యోర్దాను తూర్పుతీరము వెంబడి కదలుట
3 1. తదనంతరము ఉత్తరదిక్కుగా నడచి బాషాను మండలము చేరుకొింమి. అప్పుడు ఆ దేశమునేలు రాజు ఓగు బాషాను జనమును ప్రోగుజేసికొనివచ్చి ఎద్రెయి వద్ద మనలను ఎదిరించెను.
2. ప్రభువు నాతో ‘నీవు ఇతనికి భయపడవలదు. ఈ రాజును, ఇతని ప్రజలను, దేశమును మీ వశముచేసితిని. హెష్బోనున వసించిన అమోరీయ ప్రభువు సీహోనును వలె ఇతనిని గూడ ఓడింపుము’ అని చెప్పెను.
3. ఆ రీతిగా ప్రభువు ఓగురాజును అతని జనులందరిని మన చేతికి చిక్కించెను. మనము ఒక్కరిని మిగిలింపక అందరిని వధించితిమి.
4. ఒక్కదానిని కూడ వదలి పెట్టకుండ వారి పట్టణములన్నిని పట్టుకొింమి. అవి అన్నియు కలిసి అరువది నగరములు. అవి యర్గోబు సీమలోనున్నవి. బాషాను రాజగు ఓగు పరిపాలించినది అచటనే.
5. అవియన్నియు సురక్షిత పట్టణములు. వాికి ఎత్తయిన ప్రాకారములు, కవాట ములు, ఆ కవాటములకు లోపలినుండి బిగించుటకు గడియలు కలవు. ఇదిగాక అరక్షితపట్టణములు చాల కలవు.
6. హెష్బోను రాజగు సీహోను నగరములవలె ఈ పట్టణములను గూడ శాపముపాలుచేసి, నాశనము చేసితిమి. అందలి స్త్రీ, పురుషులను, పిల్లలను చంపితిమి.
7. ఆ నగరములను దోచుకొని అచి పశువులమందలను తోలుకొనివచ్చితిమి.
8. ఆ రీతిగా మనము ఇద్దరు అమోరీయ రాజుల నుండి యోర్దాను తూర్పుసీమను వశము చేసికొింమి. ఆ నేల అర్నోనునది అంచునుండి హెర్మోను కొండ వరకు వ్యాపించియున్నది.
9. (ఈ కొండనే సీదోనీ యులు సిర్యోను అని, అమోరీయులు సెనీరు అని పిలుచుదురు.) 10. పీఠభూమిలోని నగరములన్నిని, గిలాదు అంతిని, ఓగు రాజు ప్రధాన పట్టణములైన సల్కా, ఎద్రెయిల వరకు వ్యాపించియున్న బాషాను రాజ్యమును అంతిని మనము జయించితిమి.”
11. (ఓగురాజు రేఫా జాతిలో చివరివాడు. అతనికి ఇను ముతో చేసిన పడకమంచము కలదు. ప్రామాణికమైన కొలమానము ప్రకారము దాని పొడవు తొమ్మిది మూరలు. వెడల్పు నాలుగుమూరలు. అమోరీయులకు చెందిన రబ్బా నగరమున నేికిని దానిని చూడ వచ్చును.)
12.అర్నోనులోయ అంచులలోని అరెయోరు పట్టణమునకు ఉత్తరదిక్కున గల భాగమును, గిలాదు కొండభాగము సగమును ఆ సమయమున ఆక్రమించు కొింమి. నేను గిలాదు పీఠభూమిలో సగమును, అందలిపట్టణములను రూబేను, గాదు తెగలకిచ్చితిని.
13. మనష్షే అర్ధతెగకు గిలాదున మిగిలిన భాగమును, ఓగు రాజు దేశమైన బాషానును ఇచ్చితిని. అర్గోబు సీమను, బాషానును కలిపి రేఫా మండలమని పిలిచెడి వారు.
14. గెషూరు, మాకా సరిహద్దుల వరకుగల అర్గోబు మండలమునంతిని మనష్షే వంశజుడైన యాయీరు స్వాధీనము చేసికొనెను. అతడు అచి నగరములన్నికి తన పేరు పెట్టెను. కనుక నేికిని అవి యాయీరునగరములు అనియే పిలువబడు చున్నవి.
15. మనష్షే తెగవాడైన మాకీరునకు నేను గిలాదును ఒసగితిని.
