యిస్రాయేలునకు గుణపాఠములు

11 1. మీ ప్రభువైన యావేను ప్రేమించి ఆయన ఆజ్ఞలు, విధులు, కట్టడలు ఎల్లవేళల పాింపుడు.

2. ఇన్నాళ్ళు ప్రభువునుండి శిక్షణ పొందినది మీరేగాని మీ తనయులు కాదని గుర్తింపుడు. మీరు ఆ ప్రభువు మహత్తును, ఆయన బాహుబలమును, చాచినచేతిని తెలిసికొింరి.

3. ఫరోను, ఐగుప్తీయులను అణచి వేయుటకు ఆయన చేసిన అద్భుతకార్యములను కన్నులారచూచితిరి.

4. ఆ ప్రభువు ఐగుప్తు సైనికులను వారి రథములతోను, గుఱ్ఱములతోను మట్టుపెట్టెను. ఆ యోధులు మిమ్ము వెన్నాడుచుండగా ప్రభువు వారిని రెల్లుసముద్రమున ముంచివేసెను. నేివరకును వారిజాడ తెలియలేదు.

5. మీరిక్కడికి చేరక ముందు ఆయన ఎడారిలో ఏమి చేసెనో మీకెల్లరకు బాగుగా తెలియును.

6. రూబేను తెగకుచెందిన ఎలీయాబు కుమారులు దాతాను, అబీరాములను ప్రభువు ఏమి చేసెనో జ్ఞప్తికి తెచ్చుకొనుడు. యిస్రాయేలీయులెల్లరు చూచుచుండగనే నేల నోరువిప్పి వారి కుటుంబము లను, గుడారములను వారి సమస్తవస్తువులను మ్రింగి వేసెను.

7. ప్రభువు చేసిన మహాకార్యములన్నియు మీరు స్వయముగా వీక్షించిరి.

ప్రమాణములు, హెచ్చరికలు

8. నేడు నేను ఆదేశించు ఆజ్ఞలెల్ల మీరు పాింప వలయును. అట్లు చేయుదురేని మీరు బలముకలిగి నదినిదాి ఆ దేశమును స్వాధీనము చేసికొనుటకు సమర్థులగుదురు.

9. ప్రభువు మీ పితరులకు, వారి సంతతికి దయచేయుదునని వాగ్ధానముచేసిన పాలు తేనెలు జాలువారు దేశమున చిరకాలము జీవింతురు.

10. మీరు స్వాధీనము చేసికొనబోవు నేల ఇప్పుడు మీరు వెడలివచ్చిన ఐగుప్తుదేశము వింది కాదు. మీరు అచి పొలమున పైరు వేసినపుడు కూరగాయల తోటకువలె, కాళ్ళతో  నీరు పెట్టెడివారు.

11. కాని యిపుడు మీరు ప్రవేశింపబోవు దేశము కొండలతోను, లోయలతోను నిండినది. అచట వానలే నేలను తడుపును.

12. ప్రభువు ఆ నేలను పరామర్శించు చుండును. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ప్రభువు ఆ నేలను వీక్షించుచుండును.

13. కనుక నేడు నేను మీకు ఆదేశించు ఆజ్ఞలెల్ల పాింపుడు. ఆ ప్రభువును నిండుమనసుతో ప్రేమించి సేవింపుడు.

14. అప్పుడు ఆయన మీకు సకాలమున తొలకరి వానలును, కడవరివానలును కురిపించును. ఆ ఫలితముగా మీకు ధాన్యము, ద్రాక్షసారాయము, ఓలివు తైలము సమృద్ధిగా లభించును.

15. మీ పొలమున పశుగ్రాసము దట్టముగా పెరుగును. మీరు కోరుకొన్న భోజనపదార్థములెల్ల లభించును. 16. కాని మీరు మీ మనసున అన్యదైవతములను ఆరాధించి ప్రభువునుండి వైదొలగుదురేమో జాగ్రత్త!

17. అటుల చేసినచో ప్రభువు కోపము మీపై రగుల్కొనును. ఆయన వానలు కురిపింపడు. పొలము పంటలుపండని కారణమున ఆ సారవంతమైన నేలమీద కూడ మీరెల్లరు సత్వరమే నాశనమగుదురు.

పర్యవసానము

18. నేడు నేను మీకు ఆదేశించిన ఆజ్ఞలను మీ హృదయములో నిలుపుకొనుడు. వీనిని జ్ఞాపకార్థముగా మీ చేతులమీద సూచకములుగా, మీ నొసిమీద బాసికముగా కట్టుకొనుడు.

19. ఈ ఆజ్ఞలను మీ పిల్లలకు బోధింపుడు. మీరు ఇంటనున్నను, బయట నున్నను, శ్రమచేయుచున్నను, విశ్రాంతి తీసికొను చున్నను వీనిని గూర్చి ముచ్చింపుడు.

20. మీ ద్వారబంధములమీదను, నగరద్వారములమీదను వీనిని వ్రాసిపెట్టుకొనుడు.

21. ఇట్లు చేయుదురేని ప్రభువు మీ పితరులకు వాగ్ధానము చేసిన నేలమీద మీరును, మీ పిల్లలును భువిపై ఆకాశము నిలిచి యున్నంతకాలము చీకుచింతలేకుండ జీవింతురు.

22. నేను మీకు ఉపదేశించిన ఆజ్ఞలనెల్ల జాగ్రత్తగా పాింపుడు. ప్రభువును ప్రేమించి ఆయన ఆజ్ఞలను చేకొని ఆయన మీద నమ్మిక చూపుడు.

23. అప్పుడు ప్రభువు ఈ జాతులనెల్ల మీ ఎదుినుండి తరిమివేయును. మీకంటె అధికసంఖ్యాకులు, బలాఢ్యు లైనజాతులను మీరు స్వాధీనము చేసుకొందురు.

24. మీరు పాదములు మోపిన నేలయెల్ల మీవశమగును. దక్షిణమున ఎడారినుండి ఉత్తరమున లెబానోను కొండవరకును, తూర్పున యూఫ్రీసు నదినుండి పడమరయందు మధ్యధరాసముద్రము వరకును, మీ దేశము విస్తరిల్లును.

25. ఏ నరుడు మిమ్మెదిరింప జాలడు. ప్రభువు మాట ఇచ్చినట్లే మీరు వెళ్ళిన తావులందెల్ల ప్రజలు మిమ్ము చూచి భయపడుదురు.

26. మీరు ఆశీర్వాదమును, శాపమును గూడ పొందుమార్గమును నేడు మీకు చూపుచున్నాను.

27. నేను మీకు ఆదేశించిన ప్రభువు ఆజ్ఞలు పాింతురేని మీరు ఆశీర్వాదము పొందుదురు.

28. కాని ప్రభువు ఆజ్ఞలను ధిక్కరించి నేను చూపిన మార్గమునుండి వైదొలగి ఇదివరకు మీరెరుగని అన్యదైవముల పూజింతురేని, తప్పక శాపముపొందుదురు.

29. ప్రభువు తాను వాగ్ధానముచేసిన నేలకు మిమ్ము తోడ్కొనిపోయినపుడు మీరు పై ఆశీర్వాద వచనములను గెరిసీము కొండమీదనుండి, పై శాప వచనములను ఏబాలుకొండ మీదినుండి ఎల్లరకును ప్రకింపుడు.

30. ఈ కొండలు రెండు యోర్దాను నదికి పశ్చిమమున కనానీయులు వసించు దేశమున కలవు. మరియు అవి గిల్గాలు పట్టణమునకు చెంతగల మోరే క్షేత్రములోని సింధూరవృక్షములకు దాపు లోనేయున్నవి.

31. మీరు నదిని దాి ప్రభువు మీకిత్తునని బాసచేసిన దేశమును స్వాధీనము చేసికొన బోవుచున్నారు. మీరు ఆ నేలను ఆక్రమించుకొని అచట వసింతురు.

32. అప్పుడు నేడు నేను మీకు విధించిన కట్టడలను, ఆజ్ఞలనెల్ల పాింపుడు.

Previous                                                                                                                                                                                                        Next  

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము