8. మిగిలిన నియమములు

జనాభా

26 1. అంటురోగము సమసిపోయిన తరువాత ప్రభువు మోషేతోను, అహరోను కుమారుడును ఎలియెజెరుతోను మ్లాడెను.

2. ”కుటుంబముల వారిగా యిస్రా యేలీయుల జనసంఖ్య వ్రాయింపుడు. ఇరువదిఏండ్లు మరియు అంతకుపైబడి యుద్ధము చేయుటకు అర్హులైన వారిపేర్లను నమోదుచేయింపుడు” అని చెప్పెను.

3. కనుక మోషే ఎలియెజెరులు ఇరువదిఏండ్లు మరియు అంతకుపైబడిన యిస్రాయేలీ యులు అందరిని సమావేశపరచిరి.

4. యెరికోకు ఎదురుగా నున్న యోర్దాను నదీతీరమందలి మోవాబు మైదానమున వారు గుమిగూడిరి. ఐగుప్తునుండి వెడలి వచ్చిన యిస్రాయేలీయులు వీరు:

5-11. యాకోబు పెద్ద కుమారుడగు రూబేను. రూబేను కుమారులలో హానోకీయులు హానోకు వంశస్తులు. 6. పల్లువీయులు పల్లు వంశస్తులు.  హెస్రోనీయులు హెస్రోను వంశస్తులు. కార్మీయులు కార్మి వంశస్తులు. 7. రూబేను తెగలో లెక్కింపబడిన వీరు 43,730 మంది పురుషులు.

8. పల్లు కుమారుడు ఎలీయాబు. ఎలీయాబు కుమారులు నెమూవేలు, దాతాను, అబీరాము.

9. మోషే అహరోనులను ధిక్కరించి కోరాబృందముతో చేతులుకలిపి యిస్రాయేలు సమాజమును ప్రభువుమీద తిరుగబడునట్లు రెచ్చ గ్టొిన వారు వీరే.

10. అపుడు నేల నోరువిప్పి కోరా బృందముతోపాటు వీరిని గూడ మ్రింగివేసెను. అగ్నిప్రజ్వరిల్లి రెండువందల ఏబదిమందిని కాల్చి వేసెను. ఆ విషయము ప్రజలకొక హెచ్చరిక అయ్యెను.

11. కోరా కుమారులు మాత్రము నాశనమైపోలేదు.

12. షిమ్యోను కుమారుల వంశములలో నెమూవేలీ యులు నెమూవేలు వంశస్తులు, యామీనీయులు యామీను వంశస్తులు, యాహీనీయులు యాహీను వంశస్తులు.

13. సెరాహీయులు సెరా వంశస్తులు, షవూలీయులు షవూలు వంశస్తులు.

14. షిమ్యోను తెగలో లెక్కింపబడిన వీరు 22,200 మంది పురుషులు.

15. గాదు కుమారుల వంశములలో సెఫోనీ యులు సెఫోను వంశస్తులు, హగ్గీయులు హగ్గి వంశస్తులు, షూనీయులు షూని వంశస్తులు, 16. ఓస్నీయులు ఓస్ని వంశస్తులు, ఎరీయులు ఎరి వంశస్తులు 17. అరోదీయులు అరోదు వంశస్తులు. అరేలీయులు అరేలి వంశస్తులు.

18. గాదీయుల తెగలో లెక్కింపబడిన వీరు 40,500 మంది పురుషులు.

19. యూదా కుమారులగు ఏరు, ఒనాను అనువారు కనాను మండలమున చనిపోయిరి.

20. యూదావంశమున షేలాహీయులు షేలా వంశస్తులు, పేరేసీయులు పేరేసు వంశస్తులు, సేరామీయులు సేరాహు వంశస్తులు.

21. పేరేసు కుమారులు హెస్రోను, హామూలు. హెస్రోనీయులు హెస్రోను వంశస్తులు, హామూలీయులు హామూలు  వంశస్తులు.