16. రూబేను, గాదు తెగలకు గిలాదు నుండి అర్నోను నదివరకు విస్తరించియున్న దేశమును ఇచ్చితిని. ఈ నది మధ్యభాగమే వారికి దక్షిణపు సరిహద్దు. ఉత్తరపు సరిహద్దు యబ్బోకు నదివరకును, అమ్మోనీయుల పడమి సరిహద్దు వరకును ఉన్నది.
17. పశ్చిమమున యోర్దానునది వారికి సరిహద్దు. మరియు వారి నేల ఉత్తరమున కిన్నెరతు మొదలుకొని తూర్పుదిక్కున పిస్గాకొండ చరియల దిగువగా దక్షిణమున మృతసముద్రము వరకు ఉన్న అరాబా ప్రదేశమున వ్యాపించియుండెను.
మోషే తుదిసందేశము
18. ఆ సమయమున నేను మీతో ఇట్లు చెప్పితిని. ‘యోర్దానుకు తూర్పునగల ఈ దేశమును ప్రభువు మీకు స్వాధీనము చేసెను. మీలో యుద్ధము చేయగలవారందరును ఆయుధములు చేప్టి తోి యిస్రాయేలీయుల కంటెను ముందుగాపోయి నదిని దాటుడు.
19. మీ భార్యలు, పిల్లలు, మందలు మాత్రము నేను మీకొసగిన నగరములలోనే ఉండ వచ్చును. మీకు చాలమందలున్నవని నేనెరుగుదును.
20. ప్రభువు యోర్దానునకు పశ్చిమముననున్న దేశమును మీ తోియిస్రాయేలీయులకు ఇచ్చెను. మీరు ఈ ప్రదేశమున ఉన్నట్లే వారుకూడ ఆ నేలను ఆక్రమించుకొని అచట సుఖముగా స్థిరపడువరకు మీరు వారికి సహాయము చేయవలయును. ఆ పిమ్మట నేను మీకిచ్చిన ఈ దేశమునకు మీరు తిరిగి రావ చ్చును.’
21. తదనంతరము నేను యెహోషువతో ‘ప్రభువు ఆ ఇద్దరు రాజులకు ఏమిచేసెనో నీవు కన్నులార చూచితివి గదా! మీరు వెళ్ళుచున్న దేశముల రాజులకుగూడ ఆయన అదేగతి ప్టించును.
22. కనుక మీరు ఆ రాజులకు భయపడవలదు. మీ ప్రభువు మీపక్షమున వారితో పోరాడును’ అని చెప్పితిని.
23-24. అంతట నేను యావేతో ‘ప్రభూ! నీ మహత్తును, బలమును ఈ దాసునకు తెలియజేయ బూనితివి. నీవుచేసిన మహాకార్యములు, అద్భుతములు చేయగల దేవుడు భూమ్యాకాశములందు ఒక్కడును లేడు. 25. ప్రభూ! నన్ను యోర్దాను దాి సారవంతమైన ఆవలినేలను కన్నులార చూడనిమ్ము. పర్వతములతో అలరారు ఆ సుందరదేశమును ఆ లెబానోను కొండ లను తనివితీరచూడనిమ్ము’ అని మొరపెట్టుకొింని.
26. కాని మీ మూలముగా ప్రభువు నామీద మండిపడి నా మొరవినడయ్యెను. ఆయన ‘ఓయి! నీ వేడికోలు ఇకచాలు! ఈ సంగతి నా యెదుట మరలఎత్తవద్దు.
27. నీవు పిస్గా కొండనెక్కి పడమరవైపు, ఉత్తరము వైపు, దక్షిణమువైపు, తూర్పువైపును పరికింపుము. ఆ దేశమును జాగ్రత్తగా పరిశీలించి చూడుము. నీవు మాత్రము యోర్దాను దాిపోజాలవు.
28. నీవు యెహోషువకు ఉపదేశము చేయుము. అతనికి ప్రోత్సా హము కలిగించి బలపరుపుము. ప్రజలను నడిపించు కొనిపోయి నీవుచూచిన ఈ నేలను వారిచే ఆక్రమింప చేయువాడు అతడే’ అని పలికెను.
29. అపుడు మనము బేత్పెయోరు నగరమెదుట లోయలో దిగియుింమి.