పది ఆజ్ఞలు
5 1. మోషే యిస్రాయేలీయులందరిని చేరబిలిచి వారితో ఇట్లనెను: ‘యిస్రాయేలీయులారా వినుడు! నేడు నేను మీకు ఉపదేశించు ఆజ్ఞలను, చట్టములను ఆలింపుడు. వీనిని నేర్చుకొని మీ అనుదిన జీవితమున పాింపుడు.
2. హోరేబు వద్ద మన ప్రభువైన దేవుడు మనతో నిబంధనము చేసికొనెను.
3. మన పితరులతో మాత్రమేకాదు, నేడు ఇచట బ్రతికియున్న మన అందరితోను ఈ నిబంధనము చేసికొనెను.
4. కొండ మీద నిప్పుమంటల నడుమనుండి ప్రభువు మీతో ముఖాముఖి సంభాషించెను.
5. అప్పుడు నేను మీకును, ప్రభువునకును మధ్య నిలుచుండి ఆయన పలుకులు మీకెరిగించితిని. మీరు ఆ అగ్నికి భయపడి కొండమీదికి వెళ్ళరైతిరి.
6.అప్పుడు ప్రభువు ఇట్లనెను:
నేను మీ దేవుడనైన ప్రభుడను.
దాస్యనిలయమైన ఐగుప్తునుండి
మిమ్ము తోడ్కొనివచ్చినది నేనే.
7. మీకు నేనుతప్ప మరియొక దేవుడులేడు.
8. పైన ఆకాశమునందే గాని,
క్రింది నేలమీదయే గాని,
నేల క్రిందిసముద్రముననే గాని
ఉన్న ఏ వస్తువు ప్రతిరూపమునుగాని,
విగ్రహమునుగాని మీరు నిర్మింపరాదు.
9. మీరు విగ్రహములకు మ్రొక్కి
వానిని పూజింపరాదు.
మీ ప్రభుడనైన నేను,
అసూయపరుడనైన దేవుడను.
నన్ను ద్వేషించువారిని నేను శిక్షింతును.
వారి వంశజులనుకూడ
మూడునాలుగు తరములవరకు శిక్షింతును.
10. కాని నన్ను ప్రేమించి
నా ఆజ్ఞలను పాించువారిని
వేయితరములదాక కరుణింతును.
11. మీ దేవుడైన ప్రభువు నామమును
దుర్వినియోగము చేయకుడు.
ప్రభుడనైన నేను, నా నామమును
దుర్వినియోగము చేయువారిని
శిక్షించి తీరుదును.
12. ”మీ ప్రభుడనైన నేను ఆజ్ఞాపించినట్లే మీరు విశ్రాంతిదినమును పాింపుడు. దానిని పవిత్రముగా ఉంచుడు.
13. మీరు ఆరుదినములు శ్రమించి మీ పనులన్నియు చేసికోవచ్చును.
14. కాని ఏడవ దినమునాడు మీ దేవుడనైన నాకు విశ్రాంతిదినము. ఆనాడు మీరును, మీ కొడుకులును, కుమార్తెలును, దాసదాసీజనమును, ఎద్దు, గాడిద మొదలైన పశువు లును, మీతో వసించు పరదేశులును పనిచేయరాదు. మీ దాసదాసీజనము కూడ మీవలె విశ్రాంతి తీసికో వలెను.
15. మీరు ఒకప్పుడు ఐగుప్తున బానిసలుగా ఉంిరని గుర్తుంచుకొనుడు. ప్రభుడనైన నేను మహా బలముతో, చాచినబాహువుచేత మిమ్ము అచినుండి తోడ్కొనివచ్చితిని. కనుకనే మీ ప్రభుడనైన నేను మీరు విశ్రాంతిదినమును పాింపవలెనని ఆజ్ఞాపించు చున్నాను.
16. మీ ప్రభుడనైన నేను ఆదేశించినట్లే మీ తల్లి దండ్రులను గౌరవింపుడు. అటులచేసినయెడల నేను మీ కొసగబోవు నేలమీద మీరు దీర్ఘాయుష్మంతులై క్షేమముగా జీవింతురు.
17. హత్య చేయరాదు.
18. వ్యభిచరింపరాదు.
19. దొంగిలింపరాదు.
20. పొరుగు వానికి వ్యతిరేకముగా అబద్ధ సాక్ష్యము చెప్పరాదు.
21. పొరుగు వాని భార్యను ఆశింపరాదు.
పొరుగువాని ఇంినిగాని, పొలమునుగాని,
దాసదాసీ జనమునుగాని, ఎద్దు, గాడిద
మొదలైన పశువులను గాని
మరి అతనిది ఏదయినగాని ఆశింపరాదు.’
22. మీరు కొండ చెంత సమావేశమయినపుడు మీ ప్రభువు మీకు ఆదేశించిన ఆజ్ఞలివి. నిప్పుమంటల నడుమ నుండి దట్టమయిన కారుమబ్బునుండి గంభీర స్వరముతో ఆయన మీతో మ్లాడెను. ఈ పలుకులు పలికినపిమ్మట ప్రభువు ఇంకేమియు చెప్పలేదు. ఈ ఆజ్ఞలను రెండురాతిపలకలపై వ్రాసియిచ్చెను.”
మోషే మధ్యవర్తిగా ఉండుట
23. ”ఆ రీతిగా కొండ మంటలతో నిండి యుండగా, కారుచీకినుండి మీకు భాషణము వినిపింపగా, మీ తెగనాయకులు, పెద్దలు నా చెంతకు వచ్చి 24. ‘మేము ప్రభువు నిప్పుమంటల నడుమ నుండి మ్లాడగావింమి. ఆయన తన మహత్త్వమును మహిమను మా యెదుట ప్రదర్శించెను. దీనినిబ్టి దేవుడు నరునితో సంభాషించినను నరుడు బ్రతికి ఉండగలడని నేడు గుర్తించితిమి.
25. కాని మేమిపుడు మరల ప్రాణాపాయము తెచ్చుకోనేల? ఆ మహాగ్ని మమ్ము భస్మము చేయగలదు. ప్రభువు భాషణ మరి యొకసారి వింమా మేమెల్లరమును తప్పక చనిపోవు దుము.
26. సజీవుడైన దేవుడు నిప్పుమంటల నడుమ నుండి భాషింపగా విని బ్రతికియున్నవారు, మేము తప్ప దేహధారులైన నరులలో ఇంకెవ్వరైన ఉన్నారా?
27. కనుక నీవు వెళ్ళి మన దేవుడైన ప్రభువు సెలవిచ్చు ఆజ్ఞలెల్ల విని తిరిగివచ్చి వానిని మాకెరిగింపుము. మేము ఆ ఆజ్ఞల ప్రకారము నడుచుకొందుము’ అని చెప్పిరి.
28. ప్రభువు మీ మాటలాలించి నాతో ‘నేను ప్రజల పలుకులు వింని. వారు చెప్పినది సమంజస ముగనే ఉన్నది. 29. వారి హృదయములు ఎల్లప్పు డును ఈ రీతిగనే యుండిన ఎంత బాగుండును! వారెల్లప్పుడు నాకు భయపడి నా ఆజ్ఞలను పాించిన ఎంత సమంజసముగానుండును! అప్పుడు వారికిని, వారి సంతానమునకును అభ్యుద యము కలుగును.
30. ఇక వారిని తమ గుడారము లకు వెడలిపొమ్మని చెప్పుము.
31. కాని నీవిచటనే నిలువుము. నా ఆజ్ఞలు, విధులు, చట్టములు నీకు ఎరిగింతును. నీవు ఈ ఆజ్ఞలెల్ల వారికి బోధింప వలయును. నేను ఈ ప్రజలకు ఒసగబోవు నేలమీద వారు ఈ నియమములన్నియు పాింపవలయును’ అని నుడివెను.
ప్రభుని ప్రేమించుటయే ధర్మశాస్త్ర సారము
32. కనుక యిస్రాయేలీయులారా! ప్రభువు ఆదేశించిన ఈ ఆజ్ఞలనెల్ల ఒక్క పొల్లుకూడ తప్పకుండ జాగ్రత్తగా పాింపుడు.
33. ప్రభువు మీకు నిర్దేశించిన మార్గమువెంట పయనింపుడు. అప్పుడు మీరు క్షేమ ముగా బ్రతుకుదురు. మీరు స్వాధీనము చేసికొనబోవు నేలమీద చిరకాలము జీవింతురు.”