దీపస్తంభము
8 1-2. దేవుడు మోషేతో ఇట్లు సెలవిచ్చెను. నీవు అహరోనుతో ఇట్లు చెప్పుము: ”నీవు దీపమును వెలి గించునపుడు దీపస్తంభముమీది ఏడుదీపముల వెలుగు దీపస్తంభమునకు ముందు భాగమున పడునట్లు చూడవలెను.”
3. అహరోను ప్రభువు ఆజ్ఞాపించినట్లే దీపస్తంభమునకు ముందువైపున దీపములు అమర్చెను.
4. అతడు దీపస్తంభమునంతిని సాగగ్టొిన బంగార ముతో చేసెను. ప్రభువు మోషేకు చూపిన నమూన ప్రకారము దానిని తయారుచేసెను.
లేవీయులు ప్రభువునకు నివేదింపబడుట
5-6. ప్రభువు మోషేతో ఇట్లనెను: ”లేవీయులను యిస్రాయేలీయులనుండి వేరుపరచి శుద్ధిచేయింపుము.
7. వారిపై శుద్ధీకరణ జలమును చల్లుము. వారు కక్షురకత్తితో శరీరమంతిని గొరిగించుకొని తమ బట్ట లను శుభ్రము చేసుకోవలెను. అపుడు వారు శుద్ధి పొందినట్లగును.
8. వారు ఒకకోడెను, నైవేద్యమునకై నూనెకలిపిన గోధుమపిండిని తీసికొనిరావలెను. పాప పరిహారబలికై నీవు మరియొక కోడెను సమకూర్చు కొనుము.
9. లేవీయులను సాన్నిధ్యపుగుడారము నొద్దకు కొనిరమ్ము. యిస్రాయేలీయులందరిని పిలి పింపుము.
10. వారు లేవీయులమీద చేతులు చాప వలెను.
11. అంతట అహరోను యిస్రాయేలు ప్రజల నుండి లేవీయులను వేరుపరచి నాకు ప్రత్యేకమైన కానుకగా వారిని సమర్పింపవలెను. వారిని నా సేవకై నివేదింపవలెను. అప్పినుండి వారు నా సేవకు సమర్పింపబడుదురు.
12. అటు తరువాత లేవీయులు కోడెల తలలపై చేతులుచాచెదరు. నీవు వానిలో ఒకదానిని పాపపరిహారబలిగా సమర్పింపుము. రెండవదానిని దహనబలిగా అర్పింపుము. లేవీయు లను శుద్ధిచేయు విధానమిది.
13. అహరోను ఎదు టను, అతని కుమారుల ఎదుటను వారిని నిలువబ్టెి నాకు ప్రత్యేకమైన కానుకగా అర్పింపుము.
14. ఈ రీతిగా లేవీయులను యిస్రాయేలీయులనుండి వేరు పరచి వారిని నా వారినిగాజేయుము.
15. అపుడు వారు నా సమావేశపుగుడారమున పరిచర్య చేయుదురు.
16. లేవీయులను శుద్ధిచేసి నాకు సమర్పింపుము. వారు యిస్రాయేలీయులనుండి నాకు నివేదింపబడిన వారు. వారి తొలిచూలు కుమారులకు మారుగా నాకు సమర్పింపబడినవారు.
17. ఏలయన యిస్రాయేలీ యుల సంతతిలోనేమి, వారి పశుగణములోనేమి తొలిచూలియైనది ప్రతి ఒక్కి నాది. కుమారులతో పాటు వారి పశువుల తొలిచూలు పిల్లలు నాకు చెందును. నేను ఐగుప్తీయుల తొలిచూలుసంతతిని వధించినపుడే వారిని నావారినిగా చేసికొింని.
18. ఇపుడు యిస్రాయేలు తొలిచూలు కుమారులకు మారుగా లేవీయులను నా వారినిగా చేసికొందును.
19. వారు యిస్రాయేలీయులు నాకు ఇచ్చిన కానుక. నేను వారిని అహరోను కుమారుల అధీనమున ఉంచుదును. ఆ లేవీయులు సాన్నిధ్యపుగుడారమున పరిచర్య చేయుచు యిస్రాయేలీయులను కాపాడు దురు. కావున గుడారమును సమీపించునపుడు యిస్రాయేలీయులకు ప్రాణహానికలుగదు” అని చెప్పెను.
20. మోషే, అహరోనులు, యిస్రాయేలు ప్రజలు ప్రభువు ఆజ్ఞాపించినట్లే లేవీయులను శుద్ధిచేయించిరి.
21. లేవీయులు శుద్ధిచేసికొని తమబట్టలు శుభ్రము చేసికొనిరి. అహరోను వారిని దేవునికి ప్రత్యేకకానుకగా సమర్పించెను. వారికి శుద్ధీకరణప్రాయశ్చిత్తమును కూడ జరిపించెను.
22. అంతట లేవీయులు అహరోను కుమారుల పర్యవేక్షణలో గుడారమున పరిచర్యజేసిరి. లేవీయులను గూర్చి ప్రభువు మోషేను ఆజ్ఞాపించినట్లే అంతయు జరిగెను.
లేవీయుల పరిచర్యకాలము
23-24. ప్రభువు మోషేతో ”లేవీయులు ఇరువదియైదేండ్లు మరియు ఆ పైబడిన ప్రాయము నుండి సాన్నిధ్యపుగుడారమున పరిచర్య చేయుదురు.
25. ఏబదిఏండ్ల వయసు వచ్చిన పిదప వారు గుడారమున పరిచర్య చేయనక్కరలేదు.
26. ఆ తరువాత వారు తోి లేవీయులకు పరిచర్యలో తోడ్పడవచ్చునుగాని తమంతట తాము పరిచర్యకు పూనుకోరాదు. లేవీయులను గూర్చిన నియమమిది” అని చెప్పెను.