ఆకాను శాపమును ధిక్కరించుట
7 1. కాని యిస్రాయేలీయులు శాపమును లక్ష్య పెట్టక దోషముచేసిరి. యూదా తెగవాడును సెరా మునిమనుమడును, సబ్ది మనుమడును, కర్మీ కుమారు డునైన ఆకాను శపింపబడిన వస్తువులు కొన్నిని తీసి కొనెను. అందుచే యావే యిస్రాయేలీయులపై కోపించెను.
శాప అతిక్రమణము అపజయమును తెచ్చిపెట్టుట
2. అప్పుడు యెహోషువ బేతేలునకు తూర్పు దిక్కుననున్న ‘హాయి’ అను పురమునకు పోయి వేగు నడిపిరండని ఇద్దరు మనుష్యులను యెరికో నుండి పంపించెను. వారు హాయి అను పురమునకు పోయి వేగునడపి యెహోషువ యొద్దకు తిరిగివచ్చిరి.
3. ”ప్రజలందరు వెళ్ళనక్కరలేదు. రెండు, మూడు వేల మంది వెళ్ళి హాయిని పట్టుకొనవచ్చును. శత్రువుల సంఖ్యస్వల్పము. సైన్యమంతయు శ్రమపడి అక్కడి వరకు పోనక్కరలేదు” అని చెప్పిరి.
4. మూడువేల మంది ప్రజలు హాయి పట్టణమును పట్టుకొనుటకు వెళ్ళిరి. కానివారు హాయి వీరులముందు నిలువ జాలక పారిపోయిరి.
5. హాయి ప్రజలు వారిలో ముప్పదియారు మందిని మట్టుప్టిెరి. మిగిలినవారిని నగర ద్వారమునుండి షేబారీము పల్లము వరకు తరిమి మోరాదు వద్ద సంహరించిరి. అప్పుడు ప్రజల గుండె చెదరిపోయెను.
యెహోషువ ప్రార్థన
6. అప్పుడు యెహోషువ తన వస్త్రములు చించు కొనెను. అతడును, యిస్రాయేలీయుల పెద్దలును తమ తలలపై దుమ్ముపోసికొని చీకి పడువరకు యావే మందసము ముందట సాష్టాంగపడియుండిరి.
7. ”అయ్యో ప్రభూ! యావే! నీవు ఈ ప్రజలను యోర్దాను నది ఏల దాించితివి? అమోరీయులచేతికి అప్పగించి నాశనము చేయుటకా? మేము యోర్దాను నదికి ఆవలి తీరముననే స్థిరపడియుండిన ఎంత బాగుండెడిది.
8. ప్రభూ! యిస్రాయేలీయులు శత్రువునకు వెన్ను చూపిరిగదా! ఇక ఇప్పుడేమనగలను?
9. కనానీయులు, ఈ దేశవాసులందరును ఈ సంగతి విందురు. వారందరు ఒక్కటై మమ్ము ఎదురింతురు. నేల మీది నుండి మా పేరు తుడిచివేయుదురు. నీ పేరు నిలుపు కొనుటకు నీవిక ఏమి చేయుదువు?” అని ప్రార్థించెను.
యావే సమాధానము
10. యావే యెహోషువతో ”లెమ్ము! ఇట్లు బోరగిలబడియుండనేల? యిస్రాయేలీయులు పాపము చేసిరి. నేను చేసిన నిబంధనను వారు అతిక్రమించిరి.
11. శపింపబడిన వస్తువులు దొంగిలించి దాచుకొని తమ సరకులలో కలుపుకొనిరి.
12. కావుననే యిస్రా యేలీయులు శత్రువులముందు నిలువలేకపోయిరి. శాపవస్తువులను మ్టుి తామును శాపమునకు గురి యైరి. అందుచే శత్రువులకు వెన్నుచూపిరి. శాపగ్రస్తు లైనవారు మీ మధ్యనుండకుండ మీరువారిని సంహ రించిననే తప్ప నేను మీకు తోడైయుండను.
13. లెమ్ము! ప్రజలను శుద్ధీకరించి వారితో ఈ విధముగా చెప్పుము. ‘రేపు మీరందరును శుద్ధిచేసి కొనుడు. ఇప్పుడు మీ మధ్య శాపగ్రస్తులైనవారు ఉన్నారు. మీరు ఈ శాపగ్రస్తులను సంహరించిననే తప్ప మీ శత్రువులను ఎదుర్కొనలేరు అని యావే యిస్రాయేలీయులకు సెలవిచ్చుచున్నాడు’ అని చెప్పుము.