22. యూదాతెగలో లెక్కింపబడిన వీరు 76,500 మంది పురుషులు.

23. యిస్సాఖారు కుమారుల వంశములందు ోలాహీయులు ోలా వంశస్తులు, పూవీయులు పూవా వంశస్తులు, 24. యాషూబీయులు యాషూబు వంశస్తులు, షిమ్రోనీయులు షిమ్రోను వంశస్తులు.

25. యిస్సాఖారు తెగలోని లెక్కింపబడిన వీరు 64,300 మంది పురుషులు.

26. సెబూలూను కుమారుల వంశములందు సేరేదీయులు సేరేదు వంశస్తులు, ఏలోనీయులు ఏలోను వంశస్తులు, యాహ్లీయులు యాహ్లీలు వంశ స్తులు.

27. సెబూలూను తెగలో లెక్కింపబడిన వీరు 60,500 మంది పురుషులు.

28. యోసేపు కుమారులు మనష్షే, ఎఫ్రాయీము.

29. మనష్షే కుమారులలో మాహీరీయులు మాహీరు వంశస్తులు. మాహీరు కుమారుడు గిలాదు. గిలాదీ యులు గిలాదు వంశస్తులు.

30. గిలాదు కుమారుల వంశస్తులు యేసేరీయులు యేసేరు వంశస్తులు, హెలేకీయులు హెలేకు వంశస్తులు, 31. ఆస్రియేలీ యులు ఆస్రియేలు వంశస్తులు, షెకేమీయులు షెకెము వంశస్తులు, 32. షేమిదామీయులు షేమిదా వంశస్తులు, హేఫేరీయులు హేఫేరు వంశస్తులు.

33. హేఫేరు కుమారుడు సెలోఫెహాదునకు కుమార్తెలేగాని, కుమారులు లేరు. అతని కుమార్తెల పేర్లు మహ్లా, నోవా, హోగ్లా, మిల్కా, తీర్సా.

34. మనష్షే తెగలోని లెక్కింపబడిన వీరు 52,700 మంది పురుషులు. వారి కుటుంబముల ప్రకారము యోసేపు పుత్రులు వీరు.

35. ఎఫ్రాయీము కుమారుల వంశములివి. షుతేలాహీయులు షుతేలా వంశస్తులు, బేఖేరీయులు బేఖేరు వంశస్తులు, తాహానీయులు తాహాను వంశ స్తులు.

36. షుతేలా కుమారుడైన ఏరాను వంశస్తులు ఏరానీయులు.

37. ఎఫ్రాయీము తెగలో లెక్కింప బడిన వీరు 32,500 మంది పురుషులు.

38. బెన్యామీను కుమారుల వంశములలో బేలీయులు బేలా వంశస్తులు, ఆష్బేలీయులు ఆష్బేలు వంశస్తులు, 39. అహీరామీయులు అహీరాము వంశస్తులు, 40. షెపూఫామీయులు షెపూఫాము వంశస్తులు. బేలా కుమారులు ఆర్ధు, నామాను. ఆర్ధీయులు ఆర్ధు వంశస్తులు, నామానీయులు నామాను వంశస్తులు.

41. బెన్యామీను తెగలో లెక్కింబడిన వీరు 45,600 మంది పురుషులు.

42. దాను కుమారుల వంశములలో షూహామీ యులు షూహాము వంశస్తులు. దాను తెగలో లెక్కింప బడిన వీరు 64,400 మంది పురుషులు.

44. ఆషేరు కుమారుల వంశములలో ఇమ్నాయు లు ఇమ్నా వంశస్తులు, ఈష్వీయులు ఈష్వీ వంశ స్తులు, బెరియాయీలు బెరియా వంశస్తులు.

45. హేబేరు, మాల్కియేలు కుటుంబములు బెరియా నుండి పుట్టెను. హేబేరీయులు హేబేరు వంశస్తులు, మాల్కియేలీయులు మాల్కియేలు వంశస్తులు.

