ప్రతీకార నియమములు

నరహంతకులకు ఆశ్రయపట్టణములు

19 1. ప్రభువు ఆ అన్యజాతులను మీ వశము చేసి వారి దేశమును మీకు ఈయగా మీరు వారి నగరములను, గృహములను స్వాధీనము చేసికొని వానియందు నివసింపమొదలిడిన పిదప, 2-3. ఆ దేశమును మూడుభాగములుగా విభజింపుడు. ఒక్కొక్క భాగమునకు ఒక్కొక్క నగరమును ప్రత్యేకింపుడు. ఆ నగరములను సులువుగా చేరుకొనుటకు మార్గములు ఉండవలయును. నరహంతకులు ఆ నగరములకు పారిపోయి తలదాచుకోవచ్చును.

4. ఎవడైన బుద్ధి పూర్వకముగాగాక పొరపాటున తోినరుని చంపెనేని ఆ ఆశ్రయపట్టణములకు పారిపోయి ప్రాణరక్షణ కావించుకోవచ్చును.

5. ఉదాహరణకు ఇరువురు మనుష్యులు వంటచెరకు కొరకు అడవికి వెళ్ళిరను కొందము. వారిలో ఒకడు చెట్టును నరుకుచుండగా గొడ్డలిపిడి ఊడి తోివానికి తగిలి వాడు చనిపోయె ననుకొందము. ఆ హంతకుడు పై నగరములలో తలదాచుకొని ప్రాణములు కాపాడుకోవచ్చును.

6. ఒక్క పట్టణమేయున్నచో ఆ పట్టణము చాలదూరమున ఉన్నచో హతుడైన వానిబంధువు పగతీర్చుకోగోరి హంతకుని వెన్నాడి దారిలోనే పట్టుకొని కోపావేశముతో సంహరింపవచ్చును. కాని హంతకునికి చచ్చిన వానిపట్ల వైరములేదు. తాను అతనిని బుద్ధిపూర్వక ముగా చంపలేదు. కనుక అతడు చంపదగినవాడు కాడు.

7. కావుననే హంతకుల కొరకు మూడుపట్టణ ములను ప్రత్యేకింపుడని నేను మిమ్ము ఆజ్ఞాపించు చున్నాను.

8. ప్రభువు మీ పితరులకు మాటయిచ్చినట్లే మీ దేశమును విస్తృతముకావించి తాను ప్రమాణము చేసిన భూమినంతిని మీ వశముచేసిన పిదప, 9. మరి మూడుపట్టణములను కూడ ప్రత్యేకింపుడు. ఈనాడు నేను విధించిన విధులన్నిని మీరు పాించిన యెడల ప్రభువును ప్రేమించి ఆయన ఆజ్ఞలను అనుసరింతురేని, మరి మూడుపట్టణములను తప్పక మీ పరము చేయును.

10. ప్రభువు మీకొసగిన ఆ నేలమీద నిర్దోషులెవరును ప్రాణమును కోల్పోరు. మీరు నిరపరాధులను చంపిన పాపమునబోరు.      

11. కాని యెవడైన తన పొరుగువాని మీద వైరము పెట్టుకొని వాని కొరకు పొంచియుండి వాని మీదబడి చచ్చునట్లుక్టొి పై పట్టణములకు పారిపోయె ననుకొందము.

12. అప్పుడు అతని ఊరిపెద్దలే వానిని ప్టించి చనిపోయిన వాని బంధువునకు అప్ప గింపవలయును. ఆ బంధువు అతనిని వధించి పగతీర్చుకొనును.

13. అి్ట వానిమీద మీరు దయ చూపరాదు. మీరు యిస్రాయేలు దేశమున నిర్దోషుల వధను పూర్తిగా వారింతురేని మీకు క్షేమము కలుగును.

సరిహద్దులు – సాకక్షులు

14. నీవు స్వాధీనపరచుకొనునట్లు, యావే నీకిచ్చుచున్న దేశములో నీకు కలుగు నీ స్వాస్థ్యములో, పూర్వులు మీ పొరుగువారి పొలమునకు పాతిన గట్టు రాళ్ళను తొలగింపకుడు.

15. మానవుని దోషిగా నిర్ణయించుటకు ఒక్కని సాక్ష్యము చాలదు. ఇద్దరు లేక ముగ్గురు సాక్ష్యము పలికిననే గాని ఎవనినైన దోషిగా నిర్ణయింపరాదు.

16-17. ఎవడైన కపటముతో మరియొకని మీద నేరముమోపెనేని వారు ఇరువురును ప్రభువు ఎన్నుకొనిన ఆరాధనస్థలమునకు పోవలయును. అప్పుడు అచ్చట అధికారములోనున్న యాజకులు, న్యాయాధిపతులు వారికి తీర్పుచెప్పుదురు.

18. న్యాయాధిపతులు ఆ తగవును జాగ్రత్తగా పరిశీలింతురు. కాని అభియోక్త తోియిస్రాయేలీయుని మీద అన్యా యముగా నేరము మోపెనని తేలిన యెడల, 19. అభియోక్త తన సహోదరునికి ఎి్ట శిక్ష ప్రాప్తింప తలంచునో అి్ట శిక్షనే అభియోక్తకు విధింపవల యును. ఈ రీతిగా ఈ దుష్కార్యమును అణచివేయ వలయును.

20. ఇతరులు ఈ సంగతివిని భయపడి మరల ఇి్ట పాడుపనికి పాల్పడరు.

ఎంతి కీడుకు అంతి ప్రతీకారము

21. ఇి్ట తగవులలో మీరు జాలిచూపరాదు. ఎంతి కీడుచేసిన వారికి అంతి ప్రతీకారము చేయుడు. కనుక ప్రాణమునకు ప్రాణము, కింకి కన్ను, పింకి పన్ను, చేతికి చేయి, కాలికి కాలు శిక్ష.

Previous                                                                                                                                                                                                        Next  

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము