మూడవ ఉపదేశము
ఐగుప్తు నిర్గమనము, నిబంధన
29 1. మోషే యిస్రాయేలీయులందరిని ప్రోగుచేసి ఇట్లనెను: ”ప్రభువు ఐగుప్తురాజు ఫరోను, అతని ఉద్యోగులను, అతని దేశమును ఏమిచేసెనో మీరు కన్నులార చూచితిరికదా!
2. ప్రభువు పంపిన ఘోర వ్యాధులు, సూచకక్రియలు, అద్భుతకార్యములు మీరెల్లరును చూచితిరికదా!
3. కాని మీరు చూచిన సంఘటనలను అర్థము చేసికొను శక్తిని మాత్రము ఆయన నేివరకును మీకు ప్రసాదింపలేదు.
4. నేను మీ దేవుడైన యావేనని మీరు తెలుసు కొనునట్లు నలువదియేండ్లపాటు మిమ్మును ఎడారిలో నడిపించితిని. అంతకాలము మీ శరీరముమీది బట్టలు చినిగిపోలేదు. మీ కాలిచెప్పులు అరిగిపోలేదు.
5. అప్పుడు మీకు తినుటకు భోజనము దొరకలేదు. త్రాగుటకు ద్రాక్షసారాయము గాని, ఘాటైన మద్యము గాని లభింపలేదు. అయినను ప్రభువు మీ అవసర ముల నెల్ల తీర్చెను. దానివలన ప్రభువే మీ దేవుడని వెల్లడియైనది.
6. మనము ఈ తావు చేరుకొనినపుడు హెష్బోను రాజగు సీహోను, బాషాను రాజగు ఓగు మనమీద యుద్ధమునకు వచ్చిరి. కాని మనము వారిని జయించి తిమి.
7. వారి దేశమును స్వాధీనము చేసికొని రూబేను, గాదు, మనష్షే అర్ధతెగవారికి పంచియిచ్చి తిమి.
8. మీరు ఈ నిబంధనపు షరతులన్నిని పాింతురేని తప్పక వర్ధిల్లుదురు.
9-10. నేడు మీరు ప్రభువు ఎదుట ప్రోగైతిరి. మీ తెగనాయకులు, పెద్దలు, అధికారులు, స్త్రీలు, పిల్లలు, మీ చెంతవసించుచు మీకు వంటచెరకు నీళ్ళు మోసికొనివచ్చు పరదేశులెల్లరును ఇచట సమావేశ మైతిరి.
11. మీరు నేడు ప్రభువు మీతో చేసికొనబోవు నిబంధనను అంగీకరింపనున్నారు.
12. ఆయన పూర్వము మన పితరులైన అబ్రహాము, ఈసాకు, యాకోబులకు మాట ఇచ్చినట్లే నేడు మనలను, తన సొంత ప్రజలుగా స్వీకరించును. తాను మనకు దేవుడగును.
నిబంధనము, భావితరములు
13. నేడు ప్రభువు మీతో మాత్రమే ఈ నిబంధ నము చేసికొనుటలేదు. మీరు మాత్రమే దాని బాధ్యత లను అంగీకరించుటలేదు.
14. నేడు తన సమక్షమున సమావేశమైన మనతోచేసినట్లు, సమావేశము కాని మన సంతానముతో కూడ ప్రభువు ఈ నిబంధనము చేసికొనుచున్నాడు.
15. ఐగుప్తున జీవించుటయనగా ఎి్టదో, ఇతర జాతుల దేశములగుండా పయనముచేయుట యనగా న్టెిదో మీకు తెలియును.
16. ఆ ప్రజలు కొయ్యతో, రాతితో, వెండిబంగారములతో చేసికొనిన హేయమైన విగ్రహములను మీరుచూచిరి.
17. కనుక నేడిట ప్రోగైనవారిలో ఏ స్త్రీ గాని, ఏ పురుషుడుగాని, ఏ కుటుంబముగాని, ఏ తెగగాని ప్రభువును విడనాడి అన్యజాతుల దైవములను కొలవ కుండునుగాక! మూలము మొలకెత్తి చేదైన విషఫల ములు ఫలింపకుండునుగాక!
18. ఈ నియమము లన్నిని ఆలకించిన పిదపగూడ మీలో ఎవడైన తన హృదయకాఠిన్యతనుబ్టి కన్నుమిన్నుగానక, మద్యము చేత దాహము తీర్చుకొనువానివలె, ‘నా ఇష్టము వచ్చినట్లు నేను ప్రవర్తించిన నష్టమేమి లేదులే’ అని తలంచుచూ, ప్రభువు నన్ను ఆశీర్వదించునని అను కొనును.
19. అి్ట ఆలోచనలు కలవానిని ప్రభువు క్షమింపడు. అసూయతో కూడిన ప్రభువు కోపము వానిని దహించివేయును. ఈ గ్రంథమున పేర్కొన బడిన శాపములన్నియు అతని మెడకు చుట్టుకొనును. ప్రభువు అతని పేరును ఆకాశము క్రింద కానరాకుండ చేయును.
20. ఈ ధర్మశాస్త్రమున లిఖింపబడిన నిబంధనపుశాపముననుసరించి ప్రభువు యిస్రాయేలు తెగలనుండి అతనిని వేరుచేసి నాశమునకు గురి చేయును.
21. భవిష్యత్తులో రానున్న మీ సంతానము, దూరదేశమునుండి వచ్చిన అన్యజాతి ప్రజలు, ప్రభువు మీ దేశముమీద పంపనున్న రోగములను, అరిష్టము లను చూతురు.
22. మీ దేశమంతయు గంధకము తోను, ఉప్పుతోను నిండిన మరుభూమి అగును. అచట ఎవ్వడును పైరువేయడు, అసలు గడ్డి కూడ మొలవదు. పూర్వము ప్రభువు మహోగ్రుడై నాశనము చేసిన సొదొమ గొమొఱ్ఱాలవలె, ఆద్మా సెబోయీముల వలె మీ దేశము భస్మమైపోవును.
23. అప్పుడు సకలజాతులు ”ప్రభువు ఈ నేలకింతకీడు చేయనేల? ఆయన ఇంతగా కోపింపనేల?” అని ప్రశ్నింతురు.
24. అందులకు జనులు, ”ఈ ప్రజలు తమ పితరుల దేవుడైన ప్రభువు నిబంధనమును కాలదన్నిరి. వీరిని ఐగుప్తునుండి తోడ్కొనివచ్చినపుడు దేవుడు వీరితో చేసికొనిన నిబంధనమును అతిక్రమించిరి.
25. వీరు ప్రభువు అంగీకరింపని అన్యదైవములను సేవించి వాికి నమస్కరించిరి.
26. కనుక యావే మహోగ్రుడై ఈ ప్రజలను ఈ గ్రంథమున లిఖింపబడిన శాపము లన్నికి బలి కావించెను.
27. ప్రభువు మహారోష ముతో మహాక్రోధముతో వీరిని స్వీయదేశమునుండి పెల్లగించివేసి, అన్యదేశములలో విసరివేసెను. నేికిని వీరచటనే పడియున్నారు” అని బదులుచెప్పుదురు.
ప్రవాసము నుండి తిరిగివచ్చుట, పశ్చాత్తాపము
28. రహస్యవిషయములన్నియు ప్రభువునకే తెలియును. కాని ఆయన మనకును, మన సంతతికిని తన శాసనములను శాశ్వతముగా వెల్లడిచేసెను. కనుక మనము ఈ యాజ్ఞలనెల్ల పాింపవలయును.