24 1-2. ప్రభువు యిస్రాయేలును దీవింప గోరెనని బిలాము గ్రహించెను. అతడు మునుపి రీతిగా ప్రభువు చిత్తమును ఎరుగుటకై శకునములు చూడబోలేదు. నేరుగా ఎడారివైపు తిరిగి అచట తెగల ప్రకారముగా విడిదిచేసియున్న యిస్రాయేలీయులను చూచెను. దేవునిఆత్మ అతనిపైరాగా బిలాము దైవవాక్కును ఉపమానరీతిగానిట్లు వినిపించెను:
3. ”బెయోరు కుమారుడు బిలాము పలుకు దైవవాక్కు. నేత్రములు తెరిచినవానికి వచ్చిన దైవసందేశము.
4. అతడు దైవవాక్కును వినువాడు. మహోన్నతుడైన దేవుడు చూపు దివ్యదర్శనములను తిలకించువాడు.
5-6. యిస్రాయేలు గుడారములు ఎంత సుందరముగానున్నవి. వరుసలుగా నాిన ఖర్జూరవృక్షములవలె, నదీతీరమున పెరిగిన తోటలవలె, దేవుడునాిన సుగంధవృక్షములవలె, నీి ఒడ్డున ఎదిగిన దేవదారులవలె, యిస్రాయేలు నివాసములు రమ్యముగానున్నవి.
7. నీళ్ళు అతని బొక్కెనల నుండి కారును. అతని సంతతి బహుజలముల యొద్ద నివసించును. యిస్రాయేలు రాజు అగాగు కంటె అధికుడు. అతడు మహావైభవముతో రాజ్యమేలును.
8. ప్రభువు ఆ రాజును ఐగుప్తునుండి తోడ్కొని వచ్చెను. కొమ్ముగుఱ్ఱము విం వేగముతో యిస్రాయేలు తన శత్రువులను ఓడించి, వారి యెముకలు విరుగగొట్టును. బాణములతో వారిని గ్రుచ్చెదరు.
9. యిస్రాయేలు ప్రజలు ఆడుసింహము వింవారు. వారిని రెచ్చగొట్టుట ఎవరితరము?యిస్రాయేలును దీవించువారు దీవెనను, శపించువారు శాపమును పొందుదురు.”
10. ఆ మాటలువిని బాలాకు బిలాముమీద కోపము పట్టజాలక చేతులు చరుచుకొని బిలాముతో ”నా శత్రువులను శపించుటకు నిన్ను పిలిపించితిని. కాని నీవు వారిని ముమ్మారు దీవించితివి.
11. ఇంక నీయిిిం మొగము ప్టిపొమ్ము. నేను నిన్ను ఘనముగా సత్కరింపవలెననుకొింని. కాని ప్రభువే నీకు ఈ సన్మానము దక్కకుండజేసెను” అనెను.
12-13. బిలాము అతనితో ”నేను నీవు పంపిన అధికారులతో బాలాకు తన ఇంటనున్న వెండిబంగారములను త్రవ్వి నా నెత్తిని బ్టెినను నేను ప్రభువు ఆజ్ఞ మీరి ఒక చిన్నపనియైనను చేయను అని చెప్పలేదా? ప్రభువు ఏవి చెప్పుమనెనో దానిని మాత్రమే నేను చెప్పెదను.
14. నేను మా దేశమునకు వెడలిపోవుచున్నాను. కాని నేను వెళ్ళకముందు యిస్రాయేలు ప్రజలు మీ ప్రజలకు ఏమి చేయుదురో తెలియజెప్పెదను వినుము” అని మరల దైవవాక్కును ఉపమానరీతిగ ఇట్లెరిగించెను:
15 ”బెయోరు కుమారుడు బిలాము పలుకు దైవవాక్కు. నేత్రములు తెరిచిన నరుని దైవసందేశము.
16. అతడు దైవవాక్కును వినువాడు, దైవజ్ఞానము నెరిగినవాడు మహోన్నతుడైన దేవుడుచూపు దివ్యదర్శనములను తిలకించువాడు.
17.నేను అతనిని చూచుచున్నాను. కాని ఇపుడున్నట్లు కాదు. నేను అతనిని పరికించుచున్నాను. కాని సమీపములో ఉన్నట్లు కాదు. యిస్రాయేలు నుండి ఒక నక్షత్రము ఉదయించును. ఒక రాజదండము బయల్వెడలును. అది మోవాబీయుల కణతలు అదరగొట్టును. షేతువంశమువారి పుఱ్ఱెలు పగులగొట్టును.
18. ఎదోమీయులను లొంగదీయును. సెయీరు మండలమును వశముచేసికొనును.
19. యిస్రాయేలు బలపరాక్రమములుచూపి, శత్రువులను అణచివేయును, పట్టణములను నాశనము చేయును”.
20.అంతట బిలాము అమాలెకీయులసీమవైపుతిరిగి దైవవాక్కును ఉపమానరీతిగా ఇట్లెరిగించెను: ”అన్యజాతులన్నిలోను అమాలెకు ప్రథముడు, అయినను ఈ జాతి సర్వనాశనమగును”.
21. అతడు కేనీయుల మండలమువైపు తిరిగి దైవవాక్కును ఉపమానరీతిగా ఇట్లెరిగించెను: ”మీరు కయీను వంశమువారు. శిఖరముననున్న పక్షిగూడువలె సురక్షితముగా ఉన్నవారు.
22. అయినను అస్సిరియ దేశీయులు మిమ్ము చెఱపట్టుదురు. మీరు సర్వనాశమైపోవుదురు”.
23. అతడు వారివైపు తిరిగి దైవవాక్కును ఉపమానరీతిగా ఇట్లెరిగించెను: అయ్యో! దేవుడిట్లు చేయునపుడు బ్రతుకగలవాడెవడు?
24. ”కిత్తీము ద్వీపమునుండి దండులువచ్చి అస్సిరియ, ఏబేరు దేశములను బాధించును. అటుతరువాత ఆ జనులుకూడ నాశనమైపోవుదురు”.
25. ఇట్లు దైవవాక్యములు పలికి బిలాము తన ఇంికి వెడలిపోయెను. బాలాకు గూడ తనత్రోవను తాను వెళ్ళిపోయెను.