ఆచార నియమములు

మొదిపంట

26 1. మీరు ప్రభువు మీకు ఈయనున్న నేల నాక్రమించుకొని అచట స్థిరపడినపిదప, 2. మీ పొలమున పండినపంటలో ప్రథమఫలములను గంపలో పెట్టుకొని ప్రభువు తన నామమునకు మందిరముగా ఎంచుకొనిన ఏకైక ఆరాధనస్థలమునకు  కొనిపొండు.

3. అప్పుడు అచట సేవచేయుచున్న యాజకునివద్దకు పోయి ‘నేను ప్రభువు మన పితరు లకు వాగ్ధానము చేసిన నేలను చేరుకొింనని నేడు దేవుని ముందు ప్రమాణముచేసి చెప్పుచున్నాను’ అని చెప్పుడు.

4. అంతట యాజకుడు నీ గంపను తీసికొని ప్రభువు బలిపీఠము ముందుంచును.

5. అప్పుడు నీవు ప్రభువు సమక్షమున ఇట్లు ఉచ్ఛరింపవలయును: ” ‘మా వంశకర్త దేశసంచారియగు అరామీయుడు. అతడు కొద్దిమందితో ఐగుప్తునకు వెళ్ళి అచట పరదేశిగా బ్రతికెను. కాని ఆ కొద్దిమంది బలమైన మహాజాతిగా వృద్ధిచెందెను.

6. ఐగుప్తీయులు మనకు కీడుతలప్టిె మనలను బాధించిరి. మనచేత వ్టెిచాకిరి చేయించుకొనిరి.

7. మనము మన పితరుల దేవుడైన యావేకు మొర పెట్టగా, యావే దేవుడు మనగోడు వినెను. ఆయన మన కష్టములను, చాకిరిని, మన అణచివేతను కన్నులార చూచెను.

8. దేవుడైన యావే తన హస్త బలమువలనను, చాపిన బాహువులవలనను, సూచక క్రియలవలనను, భయంకర కార్యములతోను, అద్భు తములతోను మనలను ఐగుప్తునుండి తోడ్కొనివచ్చెను.

9. మనలను ఇచికి కొనివచ్చి పాలుతేనెలు జాలు వారు ఈ నేలను మనకు ప్రసాదించెను.’

10. కనుక ఇప్పుడు ప్రభువు నాకు దయచేసిన పంటనుండి ఈ ప్రథమఫలములను ఆయనకు కానుకగా కొనివచ్చి తిని” అని ప్రభువుసన్నిధిన చెప్పి, నీ గంపను ప్రభువు నెదుటప్టిె ఆయనకు మ్రొక్కుము.

11. తద నంతరము నీ కుటుంబముతో, నీ నగరమున వసించు లేవీయులతో, పరదేశులతో కలసి ఉత్సవము చేసికొని ప్రభువు దయచేసిన మేలైన పదార్థములన్నింని అనుభవింపుము.

పదియవవంతు పంట

12. ప్రతి మూడవయేడు మీకు పండిన పంటలో పదియవవంతును లేవీయులకు, పరదేశులకు, అనాధలకు, వితంతువులకు చెల్లింపవలయును. వారు ఆ పంటను మీ నగరములలో సంతృప్తికర ముగా భుజింతురు.

13. అటుల నీవు పదియవ వంతు చెల్లించినపిమ్మట ప్రభువు సమక్షమున ఇట్లు ఉచ్చరింపుము. ‘ప్రభూ! నేను నీకర్పింపవలసిన పదియవవంతు చెల్లించితిని. నీవాజ్ఞాపించినట్లే లేవీయులకు, పరదేశులకు, అనాధలకు, వితంతువు లకు దానినొసగితిని. థమభాగములను గూర్చిన నీ నియమములను నేను మీరలేదు, విస్మరింపలేదు. 14. నేను దుఃఖముగానున్నప్పుడు దానిని భుజింప లేదు. శుద్ధిచేసికొనకయే అంటుకొనలేదు. దానిని మృతపూజలో అర్పణముగా నీయలేదు. ప్రభూ! ఈ పదియవవంతును గూర్చి నీవు విధించిన ఆజ్ఞలన్నిని పాించితిని.

15. పవిత్రమైన నీ పరమపదము నుండి ఈ యిస్రాయేలు ప్రజలను దీవింపుము. నీవు పితరులకు వాగ్ధానము చేసినట్లే మాకు ప్రసాదించిన ఈ పాలుతేనెలుజాలువారు నేలను దీవింపుము.’

అంతిమోపదేశము రెండవ ఉపదేశపు ముగింపు

యిస్రాయేలు ప్రభువుప్రజ

16. నేడు ప్రభువు మీరు ఈ కట్టడలను ఆజ్ఞ లన్నిని పాింపగోరుచున్నాడు. మీరు పూర్ణహృదయ ముతోను, పూర్ణాత్మతోను వీనిని అనుసరింపుడు.

17. నేడు మీరు ప్రభువును మీదేవునిగా ఎన్నుకొింరి. ఆ ప్రభువు మార్గములందు నడచుచు, ఆయన కట్టడలను, విధులను, ఆజ్ఞలన్నిని పాించి, ఆయనకు విధేయులై యుండుటకు సమ్మతించితిరి.

18. ప్రభువు కూడ తాను మాటఇచ్చినట్లే నేడు మిమ్ము తన సొంత ప్రజలనుగా చేసికొనెను. కాని మీరు తన ఆజ్ఞలన్నిని చేకొనవలయునని ఆ ప్రభువు కోరిక.

19. ఆయన తాను కలిగించిన జాతులన్నికంటె మిమ్ము అధికులను చేయును. దానివలన మీకు కీర్తి ప్రతిష్ఠలు కలుగును. ప్రభువు చెప్పినట్లే మీరు ఆయన పవిత్ర ప్రజలగుదురు.

Previous                                                                                                                                                                                                    Next  

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము