6. క్రొత్త సంవత్సర అర్పణములు

29 1. ఏడవనెల మొదిదినమున మీరు ప్రభువును ఆరాధించుటకు సమావేశము కావలెను. ఆ దినము మీరు మీ జీవనోపాధియైన ఏ పనియు చేయరాదు. ఆర్భాటముగా శృంగములను ఊదు దినమది.

2. అవలక్షణములు లేని ఒకకోడెను, ఒక పొట్టేలును ఏడాది ఈడుగల ఏడుమగగొఱ్ఱెపిల్లలను ప్రభువునకు దహనబలిగా అర్పింపుడు.

3-4. ఓలివునూనెతో కలిపిన పిండిని ఒక్కొక్కకోడెకు ఆరుకుంచములు, పొట్టేలుకు నాలుగుకుంచములు, గొఱ్ఱెపిల్లకు రెండు కుంచములచొప్పున అర్పింపుడు.

5. పాపపరిహార బలిగా ఒక మేకపోతును గూడ సమర్పింపుడు. ఈ రీతిగా మీ నిమిత్తము పాపములకు ప్రాయశ్చిత్తము జరిపింపుడు.

6. ప్రతి నెల మొదిరోజున అర్పించు దహనబలితోపాటు, ప్రతిదినము అర్పించు దహన బలితోపాటు, ఈ బలులను కూడ అర్పింపుడు. ఇవి ప్రభువునకు ప్రీతి కలిగించు సువాసననిచ్చి, అతనికి భోజనమగును.

7. పాపప్రాయశ్చిత్త దినము

7. ఏడవనెల పదియవదినమున ప్రభువును ఆరాధించుటకు సమావేశము కావలెను. ఆ దినమున మీరు ఏ పనియుచేయక ఉపవాసము ఉండుడు.

8. ప్రతిదిన దహనబలియు, దాని నైవేద్యమును, వాి పానీయార్పణములుగాక అవలక్షణములేని ఒక కోడెను, ఒక పొట్టేలును, ఏడాది ఈడుగల ఏడుగొఱ్ఱె పిల్లలను ప్రభువునకు దహనబలిగా అర్పింపుడు. ఆ బలి ప్రభునికి ప్రియము కలిగించు సువాసననిచ్చును.

9-10. ఓలివునూనెతో కలిపిన పిండిని కోడెకు ఆరుకుంచములు, పొట్టేలుకు నాలుగు కుంచములు, ఒక్కొక్క గొఱ్ఱెపిల్లకు రెండుకుంచముల చొప్పున అర్పింపుడు.

11. పాపపరిహారబలిగా ఒక మేక పోతును అర్పింపుడు.

8. గుడారముల పండుగ

12. ఏడవనెల పదునైదవ దినమున ఆరాధనకు సమావేశముకండు. ప్రభువుపేర ఉత్సవము చేసు కొనుడు. ఆనాడు మీ జీవనోపాధియైన ఏ పనియు చేయవలదు. మీరు ఏడుదినములు పండుగ ఆచరింప వలయును. 13. ప్రతిదిన దహనబలియు, దాని నైవేద్యమును, వాి పానార్పణములునుగాక ఈ మొదిదినమున అవలక్షణములేని పదమూడు కోడెలను, రెండు పొట్టేళ్ళను, ఏడాది ఈడుగల పదునాలుగు గొఱ్ఱెపిల్లలను దహనబలిగా అర్పింపుడు. ఆ బలి ప్రభువునకు ప్రీతికలిగించు సువాసననిచ్చును.

14-15. ఓలివు నూనెతో కలిపిన గోధుమపిండిని ఒక్కొక్క కోడెకు ఆరుకుంచములు, పొట్టేలుకు నాలుగు కుంచములు, ఒక్కొక్క గొఱ్ఱెపిల్లకు రెండుకుంచముల చొప్పున అర్పింపుడు.

16. పాపపరిహారబలిగా ఒక మేకపిల్లను అర్పింపుడు.

17. రెండవదినమున ప్రతిదిన దహనబలియు, దాని నైవేద్యమును, వాి పానార్పణములునుగాక అవలక్షణములేని పండ్రెండుకోడెలను, రెండుపొట్టేళ్ళను, ఏడాది ఈడుగల పదునాలుగు గొఱ్ఱెపిల్లలను విధి ప్రకారముగా సమర్పింపుడు.