46. ఆషేరు కుమార్తె పేరు సేరా.

47. ఆషేరు తెగలో లెక్కింపబడిన వీరు 53,400 మంది పురుషులు.

48. నఫ్తాలి కుమారుల వంశములలో యాహ్సీ యులు యాహ్సీలు వంశస్తులు, గూనీయులు గూని వంశస్తులు, 49. యేసేరీయులు యేసేరు వంశస్తులు, షిల్లెమీయులు షిల్లెము వంశస్తులు. నప్తాలీ తెగలో లెక్కింపబడిన వీరు 45,400 మంది పురుషులు.

51. యిస్రాయేలీయుల పురుషులందరు కలసి 601,730 మంది.

52. ప్రభువు మోషేతో ”ఈ భూమిని వారి వారి పేర్లను అనుసరించి యిస్రాయేలు తెగలవారికి స్వాస్థ్యముగా పంచిపెట్టుము.

53. ఎక్కువసంఖ్యగల తెగకు ఎక్కువ స్వాస్థ్యమును ఈయవలెను.

54. తక్కువ సంఖ్యగల తెగకు తక్కువ స్వాస్థ్యమును ఈయవలెను.

55. చీట్లువేసి తమతమ పితరుల తెగల జనసంఖ్యలు అనుసరించి స్వాస్థ్యములను పొందవలెను.” అని చెప్పెను.

56. ఎక్కువసంఖ్య గలవారేమి, తక్కువ సంఖ్య గలవారేమి చీట్లువేసి ఎవరి స్వాస్థ్యమును వారికి పంచిపెట్టవలెను.

లేవీయుల జనసంఖ్య

57. లేవీ తెగయందు గెర్షోను, కోహాతు, మెరారి వంశములు కలవు.

58. లిబ్ని, హెబ్రోను, మాహ్లీ, మూషి, కోరా అనునవి లేవీయ కుటుంబములు. కోహాతు కుమారుడు అమ్రాము.

59. అతడు లేవీకి ఐగుప్తున జన్మించిన యోకేబేదును పెండ్లియాడి అహరోను, మోషే, మిర్యాములను కనెను.

60. వారిలో అహరోనునకు నాదాబు, అబీహు, ఎలియెజెరు, ఈతామారు అను నలుగురు కుమారులు కలరు.

61. దేవునికి అపవిత్రమైన అగ్నిని సమర్పించుట వలన నాదాబు, అబీహులు చనిపోయిరి.

62. లేవీయులందు నెల ప్రాయమునకు పైబడిన మగవారు 23,000 మంది. ఇతర యిస్రాయేలీయులవలె వీరికి ఆస్తిహక్కులు లేవు. కనుక వీరి పేర్లు ప్రత్యేకముగా నమోదు చేయబడెను.        

63. యెరికో ఎదుటనున్న యోర్దాను నదీతీరము నందలి మోవాబు మైదానమున మోషే, ఎలియెజెరులు జనసంఖ్యను నిర్ణయించినపుడు ఈ కుటుంబముల పేర్లు లిఖింపబడినవి.

64. ప్రజలు సీనాయి ఎడారిలో నున్నపుడు మోషే, అహరోనులు జనసంఖ్య వ్రాసిరి కదా! ఈ రెండవలెక్క తయారైనపుడు ఆ మొది లెక్కలోని మగవారెవరును మిగిలిలేరు.

65. వారందరు ఎడారిలోనే కన్ను మూయుదురని ప్రభువు సెలవిచ్చెను. యెఫున్నె కుమారుడగు కాలెబు, నూను కుమారుడైన యెహోషువ తప్ప మిగిలిన మగవారందరు ప్రభువు చెప్పినట్లే మరణించిరి.

Previous                                                                                                                                                                                                  Next  

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము