞలను అన్నిని అతడు ప్రజలకు ఎరిగించెను.

33. మోషే వారితో మ్లాడుట చాలించిన తరువాత తన ముఖముమీద ముసుగు వేసికొనెను.

34. అతడు యావే సన్నిధిన మ్లాడుటకు వెళ్ళునపుడెల్ల అటనుండి తిరిగి వచ్చు వరకు ముఖముమీది ముసుగును తొలగించెడి వాడు. తిరిగివచ్చినపిదప ప్రభువు తనకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను యిస్రాయేలీయులకు తెలియజెప్పెడివాడు.

35. యిస్రాయేలీయులు మోషే ముఖము ప్రకాశించు చుండుటను గమనించెడివారు. అతడు మరల ప్రభువు సన్నిధికి వెళ్ళువరకు ముఖమును ముసుగుతో కప్పు కొనెడివాడు.

Previous                                                                                                                                                                                                  Next  

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము