యిస్రాయేలీయుల ప్రత్యేకత
7 1. ప్రభువు మిమ్ము ఆ దేశమునకు తోడ్కొని పోవును. మీరు దానిని స్వాధీనము చేసికొందురు. అతడు ఆ దేశజాతులను మీ ఎదుినుండి వెళ్ళ గొట్టును. మీకంటెను అధికసంఖ్యాకులును, బలాఢ్యులు నైన జాతులను ఏడింని అతడు పారద్రోలును. ఆ జాతులు ఏమనగా హిత్తీయులు, గెర్గాషీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిస్సీయులు, హివ్వీయులు, యెబూసీయులు.
2. ప్రభువు ఆ జాతులను మీ వశము చేయును. మీరు వారిని జయించి శాపముపాలు చేయవలయును. వారితో మీర్టిె ఒడంబడికను చేసికొనరాదు. వారిమీద దయచూపరాదు.
3. మీరు వారితో వియ్యమందు కోరాదు, మీ కుమార్తెలను వారికి ఈయరాదు. వారి కుమార్తెలను మీ కుమారుల కొరకు తెచ్చుకొనరాదు.
4. అి్ట పెండ్లి వలన వారి ఆడుపడుచులు మీ తనయుల మనసు త్రిప్పుదురు. మీ కుమారులు నన్ను విడనాడి అన్యదేవతలను ఆరాధింతురు. అప్పుడు ప్రభువు మీమీద మండిపడి మిమ్ము ఒక్క క్షణములో నాశనము చేయును.
5. కనుక మీరు వారి బలి పీఠములను కూలద్రోయుడు. పవిత్రశిలలను పగుల గొట్టుడు. అషేరాదేవతా స్తంభములను నరికివేయుడు, విగ్రహములను కాల్చివేయుడు.
6. ఎందుకన మీరు ప్రభువునకు పవిత్రప్రజలు. ప్రభువు ఈ భూమిమీది జనులందరిలో మిమ్మే తన సొంతప్రజగా ఎన్నుకొనెను.
ప్రభువు ఎన్నిక, అనుగ్రహము
7. మీరు ఇతర జాతులకంటె అధిక సంఖ్యాకు లన్న తలంపుతో ప్రభువు మిమ్ము ప్రేమించి ఎన్నుకొన లేదు. మీరు జాతులన్నిలోను స్వల్పసంఖ్యాకులు.
8. అయితే ఆయన స్వయముగా మిమ్ము ప్రేమించెను గనుక, మీ పితరులతో తాను చేసికొనిన వాగ్ధానమును నిలబెట్టుకోగోరెను గనుక, మిమ్మే ఎన్నుకొనెను. కావుననే ప్రభువు తన బాహుబలముతో మిమ్ము తోడ్కొనివచ్చెను. ఐగుప్తురాజగు ఫరో దాస్యమునుండి మిమ్ము విడిపించెను.
9. కావున మీ దేవుడైన యావే ఒక్కడే నిక్కముగా దేవుడని తెలుసుకొనుడు. అతడు నమ్మదగినవాడు. ఆ ప్రభువు తనను ప్రేమించి తన ఆజ్ఞలను పాించు వారిని కరుణించును. వేయితరముల వరకు వారితో తన ఒడంబడిక నిలుపుకొనును.
10. తనను ద్వేషించు వారిని ఆలస్యము చేయక బహిరంగముగా దండించు టకు ఏమాత్రమును వెనుదీయడు.
11. కనుక నేను ఈనాడు మీకు ఆదేశించిన ఆజ్ఞలను, విధులను, చట్టములను తు.చ. తప్పకుండ పాింపుడు.
12. మీరు ఈ ఆజ్ఞలు సావధానముగావిని వీనిని జాగ్రత్తగా పాింతురేని ప్రభువు పూర్వము మీ పితరులకు మాట ఇచ్చినట్లే మీతో తన ఒడంబడికను కొనసాగించును. మిమ్ము కరుణతో ఆదరించును.