18-19. వానివాని లెక్క చొప్పున కోడెలతోను, పొట్టేళ్ళతోను, గొఱ్ఱెప్లిలలతోను వాివాి నైవేద్యములను, పానార్పణములను పాప పరిహారబలిగా ఒక మేకపిల్లను సమర్పింపుడు. 

20. మూడవదినమున ప్రతిదిన దహనబలియు, దాని నైవేద్యమును, వాి పానార్పణములును గాక   అవలక్షణములేని పదునొకండు కోడెలను, రెండు పొట్టేళ్ళను, ఏడాది ఈడుగల పదునాలుగు గొఱ్ఱె పిల్లలను అర్పింపుడు.

21-22. మిగిలినవానినన్నిని మొదిరోజున అర్పించు రీతిగనే అర్పింపుడు.

23.నాలుగవరోజున ప్రతిదిన దహనబలియు, దాని నైవేద్యమును, వాి పానార్పణములునుగాక అవలక్షణములేని పది కోడెలను, రెండు పొట్టేళ్ళను, ఏడాది ఈడుగల పదునాలుగు గొఱ్ఱె పిల్లలను సమర్పింపుడు.

24-25. మిగిలిన వానినన్నిని మొదిరోజున అర్పించు రీతిగనే సమర్పింపుడు.

26.ఐదవరోజున ప్రతిదిన దహనబలియు, దాని నైవేద్యమును, వాి పానార్పణములునుగాక అవలక్షణములేని తొమ్మిది కోడెలను, రెండుపొట్టేళ్ళను, ఏడాది ఈడుగల పదునాలుగు గొఱ్ఱెపిల్లలను సమర్పింపుడు.

27-28. మిగిలినవానినన్నిని మొదిరోజున అర్పించు రీతిగనే సమర్పింపుడు.

29. ఆరవరోజున ప్రతిదిన దహనబలియు, దాని నైవేద్యమును, వాి పానార్పణములును గాక అవలక్షణములేని ఎనిమిదికోడెలను, రెండుపొట్టేళ్ళను, ఏడాది ప్రాయముగల పదునాలుగు గొఱ్ఱెపిల్లలను అర్పింపుడు.

30-31. మిగిలినవానినన్నిని మొది రోజున అర్పించురీతిగనే సమర్పింపుడు.

32. ఏడవ రోజున ప్రతిదిన దహనబలియు, దాని నైవేద్యమును, వాి పానార్పణములునుగాక అవలక్షణములేని ఏడుకోడెలను, రెండు పొట్టేళ్ళను, ఏడాది ప్రాయముగల పదునాలుగు గొఱ్ఱె పిల్లలను సమర్పింపుడు.

33. కోడెలతోను, పొట్టేళ్ళతోను, గొఱ్ఱెపిల్లలతోను వాివాి నైవేద్యమును, పానార్పణములను 34. పాపపరిహారబలిగా ఒక మేకపిల్లను, మొదిదినమున అర్పించురీతిగనే  మిగిలిన ఆరు దినములలోను సమర్పింపుడు.

35. ఎనిమిదవదినమున ప్రభువును ఆరాధించు టకు సమావేశము కావలెను. ఆ దినము మీ జీవనో పాధియైన ఏ పనియుచేయవలదు.

36. ప్రతిదిన దహనబలియు, దాని నైవేద్యమును, వాి పానీయార్పణ మును గాక అవలక్షణములేని ఒక కోడెను, ఒక పొట్టేలును, ఏడాది ఈడుగల ఏడుగొఱ్ఱెపిల్లలను ప్రభువునకు దహనబలిగా అర్పింపుడు. ఈ భోజనబలి ప్రభువునకు ప్రీతి కలిగించు సువాసననిచ్చును.

37-38. మిగిలిన వానినన్నిని మొదిరోజున అర్పించు రీతిగనే సమర్పింపుడు.

39. మీకు నేను నియమించిన పండుగలందు మీరు సమర్పింపవలసిన దహనబలులు, ధాన్యార్పణ ములు, ద్రాక్షసారాయార్పణములు, సమాధానబలులు ఇవియే. మ్రొక్కుబడులుపట్టుటవలననైన, స్వేచ్ఛార్పణ ముగానైనను మీరు సమర్పించుకొను సమర్పణములు మాత్రము పై లెక్కలోనికి రావు.”

40. ఈ రీతిగా ప్రభువు తనకు ఆజ్ఞాపించిన కట్టడలనన్నిని మోషే యిస్రాయేలీయులకు తెలియ జేసెను.

Previous                                                                                                                                                                                                    Next

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము