విడాకులు

24 1. ఒకడు ఒక స్త్రీని పెండ్లియాడెననుకొందము. అటు తరువాత ఆమె ఏదో అనుచితకార్యమునకు పూనుకొనినందున అతనికి నచ్చలేదు. కనుక అతడు ఆమెకు విడాకులపత్రము వ్రాసి, ఆమె చేతికిచ్చి ఇంి నుండి పంపివేసెననుకొందము.

2. ఆమె అతనిని విడనాడి మరియొకనిని పెండ్లిచేసుకొనవచ్చును.

3. ఈ రెండవవానికికూడ ఆమెమీద ఇష్టము పుట్టని యెడల అతడు కూడ విడాకుల పత్రమువ్రాసి, ఆమె చేతికిచ్చి ఆమెను పంపివేసెననుకొందము. లేదా అతడు గతించెననుకొందము.

4. అప్పుడు మొదట పెండ్లియాడినవాడు ఆమెను మరల స్వీకరింపరాదు. ఆమె అపవిత్రురాలైనది. అి్ట వివాహమును ప్రభువు అసహ్యించుకొనును. దానిద్వారా మీరు ప్రభువు మీకీయనున్న దేశమునకు పాపము సోకునట్లు చేయుదురు.

దుర్బలులను రక్షించు నియమములు

5. క్రొత్తగా పెండ్లియాడిన వానిని యుద్ధమునకు పిలువరాదు. అతనికి ఎి్టకార్యభారమును ఒప్పజెప్ప రాదు. తాను పెండ్లియాడిన వధువును సంతోష పెట్టుటకు ఒక ఏడాదిపాటు అతనిని ఇంిపట్టునే ఉండనీయవలయును.

6. ఎవడును ఇతరుని తిరుగలిని కుదువప్టిెంచు కోరాదు. అటులచేసినచో అతని జీవనాధారమునే తాకట్టు ప్టిెంచుకొన్నట్లు.

7. ఎవడైన తోియిస్రాయేలీయుని అపహరించి బానిసగా వాడుకొనిన లేక బానిసగా అమ్మివేసిన ఆ దొంగనుప్టి చంపవలయును. అటులచేసి, ఆ చెడును మీమధ్యనుండి పరిహరించుడు.

8. కుష్ఠరోగము విషయమున మీరు లేవీయ యాజకుల ఆదేశములన్నిని జాగ్రత్తగా పాింప వలయును. నేను వారికి ఆదేశించిన విధులన్నిని అనుసరింపుడు.

9. మీరు ఐగుప్తునుండి వెడలి వచ్చునపుడు ప్రభువు మిర్యామునకు ఏమిచేసెనో గుర్తుంచుకొనుడు.

10. నీవు ఇతరునిచేత ఏదైన తాకట్టు ప్టిెంచు కొని వానికి అప్పిచ్చినయెడల ఆ తాకట్టు ప్టిెన వస్తువును గుంజుకొని వచ్చుటకై వాని ఇంిలోనికి వెళ్ళకూడదు.

11. నీవు వెలుపలనేయుండుము. అతడు ఆ వస్తువును నీ యొద్దకు కొనివచ్చును.

12. బాకీ దారుడు పేదవాడైనచో అతడు నీకు తాకట్టుగా ఇచ్చిన అంగీని రాత్రి నీ ఇంట ఉంచుకోవలదు.

13. ప్రొద్దు గ్రుంకగానే వాని అంగీని వానికి ఇచ్చివేయుము. అతడు దానిని తొడుగుకొని నిద్రించును. నీకు కృతజ్ఞుడై యుండును. అది ప్రభువు దృష్టికి నీకు నీతియగును.

14. నిరుపేదయైన కూలివానిని, అతడు యిస్రా యేలీయుడైనను లేక మీ నగరములలో వసించు పరదేశీయుడైనను అణచివేయరాదు.

15. ప్రతిరోజు ప్రొద్దుగ్రుంకక మునుపే అతని కూలి అతనికి ఇచ్చి వేయుము. అతడు లేనివాడు కనుక ఆ కూలికొరకు కనిపెట్టుకొనియుండును. ఇట్లు చేయవేని అతడు ప్రభువునకు నీమీద మొరపెట్టుకొనును. అప్పుడు నీకు పాపము చుట్టుకొనును.

16. తండ్రులు చేసిన దోషములకు కుమారుల కును, కుమారులుచేసిన దోషములకు తండ్రులకును మరణశిక్ష విధింపరాదు. ఎవరి దోషములకు వారినే చంపవలయును.

17. పరదేశులకును, అనాధలకును అన్యాయపు తీర్పు చెప్పరాదు. వితంతువు కట్టుబట్టను తాకట్టు ప్టిెంచుకోరాదు.

18. మీరు ఐగుప్తున బానిసలై యుండగా ప్రభువు మీకు దాస్యవిముక్తి కలిగించెనని గుర్తుంచుకొనుడు. కనుకనే మిమ్ము ఈ రీతిగ ఆజ్ఞా పించుచున్నాను.

19. నీవు పొలమున కోతకోయించునపుడు ఒక పనను జారవిడుతువేని దాని కొరకు తిరిగివెళ్ళవలదు. పరదేశులు, అనాధలు, వితంతువులకొరకు దానిని వదలివేయుము. అప్పుడు ప్రభువు నీ కార్యములన్నిని దీవించును.

20. నీవు ఓలివుపండ్లను కోయునపుడు మరల రెండవసారికూడ కొమ్మలను గాలింపకుము. జారిపోయినపండ్లను పరదేశులకు, అనాధలకు, వితంతువులకు వదలివేయుము.

21. నీవు ద్రాక్ష పండ్లు సేకరించునపుడు మరల రెండవమారు తోటను గాలింపవలదు. జారిపోయిన పండ్లను పరదేశులకు, అనాధలకు, వితంతువులకు వదలివేయుము.

22. మీరు ఐగుప్తులో బానిసలుగా ఉంిరని మరువకుడు. కనుకనే మీకీయాజ్ఞ విధించితిని.

Previous                                                                                                                                                                                                    Next  

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము