ఐగుప్తునుండి మోవాబునకు ప్రయాణము
33 1. మోషే అహరోనుల నాయకత్వమున ఐగుప్తునుండి వెడలివచ్చిన యిస్రాయేలు సమాజము విడిదిచేసిన తావుల జాబితా యిది.
2. ఎడారిలో ఏ తావునైన విడిదిచేసినపుడు మోషే ప్రభువు ఆజ్ఞనను సరించి ఆ తావు పేరు లిఖించుచువచ్చెను. వారి విడుదుల పేర్లివి: 3. యిస్రాయేలీయులు ఏడాదిలో మొదినెల పదునైదవ దినమున, తొలి పాస్క ఉత్సవమును జరుపుకొనిన దినమునకు మరుసి దినమున ఐగుప్తునుండి బయలుదేరిరి. ఐగుప్తీయులు కన్నులారచూచుచుండగనే వారు విజయోత్సాహముతో రామెసేసు పట్టణమునుండి బయలుదేరిరి.
4. ప్రభువు సంహరించిన తమ తొలిచూలు పిల్లలను ఐగుప్తీయులు అపుడు పాతిపెట్టుకొనుచుండిరి. ఆ రీతిగా ప్రభువు ఐగుప్తీయులు కొలుచు దేవతలకు తీర్పుతీర్చెను.
5. ప్రజలు రామెసేసును వీడివచ్చి సుక్కోత్తున విడిదిచేసిరి.
6. సుక్కోత్తునుండి కదలి ఎడారి అంచున నున్న ఏతామున దిగిరి.
7. అచినుండి సాగి వెనుకకు మరలి బాల్సెఫోనునకు తూర్పునున్న పీహహిరోత్తును చేరి మిగ్దోలుచెంత మకాముచేసిరి.
8. ఆ తావును వీడి రెల్లుసముద్రమును దాి ఎడారిలో ప్రవేశించిరి. ఏతాము ఎడారిలో మూడునాళ్ళు ప్రయాణముచేసి మారా వద్ద విడిదిచేసిరి.
9. అచినుండి ఏలీము చేరుకొనిరి. ఈ ఏలీమున పండ్రెండు చెలమలు, డెబ్బది ఖర్జూరవృక్షములు కలవు. గనుక అచట విడిది చేసిరి.
10. ఏలీము నుండి బయలుదేరి రెల్లు సముద్రము చెంత దిగిరి.
11. అటుపిమ్మట సీను ఎడారిచేరి అచట బసచేసిరి.
12. తరువాత దోఫ్కా వద్ద దిగిరి.
13. పిమ్మట ఆలూషున మకాము చేసిరి.
14. అటు తరువాత రెఫీదీమున ఆగిరి. ఇచట వారికి త్రాగుటకు నీళ్ళు దొరకలేదు.
15-37. రెఫీదీము నుండి హోరు పర్వతము వరకు వారుచేసిన విడుదులివి: సీనాయి ఎడారి, కిబ్రోతుహ్టావా, హాసెరోత్తు, రీత్మా, రిమ్మోను, పేరేసు, లిబ్నా, రీస్సా, కెహేలతా, సేఫేరా పర్వతము, హారదా, మాఖెలోత్తు, తాహతు, తేరా, మిత్కా, హాష్మోను, మోసేరోత్తు, బెనెయాకాను, హోరు, హగ్గిద్గాదు, యోత్బాతా, అబ్రోనా, ఏసోన్గేబేరు కాదేషు అనబడు సీను ఎడారి, ఏదోము అంచుననున్న హోరు పర్వతము.
38-39. ప్రభువు ఆజ్ఞ చొప్పున యాజకుడగు అహరోను హోరు కొండమీదికెక్కి అచటనే ప్రాణములు విడిచెను. అప్పుడతనికి నూట యిరువది మూడేండ్లు. అది యిస్రాయేలీయులు ఐగుప్తునుండి వెడలివచ్చిన నలువదియవ యేట ఐదవనెలలో మొదిరోజు.
40. కనానుమండలము దక్షిణభాగము పాలించు ఆరదు రాజు యిస్రాయేలీయులు వచ్చుచున్నారన్న వార్త వినెను.
41-49. హోరు పర్వతమునుండి మోవాబు మండలము వరకు యిస్రాయేలీయులు చేసిన విడు దులివి: సాల్మోనా, పూనోను, ఓబోతు, మోవాబు మండలములోని యియ్యెఅబరీము, దీబోనుగాదు, అల్మోను, దిబ్లతాయీము, నేబో పర్వతము చెంతనున్న అబారీము కొండ, మోవాబు మైదానమున యెరికో చెంతగల యోర్దాను తీరము. వారు మోవాబు మండ లమున బేత్యేషిమోతు, ఆబేలు హాషిత్తీము ప్రదేశము లకు మధ్య యోర్దాను తీరమున విడిదిచేసిరి.
కనానును పంచుట
50. ఆ మోవాబు మైదానమున యెరికో ఎదుట నున్న యోర్దాను తీరమున ప్రభువు మోషేను ఇట్లు ఆజ్ఞాపించెను: 51-52. ”మీరు యోర్దాను దాి కనాను మండలమున ప్రవేశించినపిదప అచట ఆ దేశనివాసులందరిని తరిమివేయుడు. వారి రాతి విగ్రహములను, పోతబొమ్మలను, ఆరాధనస్థలము లను నాశనము చేయుడు.
53. ఆ నేలను నేను మీకు ఇచ్చితిని గనుక మీరు దానిని స్వాధీనపరచుకొని అచట నివసింపుడు.
54. చీట్లువేసి ఆయాతెగలకు, వంశములకు ఆ దేశమును పంచిపెట్టుము. పెద్దవంశములకు పెద్దభాగములను, చిన్నవంశము లకు చిన్నభాగములను పంచియిమ్ము. ఏ చీట్లకు ఏ భాగమువచ్చునో ఆ భాగమునే ప్రజలు తీసికొనవలెను. యిస్రాయేలు తెగకర్తలనుబ్టి ఆయాతెగలకు ఈ నేలను పంచి యిమ్ము.
55. కాని మీరు ఆ దేశ వాసులను తరిమివేయనియెడల వారు మీకు కింలోని నలుసువలెను, ప్రక్కలో బల్లెమువలె నగుదురు. మీతో పోరాటమునకు దిగుదురు.
56. కనుక మీరు వారిని వెడలగొట్టరేని, నేను వారిని నాశనము చేయదలచు కొన్నట్లే మిమ్మును నాశనము చేసెదను” అని వారితో చెప్పుము.