13. ఆ ప్రభువు మిమ్మును ప్రేమించును. ఆయన దీవెననందుకొని మీరు తామరతంపరగ వృద్ధిచెందు దురు. మీ గర్భఫలమును దీవించును. ఆయన ఆశీర్వాదము వలన మీ పొలమునుండి ధాన్యము, ద్రాక్షసారాయము ఓలివునూనె సమృద్ధిగా లభించును. మీ పశువుల మందలు, గొఱ్ఱెలమందలు, మేకల మందలు పెంపుచెందును. ప్రభువు మీకిచ్చెదనని వాగ్ధానము చేసిన నేలమీద ఈ భాగ్యములన్నియు మీకు సిద్ధించును.
14. లోకములోని జాతులన్ని కంటెను మీరు ధన్యాత్ములగుదురు. మీ ప్రజలలో గొడ్డుమోతుతనము ఉండదు. మీ మందలలో చూలుమోయని పశువు లుండవు.
15. ప్రభువు మిమ్ము సకల రోగములనుండి కాపాడును. మీరు ఐగుప్తున ఎరిగియున్న కఠిన రోగములు ఏమియును మీకు సోకజాలవు. ఆయన వానిని మీ శత్రువుల మీదికే మరల్చును.
16. కనుక ప్రభువు మీ చేతికి చిక్కింపనున్న ప్రతిజాతిని మీరు నాశనము చేయవలయును. వారిమీద కనికరము చూపవలదు. వారి దైవములను ఆరాధించితిరా మీరు ఉరిలో చిక్కుకొన్నట్లే.
ప్రభువైన యావే బలము
17. ఈ ప్రజలు మీకంటెను అధిక సంఖ్యాకు లనియు వారిని వెళ్ళగొట్టుట అసాధ్యమనియు భావింపకుడు. మీరు వారికి భయపడవలదు.
18. ప్రభువు ఫరోను ఐగుప్తు ప్రజలను ఎట్లు నాశనము చేసెనో జ్ఞప్తికి తెచ్చుకొనుడు.
19. ఆయన ఆ దేశమున ప్టుించిన అరిష్టము లను మీరు కన్నులారచూచితిరి. అద్భుతకార్యముల తోను, సూచకక్రియలతోను, హస్తబలముతోను, చాచిన బాహువుతోను ప్రభువు మిమ్ము అచినుండి తోడ్కొని వచ్చెనుగదా! నేడు మీరు భయపడు ఈ జాతులకు గూడ మీ దేవుడైన ప్రభువు అదేగతి ప్టించును.
20. ఇంకను మిమ్ము తప్పించుకొని దాగుకొనిన వారినిగూడ ప్రభువు కందిరీగలనుపంపి నాశనము చేయించును.
21. మీ దేవుడైన యావే మీకు చేదోడువాదోడుగా మీ మధ్యన ఉన్నాడు. ఆయన బలమైనదేవుడు, భీకరుడైన ప్రభుడు. కనుక మీరు ఆ జాతులకు భయ పడనక్కరలేదు.
22. మీరు ఆ నేలను స్వాధీనము చేసికొనుకొలది ప్రభువు అచి శత్రుజాతులను క్రమ క్రమముగా హతమార్చును. మీరు ఆ జాతులన్నింని వెంటనే తుడిచివేయలేరు. అట్లు చేయుదురేని వన్య మృగములు విస్తరిల్లి మిమ్ము పీడించును.
23. ప్రభువు మాత్రము వారిని మీ చేతికి చిక్కించును. వారిని కలవరప్టిె నాశనము చేయును.
24. ప్రభువు ఆ జాతుల రాజులను మీ చేతికి చిక్కింపగా మీరు వారి పేర్లను నేల మీదినుండి తుడిచివేయుదురు. ఏ రాజును మిమ్ము ఎదిరింపజాలడు. మీరు అందరిని చంపుదురు.
25. మీరు వారి పూజావిగ్రహములనెల్ల కాల్చివేయవలయును. వానికి పొదిగిన వెండిబంగార ములను ఆశింపకుడు, తీసికొనకుడు. అవి మీకు ఉరికాగలవు. ప్రభువు విగ్రహారాధనను అసహ్యించు కొనును.
26. మీరు ఆ ప్రతిమలను మీ ఇండ్లకు కొనివత్తురేమో జాగ్రత్త! వారివలె మీరును శాపము పాలగుదురు. ఆ విగ్రహములు శాపగ్రస్తములు. కనుక మీరు వాిని నీచాతినీచముగా గణించి అసహ్యించు కొనవలయును.