14. కావున వేకువజామున తెగల క్రమము బ్టి మీరు ముందుకురావలయును. యావే సూచించు తెగవారు వంశక్రమమున ముందుకు రావలయును. యావే సూచించు వంశము కుటుంబముల ప్రకారము ముందుకు రావలెను. యావే సూచించు కుటుంబము లోని పురుషుల వరుస ప్రకారము ఒక్కొక్కరు ముందుకు రావలెను. 15. అప్పుడు శపింపబడిన వస్తువును దొంగిలించినవాడిని తన వారితోకలిపి అగ్నిలో కాల్చి వేయవలయును. ఏలయన, అతడు యావే నిర్ణయ మును మీరి యిస్రాయేలీయులలో దుష్కార్యము చేసెను” అని పలికెను.
దోషి శిక్షింపబడుట
16. యెహోషువ ఉదయముననే లేచి యిస్రా యేలీయులను వారి తెగల వరుస ప్రకారము చెంతకు రప్పించినపుడు యూదా తెగ పట్టుబడెను.
17. యూదా తెగను వంశముల ప్రకారము చెంతకు రప్పించినపుడు సెరా వంశము చిక్కెను. సెరా వంశములోని కుటుంబములను చెంతకు రప్పించి నపుడు సబ్ది కుటుంబము దొరకెను.
18. సబ్ది కుటుంబములోని పురుషులను వరుసగా చెంతకు రప్పించినపుడు యూదా తెగకు చెందిన సెరా ముని మనుమడును, సబ్ది మనుమడును, కర్మీ కుమారుడునైన ఆకాను పట్టుబడెను.
19.అప్పుడు యెహోషువ ”కుమారా! యిస్రాయేలు దేవుడైన యావేను స్తుతించి గౌరవింపుము. నీవేమి చేసితివో దాచక నాతో చెప్పుము” అని ఆకానును అడిగెను.
20. అంతట ఆకాను ”యిస్రాయేలు దేవుడైన యావే ఎడల నేను పాపముచేసిన మాట నిజమే. నేను చేసిన తప్పు ఇది.
21. దోపిడి వస్తువులందు ఒకమంచి షీనారు ఉత్తరీయమును, రెండువందల తులముల వెండిని, ఏబదితులముల ఎత్తుగల బంగారు కమ్మిని చూచి ఆశించి దొంగిలించితిని. వాిని నా గుడారమునందు భూమిలో పాతిప్టిెతిని. వెండికూడ వాి క్రిందనే ఉన్నది” అని యెహోషువతో చెప్పెను.
22. అతడు మనుష్యులను పంపెను. వారు ఆ డేరా దగ్గరకు పరుగెత్తుకొనిపోయిరి. ఉత్తరీయము దాచబడి యుండెను. వెండి ఆ వస్త్రము క్రింద ఉండెను.
23. వారు డేరా మధ్యనుండి వాిని తీసుకొని యెహోషువ, యిస్రాయేలీయులు సమావేశమైయున్న తావునకు కొనివచ్చి యావే సాన్నిధ్యమున ఉంచిరి.
24. అప్పుడు యెహోషువ సెరా కుమారుడగు ఆకానును, ఆ వెండిని, ఆ ఉత్తరీయమును, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులను, కుమార్తెలను, అతనికిచెందిన ప్రతి వస్తువును ఆకోరు లోయలోనికి కొనిపోయెను. యిస్రాయేలీయులును యెహోషువతో వెళ్ళిరి.
25. యెహోషువ ”నీవు మాకెంత శ్రమ కలిగించితివి! యావేగూడ నేడు నిన్ను శ్రమ పెట్టునుగాక!” అనెను. అంతట యిస్రాయేలీయులందరు అతనిని రాళ్ళతో క్టొి, తదుపరి అగ్నితో కాల్చివేసిరి.
26. అతని మీద పెద్ద రాళ్ళగుట్టను పేర్చిరి. అది నేికిని ఉన్నది. అప్పుడు యావే కోపము చల్లారెను. నాినుండి నేివరకు ఆ తావునకు ‘ఆకోరులోయ’ అని పేరు.